“గద”– బబులోను యిర్మియా 50:23 లో సమ్మెటతోను, యిర్మియా 51:7 లో బంగారు పాత్రతోను పోల్చబడింది. ఇక్కడ దీన్ని గద అనడం కనిపిస్తున్నది (కొందరు దీని అర్థం మాదీయ, పారసీక జాతులు అని అభిప్రాయపడ్డారు). అయితే ఈ గద ఎవరి చేతుల్లో ఉందో చూడండి. బబులోను అనేక దేశాలను, జనాలను చితగ్గొట్టినప్పటికీ అది దేవుడు ఉపయోగించుకొన్న సాధనం మాత్రమే అని గమనించండి.