Ezekiel - యెహెఙ్కేలు 40 | View All

1. మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.

1. In the twenty-fifth year of our captivity, in the beginning of the year, in the tenth of the month, in the fourteenth year after the city was stricken, in the same day the hand of Jehovah was on me, and brought me there.

2. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను.
ప్రకటన గ్రంథం 21:10

2. In the visions of God He brought me into the land of Israel, and made me rest on a very high mountain. And it went up, as the structure of the city on the south.

3. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.
ప్రకటన గ్రంథం 11:1, ప్రకటన గ్రంథం 21:15

3. And He brought me there, and behold, a man whose appearance was like the appearance of bronze, and a line of flax in his hand, and a measuring reed. And he stood in the gate.

4. ఆ మను ష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.

4. And the man said to me, Son of man, behold with your eyes and hear with your ears, and set your heart on all that I shall show you. For you are brought here so that I might show them to you. Declare all that you see to the house of Israel.

5. నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
ప్రకటన గ్రంథం 21:15

5. And behold, a wall on the outside of the house all around, and in the man's hand was a measuring reed, six cubits long, with a cubit and a span. And he measured the building's breadth, one reed; and the height, one reed.

6. అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.

6. And he came to the gate which faced eastward, and went up its steps, and measured the threshold of the gate, one reed wide, even the one threshold, one reed wide.

7. మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.

7. And a room was one reed long and one reed wide. And between the rooms were five cubits. And the threshold of the gate by the porch of the gate from the house, one reed.

8. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.

8. He also measured the porch of the gate inside, one reed.

9. గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.

9. And he measured the porch of the gate, eight cubits; and its pillars, two cubits; also the porch of the gate from the house.

10. తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.

10. And the gate rooms eastward were three from here, and three from there; one measure to the three of them; and one measure was to the pillars from here and from there.

11. ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.

11. And he measured the breadth of the gate-opening, ten cubits. The length of the gate was thirteen cubits.

12. కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.

12. And the border in front of the rooms was one cubit from here, and the space was one cubit from there. And the room was six cubits from here and six cubits from there.

13. ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.

13. And he measured the gate of the room from the roof to roof, twenty-five cubits wide, door to door.

14. అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.

14. He also made the pillars, sixty cubits, even to the court-pillar, from the gate all around.

15. బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.

15. And on the face of the entrance gate to the face of the porch of the inner gate was fifty cubits;

16. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.

16. and latticed windows were to the rooms and to their pillars inside the gate all around. And so for the porches; and windows were all around inside; and to each pillar were palm trees.

17. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.

17. And he brought me into the outer court, and lo, chambers, and a pavement made for the court all around. Thirty rooms were on the pavement.

18. ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను.

18. And the pavement by the side of the gates to equal the length of the gates was the lower pavement.

19. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.

19. And he measured the breadth from the front of the lower gate to the front of the inner court on the outside, a hundred cubits eastward and northward.

20. మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును

20. And the gate which faces the way of the north of the outer court, he measured its length and its breadth.

21. దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.

21. And its rooms were three from here and three from there. And its pillars and its porches were according to the first measure. Its length was fifty cubits, and its breadth, twenty-five cubits.

22. వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.

22. And their windows, and their porches, and their palm trees, were according to the measure of the gate facing the east. And they went up to it by seven steps; and its porches were before them.

23. ఉత్తరద్వారమున కెదురుగా ఒకటియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.

23. And the gate of the inner court was across from the gate toward the north and toward the east. And he measured from gate to gate, a hundred cubits.

24. అతడు నన్ను దక్షిణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.

24. And he led me southward, and behold a gate southward. And he measured its pillars and its porches according to these measures.

25. మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.

25. And there were windows in it and in its porches all around, like those windows. The length was fifty cubits, and the breadth, twenty-five cubits.

26. ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను

26. And seven steps were going up to it, and its porches were before them. And it had palm trees, one from here and another from there, on its pillars.

27. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.

27. And there was a gate in the inner court southward. And he measured from gate to gate southward, a hundred cubits.

28. అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.

28. And he brought me to the inner court by the south gate. And he measured the south gate according to these measures,

29. మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు

29. and its rooms and its pillars and its porches according to these measures. And there were windows in it and in its porches all around. It was fifty cubits long and twenty-five cubits wide.

30. చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.

30. And the porches all around were twenty-five cubits long and five cubits wide.

31. దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

31. And its porches were toward the outer court; and palm trees on its pillars. And its stairway had eight steps.

32. తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.

32. And he brought me into the inner court eastward. And he measured the gate according to these measures.

33. దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.

33. And its rooms, and its pillars, and its porches, were measured according to these measures. And there were windows in it and in its porches all around. It was fifty cubits long and twenty-five cubits wide.

34. దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

34. And its porches were toward the outer court. And palm trees were on its pillars, from here, and from there. And its stairway had eight steps.

35. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.

35. And he brought me to the north gate, and measured it according to these measures;

36. దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.

36. its rooms, its pillars, and its porches, and its windows all around. The length was fifty cubits, and the breadth twenty-five cubits.

37. దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

37. And its pillars were toward the outer court. And palm trees were on its pillars, from here and from there. And its stairway had eight steps.

38. గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.

38. And the chamber and its door was by the pillars of the gates; they washed the burnt offering there.

39. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశు వులును వధింపబడును.

39. And in the porch of the gate were two tables from here and two tables from there, for the slaughtering of the burnt offering and the sin offering and the trespass offering.

40. గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.

40. And to the side outside, as one goes up to the door of the gate northward were two tables; and on the other side at the porch of the gate, two tables.

41. దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.

41. Four tables were from here, and four tables were from there, by the side of the gate: eight tables; they slaughter on them.

42. అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.

42. And the four tables for burnt offering were of cut stone, a cubit and a half long, and a cubit and a half wide, and one cubit high. They also rested on them the instruments with which they slaughtered the burnt offering and the sacrifice.

43. చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.

43. And the double hooks of one span were fastened in the house all around, and on the tables the flesh of the offering.

44. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొకటియు రెండు గదులుండెను.

44. And from the outside to the inner court were the chambers of the singers in the inner court, which was at the side of the north gate. And their face was southward: one at the side of the east gate looked the way of the north.

45. అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.

45. And he said to me, This chamber facing southward is for the priests, the keepers of the charge of the house.

46. ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.

46. And the chamber facing northward is for the priests, the keepers of the charge of the altar. They are the sons of Zadok among the sons of Levi, who come near Jehovah to minister to Him.

47. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
ప్రకటన గ్రంథం 11:1

47. And he measured the court, a square, a hundred cubits long and a hundred cubits wide; and the altar was before the house.

48. అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.

48. And he brought me to the porch of the house and measured each pillar of the porch, five cubits from here and five cubits from there. And the gate was three cubits wide from here and three cubits from there.

49. మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.

49. The porch was twenty cubits long, and eleven cubits wide. And he brought me by the steps by which they went up to it. And columns were by the pillars, one from here and another from there.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 40 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయ దర్శనం.
ఇక్కడ ఒక దర్శనం, 40వ అధ్యాయంలో మొదలై, పుస్తకం చివర, 48వ అధ్యాయం వరకు విస్తరించింది. ఈ విభాగం మొత్తం బైబిల్‌లోని అత్యంత సవాలుగా ఉన్న భాగాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తించబడింది. అధిగమించలేనిదిగా అనిపించే ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, మన మోక్షం ప్రతి వివరాలను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉండదు, కానీ ముఖ్యమైన సత్యాల స్పష్టతపై ఆధారపడినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ క్లిష్టమైన విషయాలలో కూడా మనం దేవుని ప్రత్యక్షత కోసం ఓపికగా ఎదురుచూడాలి.
ఈ అధ్యాయం ఆలయం యొక్క రెండు బయటి ఆస్థానాలను వర్ణిస్తుంది. ఇక్కడ పేర్కొన్న వ్యక్తి దేవుని కుమారుడా లేదా సృష్టించబడిన దేవదూత అనేది అస్పష్టంగానే ఉంది. అయితే, క్రీస్తు మన బలిపీఠం మరియు త్యాగం రెండింటినీ గుర్తుంచుకోవడం చాలా అవసరం. దేవునితో మన పరస్పర చర్యలన్నిటిలో మన దృష్టిని ఆయనపై నిలిపి విశ్వాసంతో దేవుని చేరుకోవాలి. కీర్తనల గ్రంథము 74:12మనకు చెబుతున్నట్లుగా, అతను భూమి మధ్యలో మోక్షంగా ఉన్నాడు, ప్రపంచం నలుమూలల నుండి వెతకవలసిన ఒక దీపం.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |