Ezekiel - యెహెఙ్కేలు 29 | View All

1. పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. In the tenth year, in the tenth month, on the twelfth of the month, came the word of Yahweh unto me, saying:

2. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

2. Son of man, Set thy face against Pharaoh, king of Egypt, And prophesy against him, and against Egypt all of it:

3. ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

3. Speak, and thou shalt say Thus, saith My Lord Yahweh Behold me! against thee O Pharaoh king of Egypt, The great Crocodile that lieth along in the midst of his rivers: Who saith My river is, mine own, Since I myself made it me!

4. నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.

4. Therefore will I put hooks in thy jaws, And cause the fish of thy rivers to stick fast in thy scales, And will bring thee up out of the midst of thy rivers, And lull the fish of thy rivers Ito thy scales1 shall stick fast;

5. నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
ప్రకటన గ్రంథం 6:8

5. And I will stretch thee out towards the desert thee and all the fish of thy rivers, Off the face of the field, shalt thou lie Thou shalt not be carried away. nor shalt thou be gathered, To the wild beast of the earth and to the bird of the heavens, have I given thee for food.

6. అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;

6. So shall all the inhabitants of Egypt know that I, am Yahweh, Because they were a staff of reed to the house of Israel:

7. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.

7. Whensoever they took held of thee by the hand, thou didst run through, and tear open for them every hand, And whensoever they leaned upon thee, thou didst break, and caused all their loins to halt.

8. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,

8. Therefore, Thus saith My Lord Yahweh, Behold me! bringing upon thee a sword, And I will cut off out of thee, man and beast;

9. ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక

9. And the land of Egypt shall become an astonishment and desolation, go shall they know that, I, am Yahweh, Because he said The river is mine own, Since, I, myself made it!

10. నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.

10. Therefore, behold me! against thee and against thy rivers, And I will make the land of Egypt to be most desolate an astounding desolation, from Migdol to Syene even up to the boundary of Ethiopia:

11. దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.

11. The foot of man shall not pass through it, Nor shall the foot of beast, pass through it, Neither shall it be inhabited forty years:

12. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.

12. So will I make the land of Egypt a desolation in the midst of lands made desolate And her cities in the midst of cities that have been laid waste, shall become a desolation forty years, And I will disperse the Egyptians among the nations, And scatter them throughout the lands.

13. ప్రభువైన యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.

13. For thus, saith My Lord Yahweh, At the end of forty years, will I gather the Egyptians from among the peoples whither I had dispersed them;

14. చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,

14. And I will turn the captivity of the Egyptians, And will cause them to return To the land of Pathros Upon the land of their nativity, And they shall become, there a kingdom abased:

15. వారికను జనములమీద అతిశయపడకుండు నట్లు రాజ్యము లన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్ట్రములమీద ప్రభుత్వము చేయ కుండునట్లు నేను వారిని తగ్గించెదను.

15. More than any of the kingdoms, shall she be abased, And shall lift herself up no more over the nations, Yea I will make them too small to rule over the nations.

16. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

16. So shall it become no more unto the house of Israel a security. Calling to mind iniquity, by their turning to follow them, And they shall know that, I, am The Lord Yahweh.

17. ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

17. And it came to pass in the twenty-seventh year in the first month on the first of the month, that the word of Yahweh came unto me saying:

18. నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.

18. Son of man Nebuchadrezzar king of Babylon, hath made his army undergo a long service against Tyre, Every head, hath been made bald, and Every shoulder worn beret But pay, hath he had none nor hath his army, out of Tyre, for the service wherewith he hath served against it.

19. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించు చున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.

19. Therefore, Thus, saith My Lord Yahweh, Behold me! giving to Nebuchadrezzar king of Babylon, the land of Egypt, And he shall carry off her multitude And capture her spoil And seize her prey, So shall she become pay for his army.

20. తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

20. As a reward for his labour wherewith he hath served, have I given to him the land of Egypt, in that they wrought for me, Declareth My Lord, Yahweh.

21. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.

21. In that day, will I cause to bud a horn for the house of Israel, And to thee, will I give an opening of mouth in their midst, So shall they know that, I, am Yahweh.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 29 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈజిప్టు నిర్జనమైపోయింది. (1-16) 
భూసంబంధమైన మరియు భౌతికవాద మనస్సులు తరచుగా తమ ఆస్తుల గురించి గర్వపడతాయి, మన దగ్గర ఉన్నదంతా చివరికి దేవుడి నుండి వచ్చిన బహుమతి మరియు అతని సేవలో ఉపయోగించబడాలని మర్చిపోతుంది. కాబట్టి మనం ఎందుకు గొప్పలు చెప్పుకుంటాం? మన అహం అనేది ప్రపంచం ఆరాధించే కేంద్ర విగ్రహం అవుతుంది, తరచుగా దేవుడిని మరియు అతని అధికారాన్ని విస్మరిస్తుంది. ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచే భద్రత మరియు సౌకర్యాన్ని భంగపరిచే శక్తి దేవునికి ఉంది. అలాంటి భూసంబంధమైన కోరికలను అంటిపెట్టుకుని ఉన్నవారు కలిసి నాశనాన్ని ఎదుర్కొంటారు. మానవ అహంకారం, అహంకారం మరియు ప్రాపంచిక ఆత్మసంతృప్తి ఇలా అంతం అవుతాయి. ప్రభువు తన ప్రజలకు హాని చేసేవారిని ఎదిరిస్తాడు మరియు వారిని పాపంలోకి నడిపించేవారిని మరింత వ్యతిరేకిస్తాడు. ఈజిప్ట్ రాజ్యంగా దాని హోదాను తిరిగి పొందవచ్చు, కానీ అది పరిమిత సంపద మరియు ప్రభావంతో అన్ని రాజ్యాలలో అత్యల్పంగా ఉంటుంది. ఈ ప్రవచనం ఖచ్చితమైన నెరవేర్పును చరిత్ర చూపించింది. దేవుడు, తన న్యాయం మరియు జ్ఞానంతో, కొన్నిసార్లు మనం ఆధారపడే మద్దతులను తొలగిస్తాడు, తద్వారా మనం ఇకపై వాటిపై విశ్వాసం ఉంచలేము.

ఇజ్రాయెల్ పట్ల దయ యొక్క వాగ్దానం కూడా. (17-21)
దోపిడి విషయంలో టైర్‌ను ముట్టడి చేసినవారు పెద్దగా లాభం పొందలేదు. అయితే, దేవుడు ప్రతిష్టాత్మకమైన లేదా అత్యాశగల వ్యక్తులను నియమించినప్పుడు, వారి హృదయాల కోరికల ఆధారంగా ఆయన వారికి ప్రతిఫలమిస్తాడు; ప్రతి ఒక్కరూ వారి న్యాయమైన ప్రతిఫలాన్ని పొందుతారు. కొంతకాలం తర్వాత దేవుడు ఇశ్రాయేలు ఇంటి కోసం కరుణించాడు. దేశాల చరిత్ర పురాతన ప్రవచనాలకు ఉత్తమ వివరణగా ఉపయోగపడుతుంది. అన్ని సంఘటనలు చివరికి లేఖనాలను నెరవేరుస్తాయి. ఆ విధంగా, కష్టాల యొక్క చీకటి క్షణాలలో కూడా, దేవుడు మన భవిష్యత్తు శ్రేయస్సు యొక్క విత్తనాలను నాటాడు. ఆయన అనుగ్రహం, అనుగ్రహం మరియు పోలికలను కోరుకునే వారు ధన్యులు; వారు ఏ భూసంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆయన సేవలో ఆనందాన్ని పొందుతారు. వారు ఎంచుకున్న ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉంటాయి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |