Ezekiel - యెహెఙ్కేలు 28 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. And the word of the Lord was maad to me,

2. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, ఒ నీకు మర్మమైనదేదియు లేదు.
అపో. కార్యములు 12:22, 2 థెస్సలొనీకయులకు 2:4

2. and he seide, Sone of man, seie thou to the prince of Tire, The Lord God seith these thingis, For thin herte was reisid, and thou seidist, Y am God, and Y sat in the chaier of God, in the herte of the see, sithen thou art man and not God, and thou yauest thin herte as the herte of God; lo!

3. నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి,

3. thou art wisere than Danyel, ech priuetee is not hid fro thee;

4. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి.

4. in thi wisdom and prudence thou madist to thee strengthe, and thou gatist to thee gold and siluer in thi tresouris;

5. నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.

5. in the multitude of thi wisdom, and in thi marchaundie thou multipliedist to thee strengthe, and thin herte was reisid in thi strengthe;

6. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్న వాడా, ఆలకించుము;

6. therfor the Lord God seith these thingis, For thin herte was reisid as the herte of God, therfor lo!

7. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్య మును నీచపరతురు,

7. Y schal brynge on thee aliens, the strongeste of hethene. And thei schulen make nakid her swerdis on the fairnesse of thi wisdom, and thei schulen defoule thi fairnesse.

8. నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు.

8. Thei schulen sle, and drawe doun thee; and thou schalt die bi the deth of vncircumcidid men, in the herte of the see.

9. నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.

9. Whether thou schalt seie, and speke, Y am God, bifore hem that sleen thee; sithen thou art a man, and not God?

10. సున్నతిలేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశులచేత చత్తువు, నేనే మాట యిచ్చి యున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

10. In the hond of hem that sleen thee, bi deth of vncircumcidid men, thou schalt die in the hond of aliens; for Y the Lord spak, seith the Lord God.

11. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

11. And the word of the Lord was maad to me, and he seide, Thou, sone of man, reise thou weilyng on the kyng of Tire;

12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

12. and thou schalt seie to hym, The Lord God seith these thingis, Thou a preente of licnesse, ful of wisdom, perfit in fairnesse,

13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 17:4, ప్రకటన గ్రంథం 18:16

13. were in delicis of paradijs of God. Ech preciouse stoon was thin hilyng, sardius, topacius, and iaspis, crisolitus, and onix, and birille, safire, and carbuncle, and smaragde; also gold was the werk of thi fairnesse, and thin hoolis weren maad redi, in the dai in which thou were maad.

14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

14. Thou were cherub holdun forth, and hilynge; and Y settide thee in the hooli hil of God. In the myddis of stoonus set a fier thou yedist,

15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

15. perfit in thi weies fro the dai of thi makyng, til wickidnesse was foundun in thee.

16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.

16. In the multitude of thi marchaundie thin ynnere thingis weren fillid of wickidnesse, and thou didist synne; and Y castide thee out of the hil of God, and, thou cherub hilynge fer, Y loste thee fro the myddis of stoonys set a fier.

17. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.

17. And thin herte was reisid in thi fairnesse, thou lostist thi wisdom in thi fairnesse. Y castide thee doun in to erthe, Y yaf thee bifore the face of kingis, that thei schulden se thee.

18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.

18. In the multitude of thi wickidnessis, and in wickidnesse of thi marchaundie thou defoulidist thin halewyng; therfor Y schal brynge forth fier of the myddis of thee, that schal ete thee; and Y schal yyue thee in to aische on erthe, in the siyt of alle men seynge thee.

19. జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.

19. Alle men that schulen se thee among hethene men, schulen be astonyed on thee; thou art maad nouyt, and thou schalt not be with outen ende.

20. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

20. And the word of the Lord was maad to me,

21. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

21. and he seide, Thou, sone of man, sette thi face ayens Sidon, and thou schalt profesie of it;

22. సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధ పరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.

22. and schalt seie, The Lord God seith these thingis, Lo! Y to thee, Sidon, and Y schal be glorified in the myddis of thee; and thei schulen wite, that Y am the Lord, whanne Y schal do domes in it, and Y schal be halewid ther ynne.

23. నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతులగుదురు, నేను ప్రభువగు యెహోవానని

23. And Y schal sende pestilence in to it, and blood in the stretis therof, and slayn men bi swerd schulen falle doun in the myddis therof bi cumpas; and thei schulen wite, that Y am the Lord God.

24. ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు వారు చుట్టునుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు.

24. And there schal no more be an hirtyng of bitternesse to the hous of Israel, and a thorn bryngynge in sorewe on ech side bi the cumpas of hem that ben aduersaries to hem; and thei schulen wite, that Y am the Lord God.

25. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచు కొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు.

25. The Lord God seith these thingis, Whanne Y schal gadere togidere the hous of Israel fro puplis, among whiche thei ben scaterid, Y schal be halewid in hem bifor hethene men. And thei schulen dwelle in her lond, which Y yaf to my seruaunt Jacob.

26. వారు అందులో నిర్ఛయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారి కందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించుకాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

26. And thei schulen dwelle sikir ther ynne, and thei schulen bilde housis, and thei schulen plaunte vynes, and thei schulen dwelle tristili, whanne Y schal make domes in alle men that ben aduersaries to hem bi cumpas; and thei schulen wite, that Y am the Lord God of hem.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

టైర్ రాజు లేదా రాజుకు వ్యతిరేకంగా వాక్యం. (1-19) 
ఇథోబాల్ అని కూడా పిలువబడే ఎత్బాల్, టైర్ రాజు లేదా రాజు అనే బిరుదును కలిగి ఉన్నాడు. అతని మితిమీరిన గర్వం తనను తాను దైవిక గౌరవాలను పొందేలా చేసింది. అహంకారం అనేది మన పడిపోయిన స్వభావం నుండి ఉత్పన్నమయ్యే విలక్షణమైన మానవ పాపం. ఇహలోకంలో మరియు పరలోకంలో నిజమైన ఆనందాన్ని దేవుడు ప్రసాదించిన జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. టైర్ యొక్క అహంకారి పాలకుడు తన స్వంత శక్తి ద్వారా తన ప్రజలను రక్షించగలడని విశ్వసించాడు మరియు స్వర్గంలోని వ్యక్తులతో సమానంగా తనను తాను చూసుకున్నాడు.
ఎవరైనా ఈడెన్ గార్డెన్‌లో నివసించగలిగినప్పటికీ లేదా స్వర్గంలోకి ప్రవేశించగలిగినప్పటికీ, వినయపూర్వకమైన, పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక స్వభావం లేకుండా నిజమైన ఆనందం అంతుచిక్కదు. అన్నింటికంటే మించి, ఆధ్యాత్మిక అహంకారం అనేది డెవిల్‌కు ఆపాదించబడిన లక్షణం, మరియు దానిని స్వీకరించే వారు వారి పతనాన్ని ఊహించాలి.

జిడాన్ పతనం. (20-23) ; ఇజ్రాయెల్ పునరుద్ధరణ. (24-26)
జిడోనియన్లు ఇశ్రాయేలు దేశపు సరిహద్దులలో నివసించారు, అక్కడ వారు ప్రభువును ఎలా స్తుతించాలో నేర్చుకునే అవకాశం ఉంది. అయితే, అలా చేయకుండా, వారు తమ విగ్రహాలను ఆరాధించేలా ఇశ్రాయేలీయులను ప్రలోభపెట్టారు. యుద్ధం మరియు తెగులు దేవుని తీర్పు యొక్క సాధనాలు, కానీ అతను తన ప్రజలను వారి పూర్వ భద్రత మరియు శ్రేయస్సుకు పునరుద్ధరించినప్పుడు కూడా మహిమపరచబడతాడు. దేవుడు వారి పాపాలను స్వస్థపరుస్తాడు మరియు వారి కష్టాలను తొలగిస్తాడు. ఈ వాగ్దానం చివరికి స్వర్గపు కనానులో నెరవేరుతుంది, అక్కడ పరిశుద్ధులందరూ సమావేశమవుతారు, ప్రతి అవరోధం తొలగించబడుతుంది మరియు అన్ని బాధలు మరియు భయాలు శాశ్వతంగా బహిష్కరించబడతాయి.
కాబట్టి, దేవుని చర్చి మరియు దానిలోని ప్రతి సజీవ సభ్యులు, వారు పేదవారు, బాధలు లేదా తృణీకరించబడినప్పటికీ, సంతోషించగలరు ఎందుకంటే ప్రభువు తన విమోచించబడిన ప్రజల రక్షణ మరియు ఆనందంలో తన సత్యాన్ని, శక్తిని మరియు దయను వ్యక్తపరుస్తాడు.




Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |