Ezekiel - యెహెఙ్కేలు 22 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. mariyu yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavicchenu.

2. నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.

2. naraputrudaa, praanahaani cheyu ee pattanamunaku neevu theerpu theerchuduvaa? daaniki neevu theerpu theerchunedala adhicheyu heyakriyalannitini daaniki teliyajesi yeelaaguna prakatimpavalenu.

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసి కొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,

3. prabhuvaina yehovaa selavichunadhemanagaa nee kaalamu vachunatlu narahatyalu cheyu pattanamaa, ninnu apavitraparachukonunatlu vigrahamulu pettukonu pattanamaa, neevu chesina narahatyalachetha neeku neeve nerasthaapana chesi kontivi, neevu pettukonina vigrahamulachetha ninnu neeve apavitraparachukontivi,

4. నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియ మించుచున్నాను.

4. neeku neeve shiksha teppinchu kontivi, shikshaa samvatsaramulu vachutaku neeve kaarana maithivi. Kaabatti anyajanamulalo nindaaspadamugaanu, sakaladheshamulalo apahaasyaaspadamugaanu ninnu niya minchuchunnaanu.

5. సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదాన వనియు నిన్ను అపహసింతురు.

5. sameepasthulemi doorasthulemi andarunu apakeerthi pondinadaanavaniyu allarithoo nindinadaana vaniyu ninnu apahasinthuru.

6. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,

6. neeloni ishraayeleeyula pradhaanulandarunu thama shakthikoladhi narahatyacheyuduru,

7. నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

7. neelo thalidandrulu avamaanamonduduru, nee madhyanunna paradheshulu daurjanyamu nonduduru, neelo thandrileni vaarunu vidhavaraandrunu hinsimpabaduduru,

8. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

8. naaku prathishthithamulagu vasthuvulanu neevu truneekarinchuchunnaavu, naa vishraanthidinamulanu neevu apavitraparachuchunnaavu.

9. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.

9. kondemulu cheppi narahatya cheyuvaaru neelo kaapuramunnaaru, parvathamulameeda bhojanamu cheyuvaaru nee madhya nivasinchuchunnaaru, neelo kaama vikaara cheshtalu jaruguchunnavi.

10. తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.

10. thama thandri maanaacchaadhanamu theeyu vaaru neelo nunnaaru, ashuchiyai bahishtiyaina streeni cherupuvaaru neelo kaapuramunnaaru.

11. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.

11. okadu thana poruguvaani bhaaryanu koodi heyakriyalu cheyunu, mariyokadu kaamaathurudai thana kodalini apavitraparachunu, neelo janulu thandri kumaartheyagu thama sahodarini cherupuduru.

12. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

12. nannu marachipoyi narahatyakai lanchamu puchukonuvaaru neelo nunnaaru, appichi vaddi puchukoni nee poruguvaarini baadhinchuchu neevu balavanthamugaa vaarini dochukonuchunnaavu; idhe prabhuvaina yehovaa vaakku.

13. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.

13. neevu puchukonina anyaaya laabhamunu, neevu chesina narahatyalanu nenu chuchi naa chethulu charachukonuchunnaanu.

14. నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై

14. nenu neeku shiksha vidhimpa bovukaalamuna orchukonutaku chaalinantha dhairyamu nee hrudayamunaku kaladaa? Sahinchunantha balamu nee kundunaa? Yehovaanagu nene maata ichiyunnaanu, daanini nenu neraverthunu, nee apavitrathanu botthigaa theesi veyutakai

15. అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.

15. anyajanulalo ninnu chedharagottudunu, ithara dheshamulaku ninnu vellagottudunu.

16. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్ఠుడవై నేను యెహోవానని నీవు తెలిసికొందువు.

16. acchata anyajanula edutane nee anthata neeve bhrashthudavai nenu yehovaanani neevu telisikonduvu.

17. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

17. mariyu yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavicchenu

18. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.

18. naraputrudaa, ishraayeleeyulu naa drushtiki mashtuvantivaarairi, andarunu kolimi loni itthadiyu thagaramunu inumunu seesamu nairi, vaaru vendi mashtuvantivaarairi.

19. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టు వంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

19. kaavuna prabhuvaina yehovaa selavichunadhemanagaa meerandarunu mashtu vantivaaraithiri. Nenu mimmunu yerooshalemu madhyanu poguchesedanu, okadu vendiyu itthadiyu inumunu seesamunu thagaramunu poguchesi kolimilo vesi daanimeeda agni oodi kariginchinatlu

20. నా కోపము చేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.

20. naa kopamu chethanu raudramuchethanu mimmunu poguchesi akkada mimmunu kariginthunu.

21. మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.

21. mimmunu poguchesi naa kopaagnini meemeeda oodagaa nishchayamugaa meeru daanilo karigipovuduru.

22. కొలి మిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.

22. koli milo vendi karugunatlu meeru daanilo karigipovuduru, appudu yehovaanaina nenu naa krodhamunu meemeeda kummarinchithinani meeru telisikonduru.

23. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

23. mariyu yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavicchenu

24. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము నీవు పవిత్రము కాని దేశమువై యున్నావు

24. naraputrudaa, yerooshalemunaku neeveemaata prakatimpumu neevu pavitramu kaani dheshamuvai yunnaavu

25. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించు చుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు,

25. ugratha dinamandu neeku varshamu raadu,andulo pravakthalu kutracheyuduru,garjinchu chundu simhamu vetanu chilchunatlu vaaru manushyulanu bhakshinthuru. Sotthulanu dravyamunu vaaru pattukonduru, daanilo chaalaamandhini vaaru vidhavaraandrugaa cheyuduru,

26. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాక రించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొను టకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

26. daani yaajakulu naa dharmashaastramunu niraaka rinchuduru, naaku prathishthithamulagu vasthuvulanu apavitra parachuduru, prathishthithamainadaanikini saadhaaranamainadaanikini bhedamencharu, pavitramedo apavitramedo telisikonu taku janulaku nerparu, nenu vidhinchina vishraanthidinamulanu aacharimparu, vaari madhya nenu dooshimpabaduchunnaanu.

27. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.
మత్తయి 7:15

27. daanilo adhipathulu laabhamu sampaadhinchutakai narahatya cheyutalonu manushyulanu nashimpajeyutalonu vetanu chilchu thoodellavale unnaaru.

28. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూతపూయువారై యున్నారు.

28. mariyu daani pravakthalu vyarthamaina darshanamulu kanuchu, yehovaa emiyu selaviyyanappudu prabhuvaina yehovaa yeelaagu selavichuchunnaadani cheppuchu, vattisodegaandrayi janulu kattina mantigodaku gachupoothapooyuvaarai yunnaaru.

29. మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.

29. mariyu saamaanya janulu balaatkaaramucheyuchu dongilinchuduru, vaaru deenulanu daridrulanu hinsinchuduru, anyaayamugaa vaaru paradheshulanu baadhinchuduru.

30. నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

30. nenu dheshamunu paaducheyakundunatlu praakaaramunu dittaparachutakunu, baddalaina sandulalo niluchutakunu, thagina vaadevadani nenu entha vichaarinchinanu okadainanu kanabada ledu.

31. కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ప్రకటన గ్రంథం 16:1

31. kaavuna nenu naa krodhamunu vaarimeeda kummarinthunu, vaari pravarthana phalamu vaarimeediki rappinchi naa ugrathaagnichetha vaarini dahinthunu; idhe prabhuvaina yehovaa vaakku.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 22 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం పాపాలు. (1-16) 
రక్తపాత నగరం - జెరూసలేం అని పిలువబడే హింసతో నిండిన నగరంపై తీర్పు చెప్పే బాధ్యత ప్రవక్తపై ఉంది. అనేక అపరాధాల కారణంగా ఈ పేరు దీనికి ఇవ్వబడింది. జెరూసలేం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరాలు చాలా దుర్మార్గమైనవి. వీటిలో హత్య, విగ్రహారాధన, తల్లిదండ్రుల అధికారాన్ని ధిక్కరించడం, అణచివేత, దోపిడీ, సబ్బాత్ మరియు పవిత్ర ఆచారాలను అపవిత్రం చేయడం, ఏడవ ఆజ్ఞను ఉల్లంఘించడం, లైసెన్సియస్ మరియు వ్యభిచారం వంటివి ఉన్నాయి. ఈ దుస్థితికి మూలం దేవుడిని మరచిపోవడమే. పాపులు దేవుణ్ణి స్మృతి చేయడంలో విఫలమైనప్పుడు ఆయనను రెచ్చగొడతారు. జెరూసలేం ఇప్పుడు తన పాపపు పనుల పూర్తి స్థాయికి చేరుకుంది. తమ కోరికల ఊబికి లొంగిపోయేవారు ఆ కోరికల పర్యవసానాలకు సరిగ్గా గురవుతారు. తమ స్వంత యజమానులుగా ఉండాలని పట్టుబట్టే వారు తమ స్వంత చర్యలు అందించగల దానికంటే గొప్ప ఆనందాన్ని ఆశించకూడదు మరియు అది నిజంగా దౌర్భాగ్యమైన భాగం అని రుజువు చేస్తుంది.

ఇజ్రాయెల్ చెత్తగా ఖండించబడింది. (17-22) 
ఇతర దేశాలతో పోలిస్తే, ఇజ్రాయెల్ ఒకప్పుడు మూల లోహాల మధ్య బంగారం మరియు వెండిలా ప్రకాశవంతంగా మెరిసిపోయింది. అయినప్పటికీ, అవి ఇప్పుడు పనికిరాని ముద్దలా మారాయి, కొలిమిలో వినియోగించబడాలి లేదా వెండిని శుద్ధి చేసే ప్రక్రియలో విస్మరించబడతాయి. దేవుని దృష్టిలో, పాపులు, ముఖ్యంగా తమ విశ్వాసం నుండి తప్పుకున్నవారు, పనికిరానివారు మరియు ఉద్దేశ్యం లేనివారుగా పరిగణించబడ్డారు.
దేవుడు తన స్వంత ప్రజలను పరీక్షలకు గురిచేయడానికి అనుమతించినప్పుడు, బంగారం శుద్ధీకరణను పర్యవేక్షిస్తున్న శుద్ధి చేసేవారిలా ఆయన వారిని చూసాడు. అతని ఉనికిని వారు అవసరానికి మించి కొలిమిలో ఉండకుండా చూసుకున్నారు. మలినాలు పూర్తిగా తొలగించబడతాయి, శుద్ధి చేయబడిన మరియు శుద్ధి చేయబడిన పదార్ధం మాత్రమే మిగిలిపోతుంది.
బాధలు, బాధలు భరించడం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరియు ఈ చిన్న మరియు నశ్వరమైన బాధల వల్ల తమ హృదయాలు ఉప్పొంగిపోతాయని భావించేవారు, వారు జాగ్రత్త వహించాలి మరియు రాబోయే దైవిక తీర్పు నుండి ఆశ్రయం పొందాలి. పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన శక్తి ద్వారా ఈ పరీక్షలను పవిత్రం చేయకపోతే, వారి హృదయాలను శుద్ధి చేసి, పాపం నుండి వారిని శుద్ధి చేయకపోతే, వారికి మరింత తీవ్రమైన కష్టాలు వస్తాయి.

అవినీతి సాధారణమైనట్లే, శిక్ష కూడా అలాగే ఉంటుంది. (23-31)
సమాజంలోని ప్రతి విభాగం దేశం యొక్క అపరాధం పేరుకుపోవడానికి దోహదపడింది. ఏ విధమైన అధికారాన్ని కలిగి ఉన్నవారు తరచుగా దానిని దుర్వినియోగం చేస్తారు, అయితే కొనుగోలు మరియు అమ్మకంలో నిమగ్నమై ఉన్నవారు కూడా తమ తోటి పౌరులను అణచివేయడానికి మార్గాలను కనుగొన్నారు. ఒక సమాజం తీర్పుల ప్రారంభాన్ని చూసినప్పుడు మరియు ప్రార్థన యొక్క ఆత్మలో క్షీణతను అనుభవిస్తే, అది అరిష్ట సంకేతం.
దేవుణ్ణి గౌరవించే వారందరూ ఆయన సత్యాన్ని మరియు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కలిసి రావాలి. ఇది చాలా కీలకమైనది ఎందుకంటే దుష్ట ఉద్దేశం ఉన్న వ్యక్తులు, వారి సామాజిక స్థితి లేదా వృత్తితో సంబంధం లేకుండా, ఈ విలువలను అణగదొక్కడానికి తరచుగా కుట్ర చేస్తారు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |