Ezekiel - యెహెఙ్కేలు 24 | View All

1. తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. And the word of the Lord was maad to me, in the nynthe yeer, and in the tenthe monethe, in the tenthe dai of the monethe,

2. నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చు చున్నాడు.

2. and he seide, Thou, sone of man, write to thee the name of this dai, in which the king of Babiloyne is confermed ayens Jerusalem to dai.

3. మరియు తిరుగుబాటుచేయు ఈ జనులను గూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.

3. And thou schalt seie bi a prouerbe a parable to the hous, terrere to wraththe, and thou schalt speke to hem, The Lord God seith these thingis, Sette thou a brasun pot, sette thou sotheli, and putte thou watir in to it. Take thou a beeste ful fat;

4. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.

4. gadere thou togidere the gobetis therof in it, ech good part, and the hipe, and the schuldre, chosun thingis and ful of boonys.

5. మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడి కించుము.

5. Also dresse thou heepis of boonys vndur it; and the sething therof buylide out, and the boonys therof weren sodun in the myddis therof.

6. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.

6. Therfor the Lord God seith these thingis, Wo to the citee of bloodis, to the pot whos rust is ther ynne, and the rust therof yede not out of it; caste thou out it bi partis, and bi hise partis; lot felle not on it.

7. దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.
ప్రకటన గ్రంథం 18:24

7. For whi the blood therof is in the myddis therof; he schede it out on a ful cleer stoon, he schedde not it out on erthe,

8. కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.

8. that it mai be hilid with dust, that Y schulde bringe in myn indignacioun, and `a venge bi veniaunce; Y yaf the blood therof on a ful cleer stoon, that it schulde not be hilid.

9. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.

9. Therfor the Lord God seith these thingis, Wo to the citee of bloodis, whos brennyng Y schal make greet;

10. చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజ బెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.

10. gadere thou togidire boonys, whiche Y schal kyndle with fier; fleischis schulen be wastid, and al the settyng togidere schal be sodun, and boonys schulen faile.

11. తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.

11. Also sette thou it voide on coolis, that the metal therof wexe hoot, and be meltid, and that the filthe therof be wellid togidere in the myddis therof, and the rust therof be wastid.

12. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,

12. It was swat bi myche trauel, and the ouer greet rust therof yede not out therof, nether bi fier.

13. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.

13. Thin vnclennesse is abhomynable, for Y wolde clense thee, and thou art not clensid fro thi filthis; but nether thou schalt be clensid bifore, til Y make myn indignacioun to reste in thee.

14. యెహోవానైన నేను మాటయిచ్చి యున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.

14. Y the Lord spak; it schal come, and Y schal make, Y schal not passe, nethir Y schal spare, nether Y schal be plesid; bi thi weies and bi thi fyndyngis Y schal deme thee, seith the Lord.

15. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

15. And the word of the Lord was maad to me,

16. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.

16. and he seide, Thou, sone of man, lo! Y take awei fro thee the desirable thing of thin iyen in veniaunce, and thou schalt not weile, nether wepe, nether thi teeris schulen flete doun.

17. మృతులకై విలాపముచేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొన వద్దు జనుల ఆహారము భుజింపవద్దు

17. Weile thou beynge stille, thou schalt not make mourenyng of deed men; thi coroun be boundun aboute thin heed, and thi schoon schulen be in the feet, nether thou schalt hile the mouth with a cloth, nether thou schalt ete the metis of mourneris.

18. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని.

18. Therfor Y spak to the puple in the morewtid, and my wijf was deed in the euentid; and Y dide in the morewtid, as he hadde comaundid to me.

19. నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా

19. And the puple seide to me, Whi schewist thou not to vs what these thingis signefien, whiche thou doist?

20. నేను వారితో ఇట్లంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను.

20. And Y seide to hem, The word of the Lord was maad to me,

21. ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చట గాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.

21. and he seide, Speke thou to the hous of Israel, The Lord God seith these thingis, Lo! Y schal defoule my seyntuarie, the pride of youre empire, and the desirable thing of youre iyen, and on which youre soule dredith; and youre sones and youre douytris, whiche ye leften, schulen falle bi swerd.

22. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.

22. And ye schulen do, as Y dide; ye schulen not hile mouthis with cloth, and ye schulen not ete the mete of weileris.

23. మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.

23. Ye schulen haue corouns in youre heedis, and schoon in the feet; ye schulen not weile, nether ye schulen wepe, but ye schulen faile in wretchidnesse, for youre wickidnessis; and ech man schal weile to his brother.

24. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

24. And Ezechiel schal be to you in to a signe of thing to comynge; bi alle thingis whiche he dide, ye schulen do, whanne this thing schal come; and ye schulen wite, that Y am the Lord God.

25. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైనదానిని వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన యొకడు నీయొద్దకు వచ్చును.

25. And thou, sone of man, lo! in the dai in which Y schal take awei fro hem the strengthe of hem, and the ioie of dignyte, and the desire of her iyen, on whiche the soulis of hem resten, caste awei the sones and douytris of hem;

26. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక, తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు;

26. in that dai whanne a man fleynge schal come to thee, to telle to thee;

27. నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.

27. in that dai sotheli thou schalt opene thi mouth with hym that fledde; and thou schalt speke, and schalt no more be stille; and thou schalt be to hem in to a signe of thing to comynge, and ye schulen witen, that Y am the Lord.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం యొక్క విధి. (1-14) 
మంటలపై ఉడకబెట్టిన కుండ కల్దీయులచే చుట్టుముట్టబడిన జెరూసలేం ముట్టడి నగరానికి ప్రతీక. ఆ కోట గోడల లోపల, అన్ని సామాజిక స్థితిగతుల ప్రజలు దాడి చేసే శత్రువుకు సంభావ్య ఆహారం వలె చిక్కుకున్నారు. మరిగే ద్రవం ఉపరితలంపై ఏర్పడే ఒట్టును తొలగించినట్లుగా, వారి తప్పు నుండి తమను తాము తప్పించుకోవడం వారి కర్తవ్యంగా ఉండాలి. అయినప్పటికీ, మెరుగుపడటానికి బదులుగా, వారు మరింత దిగజారారు మరియు వారి బాధలు తీవ్రమయ్యాయి. జెరూసలేం యొక్క విధి దాని పూర్తి విధ్వంసం, దానిని శిధిలాలుగా తగ్గించడం. దుర్మార్గులను లెక్కించే రోజు చాలా దూరంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ, అది అనివార్యంగా వస్తుంది. తమకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన సంకేతాలు మరియు సంఘటనల ప్రాముఖ్యతను ఎంతమంది వ్యక్తులు గ్రహించలేకపోతున్నారో పరిశీలించడం నిరుత్సాహపరుస్తుంది.

యూదుల బాధల పరిధి. (15-27)
మరణించిన వారి కోసం దుఃఖించడం ఒక బాధ్యత అయితే, అది మత విశ్వాసం మరియు హేతుబద్ధతతో నిగ్రహించబడాలి. మనకు ఆశ లేనట్లు విలపించకూడదు. విశ్వాసులు దేవుణ్ణి అంగీకరించని వారి మాటలు మరియు వ్యక్తీకరణలను స్వీకరించకుండా ఉండాలి. ఆ సంకేతం యొక్క అర్థం గురించి ప్రజలు అడిగినప్పుడు, దేవుడు వారికి అత్యంత ప్రియమైన ప్రతిదాన్ని వారి నుండి తీసుకున్నాడు. యెహెజ్కేలు తన స్వంత బాధల కోసం ఏడ్చనట్లే, వారు కూడా తమ బాధల కోసం ఎక్కువగా ఏడ్వకూడదు. కృతజ్ఞతగా, మన కష్టాల క్రింద మనం ఎండిపోవలసిన అవసరం లేదు. అన్ని సుఖాలు నశించిపోయినా, అన్ని దుఃఖాలు కలిసిపోయినా, పశ్చాత్తాపం చెందిన హృదయం మరియు దుఃఖించేవారి ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని దయను పొందుతుంది.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |