Jeremiah - యిర్మియా 41 | View All

1. ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.

1. ēḍava maasamuna eleeshaamaa manumaḍunu nethanyaa kumaaruḍunu raajavanshasthuḍunu raajuyokka pradhaanulalō nokaḍunagu ishmaayēlanuvaaḍunu, athanithoo padhi mandi manushyulunu, mispaalōnunna aheekaamu kumaaruḍaina gedalyaayoddhaku vachi akkaḍa athanithookooḍa mispaalō bhōjanamuchesiri.

2. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియ మించినందున అతని చంపిరి.

2. appuḍu nethanyaa kumaaruḍaina ishmaayēlu athanithoo kooḍanunna aa padhimandi manushyulunu lēchi shaaphaanu manumaḍunu aheekaamu kumaaruḍaina gedalyaanu khaḍgamuchetha hathamuchesiri; babulōnuraaju aa dheshamumeeda athani adhikaarinigaa niya min̄chinanduna athani champiri.

3. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదుల నందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.

3. mariyu mispaalō gedalyaa yoddha uṇḍina yoodula nandarini, akkaḍa dorikina yōdhulagu kaldeeyulanu ishmaayēlu champenu.

4. అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు

4. athaḍu gedalyaanu champina reṇḍavanaaḍu adhi evarikini teliyabaḍaka munupu

5. గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా

5. gaḍḍamulu kshauramu cheyin̄chukoni vastramulu chimpukoni dhehamulu gaayaparachukonina yenubadhimandi purushulu yehōvaa mandiramunaku theesikoni pōvuṭakai naivēdyamulanu dhoopadravyamulanu chethapaṭṭukoni shekemu nuṇḍiyu shilōhu nuṇḍiyu shomrōnunuṇḍiyu raagaa

6. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.

6. nethanyaa kumaaruḍaina ishmaayēlu daari poḍuguna ēḍchuchu, vaarini edurkonuṭaku mispaalōnuṇḍi bayalu veḷli vaarini kalisikoni vaarithoo aheekaamu kumaaruḍaina gedalyaa yoddhaku raṇḍanenu.

7. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.

7. ayithē vaaru aa paṭṭaṇamu madhyanu pravēshin̄chinappuḍu nethanyaa kumaaruḍaina ishmaayēlunu athanithookooḍa unnavaarunu vaarini champi gōthilō paḍavēsiri.

8. అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.

8. ayithē vaarilō padhimandi manushyulu ishmaayēluthoo polamulalō daachabaḍina gōdhumalu yavalu thailamu thēne modalaina dravyamulu maaku kalavu, mammunu champakumani cheppukonagaa athaḍu vaari sahōdarulathoo kooḍa vaarini champaka maanenu.

9. ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

9. ishmaayēlu gedalyaathookooḍa champina manushyula shavamulanniṭini paḍavēsina gōyi raajaina aasaa ishraayēlu raajaina bayashaaku bhayapaḍi travvin̄china goyyiyē; nethanyaa kumaaruḍaina ishmaayēlu champabaḍinavaari shavamulathoo daani nimpenu.

10. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

10. appuḍu ishmaayēlu mispaalōnunna janashēsha manthaṭini raaja kumaarthelanandarini anagaa raajadhehasanrakshakula kadhipathiyaina neboojaradaanu aheekaamu kumaaruḍaina gedalyaaku appagin̄china janulandarini, cheratheesikonipōyenu. Nethanyaa kumaaruḍaina ishmaayēlu vaarini cheratheesikonipōyi ammōneeyulayoddhaku cheravalenani prayatnapaḍuchuṇḍagaa

11. కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని

11. kaarēha kumaaruḍaina yōhaanaanunu athanithookooḍanunna sēnaadhipathulandarunu nethanyaa kumaaruḍaina ishmaayēlu chesina samastha dushkaaryamulanu goorchina vaartha vini

12. పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.

12. purushulanandarini piluchukoni, nethanyaa kumaaruḍaina ishmaayēluthoo yuddhamu cheyabōyi, gibiyōnulōnunna mahaa jalamula daggara athani kalisikoniri.

13. ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

13. ishmaayēluthoo kooḍanunna prajalandaru kaarēha kumaaruḍaina yōhaanaanunu, athanithoo kooḍanunna sēnaadhipathulanandarini chuchinappuḍu vaaru santhooshin̄chi

14. ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి.

14. ishmaayēlu mispaalō nuṇḍi cheragonipōyina prajalandaru athani viḍichi kaarēha kumaaruḍaina yehaanaanuthoo kalisiri.

15. అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి.

15. ayinanu, nethanyaa kumaaruḍaina ishmaayēlunu enamaṇḍuguru manushyulunu yōhaanaanu chethilōnuṇḍi thappin̄chukoni ammōneeyula yoddhaku paari pōyiri.

16. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత,

16. appuḍu nethanyaa kumaaruḍaina ishmaayēlu aheekaamu kumaaruḍaina gedalyaanu champina tharuvaatha,

17. కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;

17. kaarēha kumaaruḍaina yōhaanaanunu athanithoo kooḍanunna sēnala yadhipathulandarunu mispaa daggaranuṇḍi ishmaayēlu noddhanuṇḍi janashēshamanthaṭini, anagaa gibiyōnu daggaranuṇḍi ishmaayēlu konipōyina yōdhulanu streelanu pillalanu, raajaparivaaramunu marala rappin̄chiri;

18. అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.

18. ayithē vaaru babulōnuraaju dheshamumeeda adhikaarinigaa niyamin̄china aheekaamu kumaaruḍaina gedalyaanu nethanyaa kumaaruḍaina ishmaayēlu champinanduna vaaru kaldeeyulaku bhayapaḍi aigupthunaku veḷludamanukoni bētlehēmudaggaranunna geroothu kinhaamulō digiri.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |