Jeremiah - యిర్మియా 34 | View All

1. బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

1. GOD's Message to Jeremiah at the time King Nebuchadnezzar of Babylon mounted an all-out attack on Jerusalem and all the towns around it with his armies and allies and everyone he could muster:

2. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించు చున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.

2. 'I, GOD, the God of Israel, direct you to go and tell Zedekiah king of Judah: 'This is GOD's Message. Listen to me. I am going to hand this city over to the king of Babylon, and he is going to burn it to the ground.

3. నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయ ముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖా ముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.

3. And don't think you'll get away. You'll be captured and be his prisoner. You will have a personal confrontation with the king of Babylon and be taken off with him, captive, to Babylon.

4. యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతి బొందెదవు.

4. ''But listen, O Zedekiah king of Judah, to the rest of the Message of GOD. You won't be killed.

5. నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా యేలినవాడా, అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

5. You'll die a peaceful death. They will honor you with funeral rites as they honored your ancestors, the kings who preceded you. They will properly mourn your death, weeping, 'Master, master!' This is a solemn promise. GOD's Decree.''

6. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలి యున్నవి,

6. The prophet Jeremiah gave this Message to Zedekiah king of Judah in Jerusalem, gave it to him word for word.

7. బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.

7. It was at the very time that the king of Babylon was mounting his all-out attack on Jerusalem and whatever cities in Judah that were still standing--only Lachish and Azekah, as it turned out (they were the only fortified cities left in Judah).

8. యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింప

8. GOD delivered a Message to Jeremiah after King Zedekiah made a covenant with the people of Jerusalem to decree freedom

9. వలెనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవాయొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

9. to the slaves who were Hebrews, both men and women. The covenant stipulated that no one in Judah would own a fellow Jew as a slave.

10. ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.

10. All the leaders and people who had signed the covenant set free the slaves, men and women alike.

11. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి.

11. But a little while later, they reneged on the covenant, broke their promise and forced their former slaves to become slaves again.

12. కావున యెహోవాయొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

12. Then Jeremiah received this Message from GOD:

13. ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.

13. 'GOD, the God of Israel, says, 'I made a covenant with your ancestors when I delivered them out of their slavery in Egypt. At the time I made it clear:

14. నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.

14. 'At the end of seven years, each of you must free any fellow Hebrew who has had to sell himself to you. After he has served six years, set him free.' But your ancestors totally ignored me.

15. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.

15. ''And now, you--what have you done? First you turned back to the right way and did the right thing, decreeing freedom for your brothers and sisters--and you made it official in a solemn covenant in my Temple.

16. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రు లుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి

16. And then you turned right around and broke your word, making a mockery of both me and the covenant, and made them all slaves again, these men and women you'd just set free. You forced them back into slavery.

17. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.

17. ''So here is what I, GOD, have to say: You have not obeyed me and set your brothers and sisters free. Here is what I'm going to do: I'm going to set you free--GOD's Decree--free to get killed in war or by disease or by starvation. I'll make you a spectacle of horror. People all over the world will take one look at you and shudder.

18. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;

18. Everyone who violated my covenant, who didn't do what was solemnly promised in the covenant ceremony when they split the young bull into two halves and walked between them,

19. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.

19. all those people that day who walked between the two halves of the bull--leaders of Judah and Jerusalem, palace officials, priests, and all the rest of the people--

20. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.

20. I'm handing the lot of them over to their enemies who are out to kill them. Their dead bodies will be carrion food for vultures and stray dogs.

21. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.

21. ''As for Zedekiah king of Judah and his palace staff, I'll also hand them over to their enemies, who are out to kill them. The army of the king of Babylon has pulled back for a time,

22. యెహోవా వాక్కు ఇదేనేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించు చున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియయూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

22. but not for long, for I'm going to issue orders that will bring them back to this city. They'll attack and take it and burn it to the ground. The surrounding cities of Judah will fare no better. I'll turn them into ghost towns, unlivable and unlived in.'' GOD's Decree.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 34 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బబులోనులో సిద్కియా మరణం గురించి ముందే చెప్పబడింది. (1-7) 
సిద్కియా నగరం స్వాధీనం చేసుకోబడుతుందని మరియు అతను బందీ అవుతాడని, అయితే అతను సహజ కారణాల నుండి దూరంగా ఉంటాడని సమాచారం. విలాసవంతంగా జీవించి చనిపోవడం కంటే పశ్చాత్తాపపడి జీవితాన్ని గడపడం తెలివైనది.

యూదులు తమ పేద సోదరులను చట్టవిరుద్ధమైన బానిసత్వానికి తిరిగి రావాలని బలవంతం చేసినందుకు మందలించారు. (8-22)
ఒక యూదు వ్యక్తి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం దాస్యంలో ఉండకూడదు. దురదృష్టవశాత్తు, వారు మరియు వారి పూర్వీకులు ఇద్దరూ ఈ చట్టాన్ని ఉల్లంఘించారు. ముట్టడి ఎత్తివేయబడుతుందని కొంత ఆశ ఉన్నట్లు అనిపించినప్పుడు, వారు గతంలో విడిపించిన సేవకులను తిరిగి బానిసత్వంలోకి నెట్టారు. నిష్కపటమైన పశ్చాత్తాపం మరియు పాక్షిక సంస్కరణలతో దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నించేవారు చివరికి తమను తాము ఎక్కువగా మోసం చేసుకుంటున్నారు.
పాపం చేసే స్వేచ్ఛ అంతిమంగా కఠినమైన తీర్పులకు దారితీస్తుందని ఇది నిరూపిస్తుంది. మనం మన కర్తవ్యాలను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు దయ యొక్క ఆశలను దేవుడు అడ్డుకోవడం న్యాయమే. సంస్కరణ అనేది భయం నుండి మాత్రమే ఉద్భవించినప్పుడు, అది చాలా అరుదుగా కొనసాగుతుంది. ఈ పద్ధతిలో చేసిన గంభీరమైన వాగ్దానాలు దేవుని శాసనాలను అపవిత్రం చేస్తాయి మరియు దేవునికి విజ్ఞప్తుల ద్వారా తమను తాము బంధించుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నవారు తరచుగా ఆ కట్టుబాట్లను త్వరగా ఉల్లంఘిస్తారు. మన పశ్చాత్తాపం నిజమైనదని మరియు దేవుని చట్టం మన చర్యలను నియంత్రిస్తుందని నిర్ధారించుకోవడానికి మన హృదయాలను పరిశీలించాలి.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |