Lamentations - విలాపవాక్యములు 1 | View All

1. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

1. యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం. కాని ఘోరంగా నిర్జనమయ్యంది! ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం. కాని అది విధవరాలుగా అయింది. ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది. కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.

2. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.

2. ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది. ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి. ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు. ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ ఆమెను ఓదార్ఛలేదు. ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు. ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.

3. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక

3. అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది. మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది. యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది. ఆమెకు విశ్రాంతిలేదు. ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు. ఆ ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.

4. సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.

4. సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి. అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే. సీయోను ద్వారాలు పాడుబడినాయి. సీయోను యాజకులు మూల్గుచున్నారు. సీయోను యువతులు పట్టుబడ్డారు. ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.

5. దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి

5. యెరూషలేము శత్రువులు గెలిచారు. ఆమె శత్రువులు విజయవంతులయ్యారు. యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది. యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు. ఆమె పిల్లలు వెళ్ళిపోయారు. వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.

6. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి.

6. సీయోను కుమార్తె అందం మాయమయ్యింది. ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు. గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు. శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు. తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.

7. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి.

7. యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది. పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది. శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది. ఆమెకు క లిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది. ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు. ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.

8. యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది

8. యెరూషలేము ఘోరంగా పాపం చేసింది. యెరూషలేము పాపాల కారణంగా ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది. ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు. ఆమెను వారు నగ్నంగా చూశారు, గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు. యెరూషలేము మూల్గుతూ ఉంది. ఆమె వెనుదిరిగి పోతూవుంది.

9. దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.

9. యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరిగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నాశత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.

10. దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది

10. శత్రువు తన చేతిని చాచాడు. అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమెచూసింది. ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.

11. దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.

11. యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు! ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.

12. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి.

12. త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష పెట్టినట్లు లేదు. కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి. నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా? నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా? యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా? ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.

13. పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.

13. యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు ఆ అగ్ని నా ఎముకలకంటింది. ఆయన నా కాళ్లకు వలపన్నాడు. ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు. ఆయమన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు. నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.

14. కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.

14. “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి. యెహోవా చేతుల్లో నా పాపాలు మూటగట్టబడ్డాయి. యెహోవా కడి నా మెడ మీద ఉంది. యెహోవా నన్ను బలహీన పర్చాడు. నేను ఎదిరించలేని ప్రజలకు యెహోవా నన్ను అప్పజెప్పాడు.

15. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల నందరిని కొట్టివేసెను నా ¸యౌవనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం చెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు.
ప్రకటన గ్రంథం 14:20, ప్రకటన గ్రంథం 19:15

15. “బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు. ఆ సైనికులంతా నగరంలోనివారే పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా మీదికి తెచ్చాడు. నా యువ సైనికులను చంపటానికే ఆయన ఆ జనాన్ని తీసుకొని వచ్చాడు. ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు) యెహోవా అడుగువేసి త్రొక్కాడు. ఆ ద్రాక్షా గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి.

16. వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి.

16. “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను. నా కళ్ళు; కన్నీళ్లతో తడిసిపోయాయి. నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు. నన్ను ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు. నా పిల్లలు బంజ రు భూమిలా ఉన్నారు. శత్రువు గెలవటంతో వారలా తాయారయ్యారు.”

17. ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని విరోధులైయుండ నియమించియున్నాడు యెరూషలేము వారికి హేయమైనదాయెను.

17. సీయోను తన చేతులు చాపింది. ఆమెను ఆదరించేవారెవ్వరూ లేరు. యాకోబు శత్రువులకు యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యాకోబు శత్రువులకు అతనిని చుట్టుముట్టుమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది. ఆ శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది.

18. యెహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలును నా ¸యౌవనులును చెరలోనికిపోయి యున్నారు

18. “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను. అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూంవుంది. కావున ప్రజలారా, వినండి! నా బాధను గమనించండి! నా యువతీ యువకులు బందీలైపోయారు.

19. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.

19. నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను మోసగించారు. నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వేషించారు. వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.

20. యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

20. “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె తల్లిక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది! నా కలవరపాటుకు కారణం నేను మొండిగా తిరిగుపబాటు చేయటమే! నా పిల్లలు నడివీదుల్లో కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.

21. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.

21. “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను. ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు. నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు. విని సంతోషపడ్డారు. నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు. నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము. ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.

22. వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.

22. “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు, అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము. పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”Shortcut Links
విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |