Jeremiah - యిర్మియా 9 | View All

1. నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

1. నా తన నీటితో నిండియున్నట్లయితే, నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!

2. నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.

2. ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం ఎడారిలో నాకొకటి ఉంటే అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను. వారినుండి నేను దూరంగా పోగలను! ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు. వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.

3. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

3. “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. వారు నన్నెరుగకున్నారు.” ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.

4. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

4. “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు! ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే. ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.

5. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

5. ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును. ఎవ్వడూ సత్యం పలుకడు. యూదా ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!

6. నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

6. ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది. అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి! ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ విషయాలను యెహోవా చెప్పినాడు!

7. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?

7. కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు.

8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.

8. యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నార్లు అబద్ధాలనే మాట్లాడతాయి. ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.

9. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

9. [This verse may not be a part of this translation]

10. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.

10. నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను. ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి. ఎవ్వడూ అక్కడ పయనించడు. ఆ ప్రదేషశాలలో పశువుల అరుపులు వినరావు. పక్షులు ఎగిరి పోయాయి: పశువులు పారిపోయాయి.

11. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయున్నాను, యూదా పట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
ప్రకటన గ్రంథం 18:2

11. “నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”

12. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?

12. ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.

13. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడువారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

13. యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు ఇచ్చాను. కాని వారు వినటానికి నిరాకరించారు. వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.

14. తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.

14. యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”

15. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
ప్రకటన గ్రంథం 8:11

15. సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు, “యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను. విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.

16. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గ మును పంపుదును.

16. యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు. కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. యూదా ప్రజలను వారు చంపివేస్తారు. ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

17. సర్వాశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము! శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను విలపించుము. కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.

18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

18. ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి. అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి. కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.

19. మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.

19. “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, ‘మేము నిజంగా నాశనమయ్యాము! మేము నిజంగా అవమానం పాలైనాము! మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”

20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

20. యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి. యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనొగ్గండి. యెహోవా ఇలా అంటున్నాడు, “మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి. ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:

21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

21. ‘మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది. మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది. వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది. బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.’

22. యెహోవా వాక్కు ఇదేనీవీమాట చెప్పుముచేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చ కుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

22. “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము, పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి. పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.”‘

23. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.

23. యెహోవా ఇలా చెపుతున్నాడు: “తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి గొప్పలు చెప్పుకోరాదు. బలవంతులు తమ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకోరాదు. శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకోరాదు.

24. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
1 కోరింథీయులకు 1:31, 2 కోరింథీయులకు 10:17

24. ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం చేసికున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసికున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనియి. యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.

25. అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారు కారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారి వలెనుండు
రోమీయులకు 2:25

25. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

26. ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
అపో. కార్యములు 7:51

26. [This verse may not be a part of this translation]Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |