Ezekiel - యెహెఙ్కేలు 27 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. The Word of the Lord came to me saying,

2. నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము

2. 'Son of man, sing a song of sorrow over Tyre.

3. సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;

3. Say to Tyre, whose people live at the gateway to the sea and trade with people from many lands, 'The Lord God says, 'O Tyre, you have said, 'I am perfect in beauty.'

4. నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు.

4. Your home is on the sea. Your builders have made you perfect in beauty.

5. నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.

5. They made your pieces of wood from the fir trees from Senir. They made the wood that holds your sail out of a cedar from Lebanon.

6. బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలు చేయు దురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.

6. They made your oars out of oak trees from Bashan. They made your floor of ivory and boxwood from the land of Cyprus.

7. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు

7. Your sail was made of fine and beautiful linen from Egypt, to show all people who you are. Your covering was made of blue and purple cloth from the land of Elishah.

8. తూరుపట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

8. The people of Sidon and Arvad were your rowers. Your own wise and able men were your sailors.

9. గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.
ప్రకటన గ్రంథం 18:19

9. The leaders and wise men of Gebal were with you, putting tar where it was needed to keep the water out. All the ships of the sea and their sailors were with you to trade for your good things.

10. పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

10. 'Soldiers from Persia and Lud and Put were in your army. They hung battle-coverings and head-coverings in you, and made you beautiful.

11. అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.

11. The men of Arvad and Helech were on your walls all around. And men of Gammad were in your towers. They hung their battle-coverings all around your walls, and made you perfect in beauty.

12. నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

12. 'Tarshish traded with you because of all your riches of every kind. They paid for your good things with silver, iron, tin, and lead.

13. గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
ప్రకటన గ్రంథం 18:13

13. Javan, Tubal, and Meshech traded with you. They paid for your good things with servants and objects of brass.

14. తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

14. Men of Beth-togarmah paid for your good things with horses, war horses, and mules.

15. దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

15. The men of Dedan traded with you. Many lands beside the sea traded with you, paying you with ivory horns and beautiful dark wood.

16. నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.

16. Syria traded with you because of all your good things. They bought them with stones of great worth, purple cloth, cloth with beautiful sewing, fine linen, and coral.

17. మరియయూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిల మును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
అపో. కార్యములు 12:20

17. Judah and the land of Israel traded with you. They paid for your good things with the grain of Minnith, cakes, honey, oil, and medicine.

18. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.

18. Damascus traded with you because of all your good things and riches of all kinds. They paid for them with the wine of Helbon and white wool.

19. దదాను వారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.

19. Vedan and Javan traded with you from Uzal. They paid you with pure iron and spices.

20. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
ప్రకటన గ్రంథం 18:9

20. Dedan paid you with horse coverings.

21. అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

21. Arabia and all the leaders of Kedar traded with you. They paid you with lambs, rams, and goats.

22. షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
ప్రకటన గ్రంథం 18:12-13

22. Sheba and Raamah traded with you. They paid for your good things with the best of all kinds of spices, stones of great worth, and gold.

23. హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

23. Haran, Canneh, Eden, Sheba, Asshur, and Chilmad traded with you.

24. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

24. They paid you with the best clothing, clothes of blue cloth and beautiful sewing, floor coverings of many colors, and strong ropes.

25. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.

25. The ships of Tarshish carried your good things for you. You were filled and honored in the middle of the seas.

26. నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

26. 'Your rowers have brought you into deep waters. The east wind has wrecked you far out in the sea.

27. అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తు వులును నీ నావి కులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.

27. Your riches, your good things, the things you trade, your sailors, your pilots, your builders, your traders, all your soldiers, and all your people will fall into the sea on the day you are destroyed.

28. నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;
ప్రకటన గ్రంథం 18:17

28. The lands by the sea will shake at the sound of your sailors' cry.

29. కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి
ప్రకటన గ్రంథం 18:17

29. All the rowers and sailors of the sea will leave their ships. They will stand on the land

30. నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసి కొనుచు, బూడిదెలో పొర్లుచు
ప్రకటన గ్రంథం 18:19

30. and cry in a loud voice of sorrow over you. They will throw dust on their heads and roll in ashes.

31. నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.
ప్రకటన గ్రంథం 18:15

31. They will cut off their hair because of you, and dress themselves in cloth made from hair. They will cry over you with much sorrow in their soul.

32. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగిలయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?
ప్రకటన గ్రంథం 18:18, ప్రకటన గ్రంథం 18:15

32. In their crying they will sing a song of sorrow for you, saying, 'Who is like Tyre, destroyed and quiet in the sea?

33. సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసి తివి.
ప్రకటన గ్రంథం 18:19

33. When your good things went out on the sea, you pleased many nations. With all your riches and good things you made the kings of the earth rich.

34. ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చు దురు.

34. Now you are wrecked by the sea, in the deep waters. Your good things and all your people have gone down with you.

35. నిన్ను బట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్న బోవును.

35. All the people who live on the islands are full of fear and wonder because of you. Their kings are very afraid. Their faces are troubled.

36. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
ప్రకటన గ్రంథం 18:11-15-1

36. The traders among the nations make sounds of surprise at you. You have come to an end and you will be no more.' '



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

టైర్ యొక్క సరుకు. (1-25) 
సుఖవంతమైన జీవితాలను గడుపుతున్న వారు కష్టాలకు సిద్ధపడకపోతే జాలిపడాలి. వారు కూడా నైతికంగా శుద్ధి చేయబడితే తప్ప ఎవరూ తమను తాము ఆశీర్వదించరు. ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు చేస్తూ, వింటూనే కాకుండా, వారు ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైనప్పుడు కూడా దేవుడు వారిపై నిఘా ఉంచుతాడని టైర్ వ్యాపార కథ వివరిస్తుంది. కొనుగోలు మరియు అమ్మకాలు జరిగే మార్కెట్‌ప్లేస్‌లు మరియు ఫెయిర్‌ల వరకు ఈ నిఘా విస్తరించింది. మన లావాదేవీలన్నింటిలో, తప్పు చేయకుండా మనస్సాక్షిని కాపాడుకోవడం చాలా అవసరం. దేవుడు, మానవాళి యొక్క సాధారణ తండ్రిగా, వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వనరులను ప్రసాదించాడు, ప్రతి ఒక్కటి మానవ జీవితానికి అవసరాలు, సౌకర్యాలు లేదా అలంకారాలను అందిస్తోంది. దేవుని పట్ల భక్తితో నిర్వహించబడినప్పుడు వాణిజ్యం మరియు వాణిజ్యం మానవాళికి ఎంత ఆశీర్వాదం కాగలదో స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైన వస్తువులకు మించి, అనేక ఆస్తులు సంప్రదాయం నుండి మాత్రమే విలువను పొందుతాయి మరియు వాటిని ఆస్వాదించడానికి దేవుడు మనలను అనుమతిస్తాడు. అయితే, సంపద పేరుకుపోతున్న కొద్దీ, వ్యక్తులు దానిపై స్థిరపడతారు మరియు వారి శ్రేయస్సుకు మూలమైన దేవుడిని మరచిపోతారు.

దాని పతనం మరియు నాశనం. (26-36)
అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన రాజ్యాలు మరియు దేశాలు కూడా చివరికి క్షీణిస్తాయి. ప్రాపంచిక సృష్టిపై నమ్మకం ఉంచి, వాటిపై ఆశలు పెట్టుకునే వారు అనివార్యంగా వారి వెంట పడతారు. సహాయం కోసం యాకోబు దేవునిపై ఆధారపడేవారు మరియు తమ దేవుడైన శాశ్వతమైన ప్రభువుపై నిరీక్షించే వారు అదృష్టవంతులు. వాణిజ్యంలో నిమగ్నమైన వారు దేవుని బోధనలకు అనుగుణంగా తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి కృషి చేయాలి. సంపదను కలిగి ఉన్నవారు దేవుని వనరులకు తాము నిర్వాహకులని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు వారు ఈ వనరులను అందరి గొప్ప ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందరికంటే ముందు దేవుని రాజ్యాన్ని వెదకడం, ధర్మబద్ధంగా జీవించడం వంటి వాటికే ప్రాధాన్యత ఇద్దాం.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |