Ezekiel - యెహెఙ్కేలు 3 | View All

1. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.
ప్రకటన గ్రంథం 10:9

1. And he seide to me, Sone of man, ete thou what euer thing thou fyndist, ete thou this volym; and go thou, and speke to the sones of Israel.

2. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి

2. And Y openyde my mouth, and he fedde me with that volym.

3. నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.

3. And he seide to me, Sone of man, thi wombe schal ete, and thin entrails schulen be fillid with this volym, which Y yyue to thee. And Y eet it, and it was maad as swete hony in my mouth.

4. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.

4. And he seide to me, Sone of man, go thou to the hous of Israel, and thou schalt speke my wordis to hem.

5. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను.

5. For thou schalt not be sent to a puple of hiy word, and of vnknowun langage; thou schalt be sent to the hous of Israel,

6. నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు.

6. nether to many puplis of hiy word, and of vnknowun langage, of whiche thou maist not here the wordis. And if thou were sent to hem, thei schulden here thee.

7. అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.

7. But the hous of Israel nylen here thee, for thei nylen here me. For al the hous of Israel is of vnschamefast forheed, and of hard herte.

8. ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను.

8. Lo! Y yaf thi face strongere than the faces of hem, and thi forheed hardere than the forheedis of hem.

9. నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగు బాటు చేయువారైనను వారిని చూచి జడియకుము.

9. Y yaf thi face as an adamaunt, and as a flynt; drede thou not hem, nether drede thou of the face of hem, for it is an hous terrynge to wraththe.

10. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని

10. And he seide to me, Sone of man, take in thin herte, and here with thin eeris alle these my wordis, whiche Y speke to thee.

11. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.

11. And go thou, and entre to the passyng ouer, to the sones of thi puple. And thou schalt speke to hem, and thou schalt seie to hem, The Lord God seith these thingis, if perauenture thei heren, and resten.

12. అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని.

12. And the spirit took me, and Y herde after me the vois of a greet mouyng. The blessid glorie of the Lord was herd fro his place;

13. మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగు చున్నట్లుగా నాకు వినబడెను

13. and Y herde the vois of wyngis of the beestis smytynge oon an othir, and the vois of wheelis suynge the beestis, and the vois of greet stiryng.

14. ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.

14. Also the spirit reiside me, and took me. And Y yede forth bittir in the indignacioun of my spirit; for the hond of the Lord was with me, and coumfortide me.

15. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్య నుంటిని.

15. And Y cam to the passyng ouer, to the heep of newe fruytis, to hem that dwelliden bisidis the flood Chobar. And Y sat where thei saten, and Y dwellide there seuene daies, weilynge, in the myddis of hem.

16. ఆ యేడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16. Forsothe whanne seuene daies weren passid, the word of the Lord was maad to me, and seide, Sone of man,

17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.
హెబ్రీయులకు 13:17

17. Y yaf thee `a spiere to the hous of Israel. And thou schalt here of my mouth a word, and thou schalt telle to hem of me.

18. అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

18. If whanne Y seie to the wickid man, Thou schalt die bi deth, thou tellist not to hym, and spekist not to hym, that he be turned fro his wickid weie, and lyue; thilke wickid man schal die in his wickidnesse, but Y schal seke his blood of thin hond.

19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.

19. Forsothe if thou tellist to the wickid man, and he is not conuertid fro his wickidnesse, and fro his wickid weie; sotheli he schal die in his wickidnesse, but thou hast delyuerid thi soule.

20. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.

20. But also if a iust man is turned fro his riytfulnesse, and doith wickidnesse, Y schal sette an hirtyng bifor hym; he schal die, for thou teldist not to hym; he schal die in his synne, and hise riytfulnessis, whiche he dide, schulen not be in mynde, but Y schal seke his blood of thin hond.

21. అయితేపాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చరింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు.

21. Forsothe if thou tellist to a iust man, that a iust man do not synne, and he doith not synne, he lyuynge schal lyue, for thou teldist to hym, and thou hast delyuered thi soule.

22. అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.

22. And the hond of the Lord was maad on me, and he seide to me, Rise thou, and go out in to the feeld, and there Y schal speke with thee.

23. నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.

23. And Y roos, and yede out in to the feeld. And lo! the glorie of the Lord stood there, as the glorie which Y siy bisidis the flood Chobar; and Y felle doun on my face.

24. నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము.

24. And the spirit entride in to me, and settide me on my feet. And he spak to me, and seide to me, Entre thou, and be thou closid in the myddis of thin hous.

25. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు

25. And thou, sone of man, lo! boondis ben youun on thee, and thei schulen bynde thee with tho, and thou schalt not go out in the myddis of hem.

26. నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను.

26. And Y schal make thi tunge to cleue to the roof of thi mouth, and thou schalt be doumbe, and thou schalt not be as a man rebuykinge; for it is an hous terrynge to wraththe.

27. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయివినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.

27. But whanne Y schal speke to thee, Y schal opene thi mouth, and thou schalt seie to hem, The Lord God seith these thingis, He that herith, here, and he that restith, reste; for it is an hous terrynge to wraththe.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తన పని కోసం ప్రవక్త యొక్క తయారీ. (1-11) 
యెహెజ్కేలు తన ఆత్మను పోషించడానికి దేవుని యొక్క దైవిక సత్యాలను అప్పగించాడు మరియు అతను వాటిని విశ్వాసంతో స్వీకరించి, వారి నుండి బలాన్ని పొందవలసి ఉంది. దేవుని అనుగ్రహం పొందిన వారు దుర్మార్గుల హృదయాలలో భయాన్ని కలిగించినప్పటికీ, ఈ సత్యాలలో ఆనందాన్ని పొందవచ్చు. దేవుడు తనకు ఇచ్చిన సందేశాలను నమ్మకంగా తెలియజేయడం అతని బాధ్యత. దేవుని ఆలోచనలను వ్యక్తపరచడానికి అతని స్వంత మాటల కంటే మెరుగైన మార్గం ఏది? యెహెజ్కేలు తన ప్రజలతో నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ, అతను కోపం తెచ్చుకోలేదు.
ఆ సమయంలో ఇశ్రాయేలీయులలో వినయం మరియు సంస్కరణలు లేకపోయినా, యోనా బోధకు నీనెవె వాసులు ప్రతిస్పందించడం గమనించదగ్గ విషయం. అంతిమంగా, మనం దైవిక తీర్పు విషయాలను దేవుని సార్వభౌమాధికారానికి వదిలివేయాలి, ఆయన మార్గాలు మన అవగాహనకు మించినవి అని అంగీకరిస్తూ, "ప్రభూ, నీ తీర్పులు లోతైనవి మరియు మా గ్రహణశక్తికి మించినవి" అని చెప్పాలి. కొందరు దేవుని క్రమశిక్షణను విస్మరించినట్లే, ప్రవక్త మాటలను పట్టించుకోకూడదని నిర్ణయించుకోవచ్చు.
వీటన్నింటి మధ్యలో, యెహెజ్కేలును బలపరుస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు. అతను తన బోధనలో కొనసాగడానికి ప్రోత్సహించబడ్డాడు, దాని వల్ల ఎలాంటి ఫలితాలు రావచ్చు.

అతని కార్యాలయం, ఒక కాపలాదారు వలె. (12-21) 
ఈ మిషన్ పవిత్ర దేవదూతలకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అతనిని పంపిన దేవుడు తన పనిలో అతనికి మద్దతునిచ్చే శక్తిని కలిగి ఉన్నాడని యెహెజ్కేలుకు హామీ ఇవ్వడం దాని ఉద్దేశ్యం. అతను తన ప్రజల పాపాలు మరియు బాధల యొక్క దుఃఖభరితమైన స్థితికి తీవ్రంగా చలించిపోయాడు మరియు అతను చూసిన మహిమాన్వితమైన దర్శనానికి అతను పొంగిపోయాడు. ఏకాంతం, ధ్యానం మరియు దేవునితో సహవాసం యొక్క క్షణాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి, అయితే ప్రభువు సేవకుడు తన తరానికి సేవ చేయడంలో తన పిలుపును నెరవేర్చడానికి కూడా సిద్ధం కావాలి.
ఇశ్రాయేలు ఇంటిపై కాపలాదారుగా నియమించినట్లు ప్రభువు ప్రవక్తకు వెల్లడించాడు. మనం దుష్టులను హెచ్చరించినప్పుడు, వారి అంతిమ పతనానికి మనం బాధ్యులము కాదు. ఈ గద్యాలై వాస్తవానికి ఇజ్రాయెల్‌తో స్థాపించబడిన జాతీయ ఒడంబడికను సూచిస్తున్నప్పటికీ, ఏదైనా దైవిక ఏర్పాటు క్రింద ఉన్న వ్యక్తులందరి అంతిమ విధికి కూడా అవి అన్వయించబడతాయి. మన కర్తవ్యం నీతిమంతులుగా కనిపించే వారికి ప్రోత్సాహం మరియు సాంత్వన అందించడానికే పరిమితం కాదు; మేము హెచ్చరికలను కూడా అందించాలి, ఎందుకంటే చాలామంది గర్వంగా మరియు ఆత్మసంతృప్తి చెందారు, ఫలితంగా వారి పతనానికి మరియు ఆధ్యాత్మిక మరణానికి కూడా దారితీసింది. కావున, సువార్త వినే వారు హెచ్చరికలు మరియు నిందలు రెండింటినీ ఆసక్తిగా వెదకాలి మరియు విలువైనదిగా ఉండాలి.

అతని ప్రసంగాన్ని నిరోధించడం మరియు పునరుద్ధరించడం. (22-27)
దేవుడు మరియు మానవాళి మధ్య ఆశీర్వాద సంబంధాన్ని సులభతరం చేసే క్రీస్తు మధ్యవర్తిత్వానికి మన శాశ్వతమైన కృతజ్ఞతను తెలియజేస్తాము. నిజమైన విశ్వాసి ఇలా ప్రకటిస్తాడు, "ఈ ఏకాంతంలో ఉన్నప్పుడు కంటే నేను ఎప్పుడూ కలిసి ఉండను." ప్రభువు యెహెజ్కేల్‌కు మాట్లాడటానికి అధికారం ఇచ్చినప్పుడు, అతని సందేశాన్ని ధైర్యంగా అందించడం, జీవితం మరియు మరణం, దీవెనలు మరియు శాపాలు, ప్రజల ముందు ప్రదర్శించడం, ఆపై ఎంపికను వారి చేతుల్లో వదిలివేయడం వంటి బాధ్యత అతనికి అప్పగించబడింది.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |