Ezekiel - యెహెఙ్కేలు 23 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:

2. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.

2. “నరపుత్రుడా, సమరయ, యెరూషలేములను గురించిన ఈ కథ ఆలకించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఒక్క తల్లి కడుపునే పుట్టారు.

3. వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.

3. చిన్న వయస్తులో ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యులను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు చన్నులను పట్టుకోనిచ్చారు.

4. వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.

4. పెద్ద కుమారై పేరు ఒహొలా . ఆమె చెల్లిలి పేరు ఒహొలీబా . ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు కలిగారు. (నిజానికి ఒహొలాయే సమరయ. ఒహొలీబాయే యెరూషలేము.)

5. ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

5. “అప్పుడు ఒహొలా నా పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించింది. ఆమె ఒక వేశ్యలా జీవించసాగింది. తన విటులను కోరుకోనారంభించింది. ఊదారంగు బట్టలు వేసుకున్న అష్షూరు సైనికులను ఆమె చూసింది.

6. తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.

6. గుర్రాలపై వెళ్లే ఆ సైనికులంతా కోరుకో తగ్గ యువకులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు.

7. అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.

7. ఆ మనుష్యులందరికి ఒహొలా తనను తాను సమర్పించుకుంది. అష్టూరు సైన్యంలో వారంతా ప్రత్యేకంగా ఎంపిక చేయబడినవారు. వాళ్లందరినీ ఆమె కోరుకొంది! వారి రోత విగ్రహాలతో ఆమె కూడ మలినపర్చబడింది.

8. మరియఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.

8. దానికి తోడు, ఈజిప్టుతో తన ప్రేమ కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈజిప్టు ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వనపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిప్టు. ఈజిప్టు తన దొంగ ప్రేమనంతా ఆమెపై ఒలకపోశాడు.

9. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను.

9. అందువల్ల ఆమె విటులను ఆమెను పొందడానికి రానిచ్చాను. ఆమె అష్టూరును కోరుకుంది. ఆందుచే నేనామెను వారికిచ్చాను!

10. వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.

10. వారామెకు మానభంగం కావించారు. వారు ఆమె పిల్లలను ఎత్తుకుపోయారు. తరువాత వారు కత్తితో ఆమెను చంపివేశారు. వారామెను అలా శిక్షించారు. స్త్రీలు ఆమెను గురించి ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు.

11. దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.

11. “తన చిన్న సోదరి ఒహొలీబా ఇవన్నీ జరగటం చూసింది. అయినా తన అక్కకంటె ఒహొలీబా ఎక్కువ పాపాలు చేసింది! ఒహొలాకంటె ఈమె మరీ విశ్వాసంలేని స్త్రీ అయింది.

12. ప్రశస్త వస్త్ర ములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల ¸యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.

12. ఈమె అష్షూరు నాయకులను, అధికారులను కోరుకొంది. ఊదా బట్టల్లో గుర్రాలమీద స్వారీచేసే ఆ సైనికులను ఆమె కోరుకొంది. వారంతా ఆశించదగ్గ యువకులు.

13. అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.

13. ఒకే రకమైన తప్పులతో ఆ ఇద్దరు స్త్రీలు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నట్ల నేను చూశాను.

14. మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై

14. “ ఒహొలీబా నాపట్ల విశ్వాసం లేకుండ కొన సాగింది. బబులోను (బాబిలోనియా)లో గోడలమీద చెక్కిన మనుష్యుల బొమ్మలను చూసింది. ఇవి ఎర్రని బట్టలు ధరించిన కల్దీయ మనుష్యుల బొమ్మలు.

15. సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీ యుల పటములను చూచి మోహించెను.

15. వారి నడుమున చూట్టు పటకాలు, తలలపైన పొడుగాటి తలపాగాలు ధరించి వున్నారు. ఆ మనుష్యులందరు రథాధిపతుల వలె వున్నారు. వారంతా బబులోనులో జన్మించిన వారుగనే కన్పించారు.

16. అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా

16. మరి ఒహొలీబా వారందరినీ కావాలనుకొంది.

17. బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్ర పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.

17. కావున ఆ బబులోను మనుష్యులందరూ ఆమెతో సంభోగించటానికి ఆమె ప్రేమ పాన్పు మీదికి వచ్చారు. ఆమెను విచ్చల విడిగావాడుకొని, చివరకు ఆమె వారిని చీదరించుకునేలా ఆమెను అపవిత్రపరచారు.

18. ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.

18. “ ఒహొలీబా తన అవిశ్వాసాన్ని అందరూ గమనించేలా ప్రవర్తించింది. ఆమె తన నగ్నత్వాన్ని అనేక మంది అనుభవించనిచ్చింది. దానితో నాకు ఆమెపట్ల విసుగు పుట్టి, నేనామె అక్కను చీదరించుకున్నట్లు ఈమెను కూడ అసహ్యించుకున్నాను.

19. మరియు ¸యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.

19. పదే పదే ఒహొలీబా నాపట్ల అవిశ్వాసంతో ప్రవర్తించింది. పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన ప్రేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది.

20. గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.

20. గాడిద మేఢ్రంవంటి శిశ్నముతో గుర్రంవలె వరదలా రేతస్సును కార్చే తన విటుని ఆమె జ్ఞాపకం చేసుకున్నది.

21. యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

21. “ ఒహొలీబా, నీ ప్రేమికుడు నీ చనుమొనలు ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు.

22. కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.

22. కావున బహోలీచా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు.

23. గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించు చున్నాను.

23. వారందరినీ నేను బబులోను (బాబిలోనియా)నుండి రప్పిస్తాను. ముఖ్యంగా కల్దీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు.

24. ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేనునిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును.

24. ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గుర్రాలమీద, రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. వారు తమ ఈటెలను, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వస్తారు. వారంతా నీ చూట్టూ గుమిగూడతారు. నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు.

25. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు.

25. నేనెంత రోషంగా వున్నానో నీకు చూపిస్తాను. వారు చాలా కోపగించి నిన్ను బాధిస్తారు. వారు నీ ముక్కూ చెవులు కోసివేస్తారు. వారు కత్తితో నిన్ను చంపుతారు. పిమ్మట వారు నీ పిల్లలను తీసుకుపోతారు. నీవద్ద మిగిలిన ప్రతి దానిని వారు తగులబెడతారు.

26. నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.

26. నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు.

27. ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.

27. ఈజిప్టులో నీ ప్రేమ కలాపాలను గురించిన నీ కలలను నిలిపివేస్తాను. మళ్లీ నీవెన్నడు వారికొరకు ఎదురు చూడవు. నీవు ఇకముందెన్నడు ఈజిప్టును జ్ఞాపకం చేసుకొనవు!’

28. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.

28. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “నీవు అసహ్యించుకునే మనుష్యులకు నిన్ను అప్పజెప్పుచున్నాను. నీవు విసుగుచెందిన మనుష్యులకే నిన్ను అప్పజెప్పుచున్నాను.

29. ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.

29. వారు నిన్నెంత అసహ్యించుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన కలలుగన్నావని వారు తలుసుకుంటారు.

30. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.

30. అన్యదేశీయులను వెంబడించి పోవటానికి నన్ను వదిలిపెట్టినప్పటి నుండి నీవీ పాపకార్యాలకు ఒడిగట్టావు. వారి రోత విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టినప్పటి నుండి నీవీ చెడ్డ కార్యాలకు తలపడ్డావు.

31. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను.

31. నీవు నీ అక్కను అనుసరించి, ఆమె గడిపిన జీవితాన్నే నీవూ గడిపావు. నీకు నీవే విషపు పాత్రను అందుకుని, నీ చేతిలో పట్టుకున్నావు. నీకు శిక్ష నీవే విధించుకున్నావు. “

32. అందులో పానము చేయ వలసినది చాల యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.

32. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగుతావు. అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె. ఆ గిన్నెలో విషం (శిక్ష) చాలా పడుతుంది. ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు.

33. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.

33. తాగినవానిలా నీవు తూలిపోతావు. నీవు గొప్ప దుఃఖముతో నింపబడతావు. షోమ్రోను పాత్ర వినాశ ఉపద్రవములతో నిండియున్నది. అది నీ అక్క తాగిన విషవు (శిక్ష) పాత్ర లాంటిదే.

34. అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

34. ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు. దానిని నీవు పూర్తిగా తాగుతావు. పిమ్మట పాత్ర క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు. బాధతో నీ రొమ్ములు చీరుకుంటావు. నేను ప్రభువైన యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది. ఈ విషయాలు నేనే చెప్పాను.

35. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.

35. “కావున నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘యెరూషలేమా నీవు నన్ను మర్చి పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన కలలకూ నీ వ్యభీచారానికి నీవు శ్రమననుభవించాలి.

36. మరియయెహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.

36. నా ప్రభవైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరుడా, నీవు ఒహొలా, ఒహొలీబాలకు తీర్పు ఇస్తావా? అయితే వారు చేసిన భయంకర నేరాలను వారికి చెప్పు.

37. వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.

37. వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. వారిపై హత్యానేరం ఉంది. వారు వేశ్యల్లా ప్రవర్తించారు. వారి అపవిత్ర విగ్రహాలతో వుండటానికి వారు నన్ను వదిలివేశారు. నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు.

38. వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

38. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను, నా పవిత్ర స్థలాన్ని వారు సామాన్యమైనవిగా పరిగణించారు.

39. తాము పెట్టు కొనిన విగ్రహముపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.

39. వారి విగ్రహాల కొరకు వారు తమ పిల్లల్ని బలిపెట్టారు. తరువాత వారు నా పవిత్ర స్థలంలోకీ వెళ్లి దానిని కూడ అపవిత్ర పర్చారు! ఇది వారు నా ఆలయం లోపలే చేశారు!

40. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించు కొని

40. దూర ప్రాంతాల మనుష్యుల కొరకు వారు కబురు పంపారు. ఆ మనుష్యుల కొరకు నీవు (ఒహొలీబా) దూతను పంపావు. వారు నిన్ను చూడటానికి వచ్చారు. వారికొరకు నీవు స్నానం చేసి, కండ్లు అలంకరించు కొని, ఆభరణాలు ధరించావు.

41. ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధ పరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.

41. ఒక అందమైన పాన్పు మీద నీవు కూర్చుని, దాని ముందు ఒక బల్లవేశావు. ఆ బల్ల మీద నా సుగంధ ధూప ద్రవ్యాన్ని , నూనెను ఉంచావు.

42. ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి.

42. యెరూషలేములో వినబడే శబ్దం విందులో ప్రజలు చేసే రణగొణ ధ్వనిలా ఉంది. విందుకు అనేక మంది వచ్చారు. ఎడారినుండి వచ్చిన వారు కావటంతో వారు తాగుతూ ఉన్నారు. వారు స్త్రీలకు కడాయాలు, అందమైన కిరీటాలు యిచ్చారు.

43. వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు.

43. కామ క్రీడలతో నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్లాడినాను. వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం చేస్తారా? అని అన్నాను.

44. వేశ్యతో సాంగత్యముచేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.

44. కాని వారంతా ఒక వేశ్యవద్దకు ఆమెవద్ద వెళ్ళుచున్నట్లుగనే ఆమె వద్దకు వెళ్ళుతున్నారు. కామంతో పాపకార్యం చేసే ఒహొలా, ఒహొలీబాల వద్దకు వారు మళ్లీ, మళ్లీ వెళ్లారు.

45. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.

45. “కాని మంచి మనుష్యులు వారిని నేరస్థులుగా తీర్పు ఇస్తారు. వారా స్త్రీలను వ్యభిచార, హత్యానేరాల కింద దోషులుగా నిర్ణయిస్తారు. ఒహొలా మరియు ఒహొలీబాలు వ్యభచార పాపం చేసినందుకు, వారు చంపిన ప్రజల రక్తం ఇంకా వారి చేతులపై వున్నందున ఇది ఇలా జరుగుతుంది!”

46. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.

46. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “ ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ ప్రజలందరు ఒహొలా, ఒహొలీబాలను శిక్షింపనీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీలను శిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు.

47. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.

47. తరువాత ఈ గుంపు వారిద్దరిపై రాళ్ళు విసరి చంపివేస్తారు. వారా ఇద్దరినీ తమ కత్తులతో నరికి ముక్కలు చేస్తారు. వారు ఈ స్త్రీల పిల్లలను చంపి, వారి ఇండ్లను తగలబెడతారు.

48. స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.

48. ఈ రకంగా ఈ దేశాన్నుండి అవమానాన్ని తొలగిస్తాను. మిగిలిన స్త్రీలంతా మీరు చేసినటుంటి సిగ్గు మాలిన పనులు చేయకుండ వుండేలా హెచ్చరింపబడతారు.

49. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.

49. [This verse may not be a part of this translation]Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |