Ezekiel - యెహెఙ్కేలు 31 | View All

1. మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. mariyu padakondava samvatsaramu moodava nela modati dinamuna yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavicchenu.

2. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు?

2. naraputrudaa, neevu aigupthu raajaina pharothoonu athani samoohamuthoonu itlanumu ghanudavaina neevu evanithoo samaanudavu?

3. అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.

3. ashshooreeyulu lebaanonu dhevadaaru vrukshamainattundiri. daani kommalu shrungaaramulu, daani guburu vishaalamu, daanikona bahu etthayinanduna meghamulaku antenu.

4. నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.

4. neellundutavalana adhi mikkili goppadaayenu, lothaina nadhi aadhaaramainanduna adhi mikkili yetthugaa perigenu, adhi yundu chootuna aa nadhi kaaluvalu paaruchu polamulonu chetlannitikini pravahinchenu.

5. కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.

5. kaabatti adhi edigi polamu loni chetlannitikante etthugaladaayenu, daani shaakhalu bahu visthaaramulaayenu, neeru samruddhigaa unnanduna daani chigullu peddakommalaayenu.

6. ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.
మత్తయి 13:32, మార్కు 4:32, లూకా 13:19

6. aakaashapakshulanniyu daani shaakhalalo goollukattukonenu, bhoojanthuvulanniyu daani kommalakrinda pillalu pettenu, daani needanu sakalamaina goppa janamulu nivasinchenu.

7. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను.

7. eelaaguna adhi podugaina kommalu kaligi daaniveru visthaara jalamunna choota paarutavalana adhi mikkili goppadai kantiki andamaina daayenu.

8. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు.
ప్రకటన గ్రంథం 2:7

8. dhevuni vanamulonunna dhevadaaru vrukshamulu daani marugu cheyalekapoyenu, saralavrukshamulu daani shaakhalantha goppavikaavu akshota vrukshamulu daani kommalantha goppavikaavu, daanikunna shrungaaramu dhevuni vanamulonunna vrukshamulalo dhenikini ledu.

9. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.

9. visthaaramaina kommalathoo nenu daanini shrungaarinchinanduna dhevuni vanamaina edhenulonunna vrukshamulanniyu daani sogasu chuchi daaniyandu asooyapadenu.

10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను.

10. kaavuna prabhuvaina yehovaa ee maata selavichu chunnaadu nee yetthunubatti neevu athishayapadithivi, thana kona meghamulakantajesi thana yetthunubatti athadu garvinchenu.

11. కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యత నిని తరిమి వేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించె దను; ఆ జనము అతనికి తగినపని చేయును.

11. kaabatti yathani dushtatvamunubatti yatha nini tharimi vesi, janamulalo balamugala janamunaku nenathani nappaginche danu; aa janamu athaniki thaginapani cheyunu.

12. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండల లోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.

12. janamulalo kroorulaina paradheshulu athanini nariki paaravesiri, kondala lonu loyalannitilonu athani kommalu padenu, bhoomi yandunna vaagulalo athani shaakhalu virigi padenu, bhoojanulandarunu athani needanu vidichi athanini padiyunda nichiri.

13. పడిపోయిన అతని మోడుమీద ఆకాశపక్షు లన్నియు దిగి వ్రాలును, అతని కొమ్మలమీద భూజంతువు లన్నియు పడును.

13. padipoyina athani modumeeda aakaashapakshu lanniyu digi vraalunu, athani kommalameeda bhoojanthuvu lanniyu padunu.

14. నీరున్నచోటున నున్న వృక్షము లన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి, తన కొనను మేఘముల కంటజేసి, యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింపకుండునట్లు, క్రిందిలోకమునకుపోవు నరుల యొద్దకు దిగువారితోకూడ మరణము పాలైరి.

14. neerunnachootuna nunna vrukshamu lannitilo ediyu thana yetthunubatti athishayapadi, thana konanu meghamula kantajesi, ye vrukshamugaani daani yetthunubatti garvimpakundunatlu, krindilokamunakupovu narula yoddhaku diguvaarithookooda maranamu paalairi.

15. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షములన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడ వేయగా

15. prabhuvaina yehovaa selavichunadhemanagaa athadu paathaalamuloniki poyina dinamuna nenu angalaarpu kalugajesithini, agaadhajalamulu athani kappajesithini, aneka jalamulanu aapi athaninibatti nenu vaati pravaahamulanu bandhinchithini, athanikoraku nenu lebaanonu parvathamunu gaadhaandhakaaramu kammajesithini, phalavrukshamulanniyu athanigoorchi vyaakulapadenu, paathaalamuloniki nenathani dimpagaa gothiloniki povuvaariyoddhaku athani pada veyagaa

16. అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.

16. athani paatu dhvanichetha janamulanu vanakajesi thini, neeru peelchu lebaanonu shreshthavrukshamulanniyu edhenu vrukshamulanniyu paathaalamulo thammunu thaamu odaarchukoniri.

17. అన్యజనులమధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారి యొద్దకు దిగిరి.

17. anyajanulamadhya athani needanu nivasinchi athaniki sahaayulaguvaaru athanithookooda paathaalamunaku athadu hathamu chesinavaari yoddhaku digiri.

18. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

18. kaabatti ghanamugaanu goppagaanunna neevu edhenu vanamuloni vrukshamulalo dheniki samudavu? neevu paathaalamuloniki troyabadi, ghanulai akkadiki digipoyina raajulayoddha unduvu; khadgamuchetha hathulaina vaari yoddhanu sunnathinondanivaariyoddhanu neevu padiyunnaavu. Pharokunu athani samoohamunakunu eelaagu sambhavinchunu; idhe prabhuvagu yehovaa vaakku.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అష్షూరు మహిమ. (1-9) 
ఇతరులు అనుభవించే పతనాలు, పాపం వల్ల లేదా వారి అంతిమ నాశనం కారణంగా, ఒక హెచ్చరిక కథగా ఉపయోగపడుతుంది, ఆత్మసంతృప్తి చెందకుండా లేదా అతిగా గర్వించకూడదని మనకు గుర్తుచేస్తుంది. అష్షూరు పాలకుడిలా ఈజిప్టు రాజును గంభీరమైన దేవదారు చెట్టుతో పోల్చడం ద్వారా ప్రవక్త ఈ విషయాన్ని వివరిస్తాడు. ఇతరులను అధిగమించేవారు తరచుగా అసూయకు గురి అవుతారు, అయితే పరలోక పరదైసులో లభించే ఆశీర్వాదాలు అలాంటి ప్రతికూలతతో కలుషితం కావు. భూమిపై ఉన్న ఏ జీవి అయినా అందించగల అత్యంత విశ్వసనీయమైన భద్రత చెట్టు నీడ వలె నశ్వరమైనది, ఉత్తమమైన రక్షణను అందిస్తుంది. బదులుగా, నిజమైన భద్రత లభించే దేవునిలో ఆశ్రయం పొందుదాం. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను ఉన్నతీకరించడంలో దేవుని పాత్రను మనం గుర్తించాలి మరియు వారి పట్ల అసూయపడకుండా ఉండాలి. ప్రాపంచిక వ్యక్తులు తిరుగులేని శ్రేయస్సును అనుభవిస్తున్నట్లు కనిపించినప్పటికీ, ఈ ప్రదర్శన తరచుగా మోసపూరితంగా ఉంటుంది.

దాని పతనం, మరియు ఈజిప్టు వంటిది. (10-18)
ఈజిప్టు రాజు అష్షూరు రాజు యొక్క గొప్పతనాన్ని మాత్రమే కాకుండా గర్వాన్ని కూడా పంచుకున్నాడు మరియు అతని పతనంలో అతను కూడా ఎలా పాలుపంచుకుంటాడో ఇప్పుడు మనం చూస్తున్నాము. అతని స్వంత పాపపు చర్యలే అతని నాశనానికి దారి తీస్తుంది. మన సుఖాలు ఏవీ నిజంగా కోల్పోవు; బదులుగా, అవి తరచుగా పునరావృతమయ్యే అతిక్రమణల ద్వారా జప్తు చేయబడతాయి. ప్రముఖ వ్యక్తులు పడిపోయినప్పుడు, వారి ముందు చాలా మంది పడిపోయినట్లే, వారు తరచూ వారితో పాటు చాలా మందిని దించుతారు. అహంకారి వ్యక్తుల పతనం ఇతరులకు వినయాన్ని కాపాడుకోవడానికి ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది.
ఫరో ఎంత దిగజారిపోయాడో పరిశీలించండి మరియు ఒకప్పుడు అతని గొప్ప ఆడంబరం మరియు గర్వం తగ్గించబడిన క్షమించండి. దేవుని మహిమ కోసం మరియు మానవాళి ప్రయోజనం కోసం ఫలాలను ఇచ్చే వినయపూర్వకమైన నీతి వృక్షంగా ఉండటం చాలా మంచిది. దుష్ట వ్యక్తులు దేవదారు వృక్షాలలాగా వర్ధిల్లుతూ, పచ్చని చెట్లు లాగా వర్ధిల్లుతున్నట్లు కనిపించవచ్చు, కానీ వారి శ్రేయస్సు స్వల్పకాలికం మరియు వారు త్వరలోనే మరచిపోతారు. కాబట్టి మనం, నీతిమంతుల మరియు నిటారుగా ఉన్నవారి జీవితాలను గమనించండి, ఎందుకంటే వారి అంతిమ ముగింపు శాంతి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |