Jeremiah - యిర్మియా 6 | View All

1. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్‌ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.

1. బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!

2. సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్లగించుచున్నాను.

2. సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి .

3. గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.

3. కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని యెరూషలేముకు వస్తారు. వారు నగరం చుట్టూతమ గుడారాలు నిర్మించుకుంటారు. ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.

4. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.

4. వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి. లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం! ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.

5. లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.

5. కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”

6. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.

6. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి. ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి. ఈ నగరం శిక్షించబడాలి. ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.

7. ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయు చున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.

7. బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.

8. యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.

8. యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు. మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను. మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను. అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”

9. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరు దురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.

9. సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగుచేయుము . నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”

10. విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.
అపో. కార్యములు 7:51

10. నేనెవరితో మాట్లాడగలను?ఎవరిని హెచ్చరించగలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు. కావున నా హెచ్చరికలు వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు. యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.

11. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.

11. కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి! దానిని నేను లోపల ఇముడ్చుకో లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.

12. ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొల ములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు

12. వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి. వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు. నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.” ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.

13. అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.

13. “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు. కింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపటజీవనం సాగిస్తారు.

14. సమాధానములేని సమయమునసమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.
1 థెస్సలొనీకయులకు 5:3

14. ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు. అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు. ‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు. కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.

15. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెల విచ్చుచున్నాడు.

15. ప్రవక్తలు. యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి! కాని వారికి సిగ్గనేది లేదు. వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు. అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు. నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా కిందికి తోయబడతారు.” ఇది యెహోవా వాక్కు.

16. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పు చున్నారు.
మత్తయి 11:29

16. యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము. పాతబాట ఏదో అడిగి తోలిసికో. ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము. అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు. కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’మన్నారు.

17. మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.

17. నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని. కాని వారన్నారు: ‘మేము వినము.’

18. అయితే మేము వినమని వారను చున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.

18. కావున, సర్వదేశవాసులారా వినండి! ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి . నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!

19. భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.

19. భూలోకవాసులారా, ఇది వినండి: యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను. ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే. వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”

20. షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్ట మైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.

20. యెహోవా ఇలా అన్నాడు: “మీరు షేబ దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు? దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు? మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు! మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”

21. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును; తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు; ఇరుగుపొరుగువారును నశించెదరు.

21. అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:”యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను. ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి. తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు. స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”

22. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంత ములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.

22. యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.

23. వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.

23. సైనికులు విల్లంబలు, ఈ టెలు పట్టుకొనివస్తారు. వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు. వారు మిక్కిలి శక్తిమంతులు! వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది. ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది. ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”

24. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.

24. ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.

25. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.

25. మీరు పొలాల్లోకి వెళ్లవద్దు! మీరు బాట వెంబడి వెళ్లవద్దు. ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి. పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.

26. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.

26. ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి. బూడిదలో పొర్లండి . చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి! మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి. ఇవన్నీ మీరు చేయండి; కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!

27. నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి యున్నాను. ఒ

27. “యిర్మీయా, నేను (యెహోవా) నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను. నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు, వారిని గమనిస్తూ ఉండుము.

28. వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.

28. నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు చాలా మొండివారు. వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.

29. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టు చున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.

29. నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలను కోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.

30. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.

30. ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు. యెహోవా వారిని ఆమోదించలేదు గనుక వారికాపేరు పెట్టబడింది.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జుడియా దండయాత్ర. (1-8) 
ఏ పద్ధతులు అవలంబించినా, దేవుని తీర్పులను సవాలు చేయడం వ్యర్థం. ఈ భూసంబంధమైన జీవితపు ఆనందాలలో మనం ఎంతగా మునిగిపోతామో, దాని అనివార్యమైన పరీక్షలకు మనం అంతగా సిద్ధపడకుండా ఉంటాము. కల్దీయుల సైన్యం యూదా దేశాన్ని ఆక్రమించి దాని మార్గంలో ఉన్న సమస్తాన్ని వేగంగా నాశనం చేస్తుంది. తమ పాపపు మార్గాలలో అజాగ్రత్తగా మరియు సురక్షితంగా ఉన్నవారు పరిణామాలను ఎదుర్కొనే రోజు ఆసన్నమైంది. మన శాశ్వతమైన మోక్షాన్ని మరియు ఆ మోక్షానికి విరోధులతో చిన్నబుచ్చుకోవడం పూర్తిగా మూర్ఖత్వం. అయినప్పటికీ, వారి ఆత్రుత దేవుని ప్రణాళికలను నెరవేర్చాలనే కోరికతో నడపబడదు, కానీ తమను తాము సుసంపన్నం చేసుకోవాలనే కోరికతో నడపబడదు, అయినప్పటికీ దేవుడు తన స్వంత మార్గంలో, వారి చర్యల ద్వారా ఇప్పటికీ తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. చెడిపోయిన మానవ హృదయం, దాని సహజ స్థితిలో, నిరంతరం చెడ్డ ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది, ఒక నీటిబుగ్గ ఎడతెగకుండా తన జలాలను ప్రవహిస్తుంది-అది అంతు లేకుండా ప్రవహిస్తుంది, అయినప్పటికీ నిండుగా ఉంటుంది. దయగల దేవుడు దారితప్పిన వ్యక్తులను కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడడు మరియు పశ్చాత్తాపం చెందడానికి మరియు సంస్కరించమని వారిని హృదయపూర్వకంగా పిలుస్తాడు, తద్వారా విషయాలు భయంకరమైన ముగింపుకు రాకుండా నిరోధించబడతాయి.

దేవుని విచారణల న్యాయం. (9-17) 
తన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభువు లేచినప్పుడు, పాపులెవరూ, వారి వయస్సు, హోదా లేదా లింగంతో సంబంధం లేకుండా, అతని తీర్పు నుండి తప్పించుకోలేరు. వారు ప్రపంచం యొక్క ఆకర్షణతో ఆకర్షించబడ్డారు మరియు దాని పట్ల వారి ప్రేమతో పూర్తిగా వినియోగించబడ్డారు. దేవుని బోధల వెలుగులో మనం ఈ పాపాన్ని అంచనా వేస్తే, ప్రతి స్థానం మరియు సామాజిక వర్గంలో లెక్కలేనన్ని వ్యక్తులను మనం కనుగొంటాము. మన అత్యంత నమ్మకద్రోహమైన మరియు ప్రమాదకరమైన విరోధులు పాపపు మార్గాల్లో మనలను ప్రోత్సహించే వారు. ప్రజలు వారి ఆత్మల కొరకు జ్ఞానవంతులుగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను! సమయం-పరీక్షించిన మార్గాలను అన్వేషించండి-దైవభక్తి మరియు నీతి యొక్క మార్గాలు, అవి ఎల్లప్పుడూ దేవుడు ఆమోదించిన మరియు ఆశీర్వదించిన మార్గాలు. దేవుని వ్రాతపూర్వక వాక్యం ద్వారా ప్రకాశించే పురాతన మార్గాలను వెతకండి. మీరు సరైన మార్గాన్ని కనుగొన్న తర్వాత, దానిలో నడవడం కొనసాగించండి, ఎందుకంటే మీ ప్రయాణం ముగింపులో మీకు సమృద్ధిగా బహుమతులు లభిస్తాయి. అయితే, వ్యక్తులు దేవుని స్వరాన్ని వినడానికి నిరాకరిస్తే మరియు ఆయన నియమించబడిన ఆశ్రయంలో ఆశ్రయం పొందితే, వారి పతనం దేవుని వాక్యాన్ని తిరస్కరించడం వల్లనే అని తీర్పు రోజున బాధాకరంగా స్పష్టమవుతుంది.

వాటిని సవరించడానికి ఉపయోగించిన అన్ని పద్ధతులు విజయవంతం కాలేదు. (18-30)
వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం దేవుడు వారి బాహ్య ఆరాధనలను వ్యర్థమని కొట్టిపారేశాడు. బలులు మరియు ధూపం వాటిని మధ్యవర్తి వైపు సూచించడానికి ఉద్దేశించబడ్డాయి, కానీ పాపంలో కొనసాగడానికి అనుమతిని కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో అందించినప్పుడు, అవి దేవుణ్ణి రెచ్చగొట్టాయి. దేవుణ్ణి అనుసరిస్తున్నామని చెప్పుకునే వారి అతిక్రమణలు వారిని తమ విరోధులకు హాని కలిగిస్తాయి. వారు తమను తాము సురక్షితంగా చూపించలేరు. పరిశుద్ధులు దేవుని వాగ్దానాలలో మాత్రమే దానిని గ్రహించగలిగినప్పటికీ, దేవుని దయ యొక్క ఆశతో సంతోషించగలరు. మరోవైపు, పాపులు దేవుని తీర్పులకు భయపడి దుఃఖించాలి, ఆ తీర్పులు బెదిరింపుల రూపంలో మాత్రమే ఉంటాయి. ఈ వ్యక్తులు తిరుగుబాటుదారులలో అత్యంత చెడ్డవారు మరియు పూర్తిగా అవినీతిపరులు. పాపులు త్వరగా టెంప్టర్‌లుగా మారిపోతారు, ఒకప్పుడు విలువైన లోహాన్ని కలిగి ఉన్నారని భావించారు, కానీ చివరికి పూర్తిగా పనికిరానిదిగా రుజువు చేస్తారు. వారి పాపాల నుండి వారిని వేరు చేయడంలో ఏదీ విజయం సాధించదు. అవి నిష్ఫలమైన వెండి, పూర్తిగా పనికిరానివి మరియు విలువ లేనివిగా ముద్రించబడతాయి. హెచ్చరికలు, దిద్దుబాట్లు, మందలింపులు మరియు దయ యొక్క అన్ని సాధనాలు ప్రజలను మార్చడంలో విఫలమైనప్పుడు, వారు దేవునిచే విడిచిపెట్టబడతారు మరియు శాశ్వతమైన బాధలకు ఖండించబడతారు. కావున, వెండి శుద్ధి చేయబడినట్లు ప్రభువు మనలను శుద్ధి చేయమని ప్రార్థిద్దాం.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |