Jeremiah - యిర్మియా 38 | View All

1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.

1. yehōvaa eelaagu selavichuchunnaaḍu ee paṭṭaṇamulō nilichiyunnavaaru khaḍgamuchethanainanu kshaamamu chethanainanu teguluchethanainanu chatthuru gaani kaldeeyulayoddhaku bayalu veḷluvaaru bradukuduru, dōpuḍusommudakkin̄chu konunaṭlu thama praaṇamu dakkin̄chukoni vaaru bradukuduru.

2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజల కందరికి ప్రకటింపగా

2. yehōvaa eelaagu selavichuchunnaaḍu ee paṭṭaṇamu nishchayamugaa babulōnuraaju daṇḍuchethiki appagimpabaḍunu, athaḍu daani paṭṭukonunu ani yirmeeyaa prajala kandariki prakaṭimpagaa

3. మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడుకాడు.

3. matthaanu kumaaruḍaina shephaṭya yunu pashooru kumaaruḍaina gedalyaayunu shelemyaa kumaaruḍaina yookalunu malkeeyaa kumaaruḍaina pashoorunu viniri ganuka aa pradhaanulu raajuthoo manavi chesina dhemanagaa ee manushyuḍu ee prajalaku nashṭamu kōruvaaḍēgaani kshēmamu kōruvaaḍukaaḍu.

4. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణ ములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.

4. ithaḍu iṭṭi samaachaaramu vaariki prakaṭana cheyuṭavalana ee paṭṭaṇa mulō nilichiyunna yōdhula chethulanu prajalandari chethulanu balaheenamu cheyuchunnaaḍu; chitthagin̄chi vaaniki maraṇashiksha vidhimpumu.

5. అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా

5. anduku raajaina sidkiyaa athaḍu meevashamuna unnaaḍu, raaju meeku aḍḍamu raajaalaḍanagaa

6. వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
హెబ్రీయులకు 11:36

6. vaaru yirmeeyaanu paṭṭukoni kaaraa gruhamulōnunna raajakumaaruḍagu malkeeyaa gōthi lōniki dimpiri. Andulōniki yirmeeyaanu traaḷlathoo dimpinappuḍu aa gōthilō neeḷlu lēvu, buradamaatramē yuṇḍenu, aa buradalō yirmeeyaa digabaḍenu.

7. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,

7. raaju benyaameenu dvaaramuna koorchuniyuṇḍagaa raaju iṇṭi lōni koosheeyuḍagu ebedmelekanu shaṇḍuḍu,

8. వారు యిర్మీ యాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

8. vaaru yirmee yaanu gōthilō vēsiranu saṅgathi vini, raaju nagarulō nuṇḍi bayaluveḷli raajuthoo eelaagu manavi chesenu

9. రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.

9. raajaa, naa yēlinavaaḍaa, aa gōthilō vēyabaḍina yirmeeyaa anu pravakthayeḍala ee manushyulu chesinadhi yaavatthunu anyaayamu; athaḍunna chooṭanu athaḍu akalichetha chachunu, paṭṭaṇamulōnainanu iṅkanu roṭṭe lēmiyu lēvu.

10. అందుకు రాజునీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్త యైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

10. anduku raajuneevu ikkaḍanuṇḍi muppadhimandi manushyulanu veṇṭabeṭṭukonipōyi, pravaktha yaina yirmeeyaa chaavakamunupu aa gōthilōnuṇḍi athani theeyin̄chumani koosheeyuḍagu ebedmelekunaku selaviyyagaa

11. ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టు కొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి,

11. ebedmeleku aa manushyulanu veṇṭabeṭṭu koni raajanagarulō khajaanaa krindi gadhilōniki vachi,

12. అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపిపాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.

12. acchaṭanuṇḍi paathavaina chiṅkibaṭṭalanu chirigi chiraakulaina guḍḍapaathalanu theesikoni pōyi, aa gōthilōnunna yirmeeyaa paṭṭukonunaṭlugaa traaḷlachetha vaaṭinidimpipaathavai chirigi chiraakulaina yee baṭṭalanu traaḷlameeda nee chaṅkalakrinda peṭṭukonumani athanithoo cheppenu.

13. యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

13. yirmeeyaa aalaagu cheyagaa vaaru yirmeeyaanu traaḷlathoo chedukoni aa gōthilōnuṇḍi velupaliki theesiri; appuḍu yirmeeyaa bandeegruhashaalalō nivasin̄chenu.

14. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో నున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెనునేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా

14. tharuvaatha raajaina sidkiyaa yehōvaa mandiramulō nunna mooḍava dvaaramulōniki pravakthayaina yirmeeyaanu piluvanampin̄chi athanithoo iṭlanenunēnu okamaaṭa ninnaḍuguchunnaanu, neevu ē saṅgathini naaku marugu cheyaka daani cheppumanagaa

15. యిర్మీయా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు.

15. yirmeeyaa nēnu aa saṅgathi neeku teliyajeppinayeḍala nishchayamugaa neevu naaku maraṇa shiksha vidhinthuvu, nēnu neeku aalōchana cheppinanu neevu naa maaṭa vinavu.

16. కావున రాజైన సిద్కియా జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయ జూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసెను.

16. kaavuna raajaina sidkiyaa jeevaatmanu mana kanugrahin̄chu yehōvaathooḍu nēnu neeku maraṇamu vidhimpanu, nee praaṇamu theeya joochuchunna yee manushyula chethiki ninnu appagimpanu ani yirmeeyaathoo rahasyamugaa pramaaṇamu chesenu.

17. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెనుదేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లిన యెడల నీవు బ్రదికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.

17. appuḍu yirmeeyaa sidkiyaathoo iṭlanenudhevuḍu, ishraayēlu dhevuḍunu sainyamulakadhipathiyunaina yehōvaa eelaagu selavichu chunnaaḍuneevu babulōnuraaju adhipathulayoddhaku veḷlina yeḍala neevu bradhikedavu, ee paṭṭaṇamu agnichetha kaalchabaḍadu, neevunu nee yiṇṭivaarunu bradukuduru.

18. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు.

18. ayithē neevu babulōnu adhipathula yoddhaku veḷlaniyeḍala ee paṭṭaṇamu kaldeeyula chethiki appagimpabaḍunu, vaaru agni chetha daani kaalchivēsedaru, mariyu neevu vaari chethilō nuṇḍi thappin̄chukonajaalavu.

19. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనుకల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.

19. anduku raajaina sidkiyaa yirmeeyaathoo iṭlanenukaldeeyula pakshamugaa uṇḍu yoodulaku bhayapaḍuchunnaanu; okavēḷa kaldeeyulu nannu vaari chethiki appagin̄chinayeḍala vaaru nannu apahasin̄chedaru.

20. అందుకు యిర్మీయావారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.

20. anduku yirmeeyaavaaru ninnappagimparu, neevu bradhiki baagugaanuṇḍunaṭlu nēnu neethoo cheppuchunna saṅgathinigoorchi yehōvaa selavichu maaṭanu chitthagin̄chi aalakin̄chumu.

21. నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.

21. neevu okavēḷa bayalu veḷlaka pōyinayeḍala yehōvaa ee maaṭa naaku teliyajēsenu.

22. యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.

22. yoodhaa raaju nagarulō shēshin̄chiyunna streelandaru babulōnu adhipathulayoddhaku konipōbaḍedaru, aalaagu jarugagaa aa streelu ninnu chuchinee priyasnēhithulu ninnu mōsapuchi nee paini vijayamu pondiyunnaaru, nee paadamulu buradalō digabaḍiyuṇḍagaa vaaru venukatheesirani yanduru.

23. నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.

23. nee bhaaryalandarunu nee pillalunu kaldeeyulayoddhaku konipōbaḍuduru, neevu vaari chethilōnuṇḍi thappin̄chukonajaalaka babulōnu raajuchetha paṭṭabaḍedavu ganuka ee paṭṭaṇamunu agnichetha kaalchuṭaku neevē kaaraṇamaguduvu.

24. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.

24. anduku sidkiyaa yirmeeyaathoo iṭlanenuneevu maraṇashiksha nonda kuṇḍunaṭlu ee saṅgathulanu evanikini teliyaniyyakumu.

25. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా

25. nēnu neethoo maaṭalaaḍina saṅgathi adhipathulu vininayeḍala vaaru neeyoddhaku vachi mēmu ninnu champakuṇḍunaṭlu raajuthoo neevu cheppina saṅgathini raaju neethoo cheppina saṅgathini marugucheyaka maakippuḍē teliyajeppumanagaa

26. నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.

26. neevu yōnaathaanu iṇṭilō nēnu chanipōkuṇḍa akkaḍiki nannu thirigi veḷlanampavaddani raaju eduṭa nēnu manavi chesikonabōthinani vaarithoo cheppumani raaju yirmeeyaathoo anenu.

27. అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకార ముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి.

27. anthaṭa adhipathulandaru yirmeeyaayoddhaku vachi yaḍugagaa athaḍu raaju selavichina maaṭala prakaara mugaa vaarikuttharamichi aa saṅgathi vaariki teliyajēyananduna vaaru athanithoo maaṭalaaḍuṭa maaniri.

28. యెరూష లేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.

28. yeroosha lēmu paṭṭabaḍuvaraku yirmeeyaa bandeegruhashaalalō uṇḍenu.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |