Ezekiel - యెహెఙ్కేలు 27 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:

2. నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము

2. “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము.

3. సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;

3. తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము: “‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు. అనేక దేశాలకు నీవు వ్యాపారివి. తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.’ నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు. నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!

4. నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు.

4. మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు. నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు! నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.

5. నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.

5. నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు. లెబానోను సరళవృక్షపు కర్రతో నీ ఓడ స్తంభాలను చేశారు.

6. బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలు చేయు దురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.

6. బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో పడవ తెడ్లు చేశారు. కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి అడుగు అంతస్థులో గదిని నిర్మించారు. ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.

7. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు

7. ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు. ఆ తెరచాపయే నీ పతాకం. నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి. అవి ఎలిషా (సైప్రస్) ద్వీపంనుండి వచ్చినవి.

8. తూరుపట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

8. దోనూ, అర్వదూ నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు. తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.

9. గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.
ప్రకటన గ్రంథం 18:19

9. బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు. సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’

10. పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

10. “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు.

11. అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.

11. నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.

12. నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

12. “తర్షీషు నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు.

13. గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
ప్రకటన గ్రంథం 18:13

13. గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు.

14. తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

14. తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు.

15. దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

15. దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు.

16. నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.

16. నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.

17. మరియయూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిల మును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
అపో. కార్యములు 12:20

17. “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఆలివులు ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు.

18. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.

18. దమస్కు నీకు మరో మంచి ఖాతా దారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు.

19. దదాను వారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.

19. నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు.

20. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
ప్రకటన గ్రంథం 18:9

20. వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు.

21. అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

21. అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు.

22. షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
ప్రకటన గ్రంథం 18:12-13

22. షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు.

23. హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

23. హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు.

24. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

24. నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి వేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు.

25. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.

25. నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి. “తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి. నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.

26. నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

26. నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు. కాని బలమైన తూర్పు గలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.

27. అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తు వులును నీ నావి కులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.

27. నీ ధనమంతా సముద్రం పాలవుతుంది. నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు, కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా సముద్రంలో మునిగిపోతారు! నీవు నాశనమయ్యే రోజున ఇదంతా జరుగుతుంది.

28. నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;
ప్రకటన గ్రంథం 18:17

28. “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు. అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో పణకిపోతాయి!

29. కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి
ప్రకటన గ్రంథం 18:17

29. నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు. నీ నావికులు, చుక్కాని పట్టేవారు. వారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.

30. నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసి కొనుచు, బూడిదెలో పొర్లుచు
ప్రకటన గ్రంథం 18:19

30. వారు నిన్ను గురించి చాలా బాధపడతారు. వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసు కుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.

31. నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.
ప్రకటన గ్రంథం 18:15

31. నీ కొరకు వారు తమ తలలు గొరిగించు కుంటారు. వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. వారు నీకొరకు దుఃఖిస్తారు. మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.

32. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగిలయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?
ప్రకటన గ్రంథం 18:18, ప్రకటన గ్రంథం 18:15

32. “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు, “‘తూరు వంటిది మరొక్కటి లేదు! నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!

33. సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసి తివి.
ప్రకటన గ్రంథం 18:19

33. నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులంతోను నీవనేక మందిని తృప్తిపర్చావు. ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!

34. ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చు దురు.

34. కాని నీవు నడిసముద్రంలో, అగాధంలో ముక్కలై పోయావు. నీవు అమ్మే వస్తువులతో పాటు నీ మనుష్యులందరూ కూలిపోయారు!

35. నిన్ను బట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్న బోవును.

35. రవాసులంతా నీ విషయంలో అదిరి పోయ్యారు. వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు. వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు. వారి ముఖాలు చిన్న బోయాయి.

36. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
ప్రకటన గ్రంథం 18:11-15-1

36. ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు. నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఎందువల్ల నంటే నీవు సర్వనాశనమయ్యావు. నీవికలేవు.”‘Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |