Ezekiel - యెహెఙ్కేలు 42 | View All

1. అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

1. పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న భవనానికి నన్ను నడిపించాడు.

2. ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది.

2. ఉత్తర దిశన ఉన్న భవనం పొడవు నూరు మూరలు; వెడల్పు ఏభైమూరలు ఉంది.

3. ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టాకెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

3. ఈ కట్టడాల గోడల మీద మూడంతస్థుల్లో వసారాలు ఉన్నాయి. భవనానికి, ఆలయానికి మధ్య లోపలి ఆవరణ ఇరవై మూరలుంది. దాని పక్కన గదులు బయట ఆవరణ యొక్క చుదునుబాటను చూస్తూ ఉంది.

4. గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముం డెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.

4. ఆ గదుల ముందు ఒక చావడి ఉంది. దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు (ఇది భవనానికి తూర్పుదిశగా ఉంది). వాటి తలుపులు ఉత్తరానికి ఉన్నాయి.

5. వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.

5. భవనం మూడంతస్థుల ఎత్తు ఉండడం వల్లనూ, వాటి బయటి ఆవరణకు స్థంభాలు లేకపొవడంవల్ల పై అంతస్థుల్లో ఉన్న గదులు, మధ్యన మరియు కింది గదులకన్నా చాలా వెనుకనున్నాయి.

6. మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.

6. పై అంతస్థులో వసారాలు ఎక్కువ స్థలం తీసుకోవటంతో పై అంతస్థులు మధ్య అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. మధ్య అంతస్థు కింది అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది.

7. మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.

7. బయట ఒక గోడ ఉంది. అది గదులకు సమాంతరంగా ఉంది. అది గదులకు ముందు ఏభై మూరల వరకు వెళ్తుంది.

8. బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.

8. ఆ భవనం మొత్త ఆలయం పైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవరణలో అది ఏభై మూరల పొడవు ఉంది.

9. ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.

9. ఈ గదుల ద్వారం భవనపు తూర్పు దిక్కుకు దిగువన ఉంది. కానీ ప్రజలు బయటి ఆవరణ నుండి ప్రవేశించవచ్చు.

10. విడిచోటునకు ఎదురు గాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టు కొన్ని గదులుండెను.

10. ఆవరణ పక్కనున్న గోడ మొదట్లో ఉంది. ఈ గదుల ముందు దక్షిణ దిక్కున నియమిత స్థలంలో గదులు ఉన్నాయి.

11. మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.

11. ఒక చావడి కూడా ఉంది. అవి ఉత్తర దిశన వున్న గదులమాదిరే ఉన్నాయి. దక్షిణవైపు తలుపుల పొడవు వెడల్పులు ఉత్తర దిక్కున వున్నవాటి లెక్కనే ఉన్నాయి. ఉత్తర దిశ తలుపులకు వున్న కొలతలు, గుమ్మాల మాదిరే దక్షిణ తలుపులకు కూడ ఉన్నాయి.

12. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.

12. కింది గదులకు ప్రవేశం భవనం తూర్పు దిక్కు చివరన ఉంది కాబట్టి ప్రజలు గోడ బయటి మార్గం గుండా ప్రవేశించవచ్చు.

13. అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తు వులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.

13. ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు.

14. యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.

14. యాజకులు పవిత్ర ప్రదేశంలో ప్రవేశిస్తారు. కాని వారు బయటి ఆవరణలోకి వెళ్లే ముందు, వారు సేవ చేసేటప్పుడు ధరించే బట్టలను పవిత్ర స్థలంలో వదిలి వేస్తారు. అవి అతి పవిత్రమైన బట్టలు గనుక వారలా చేస్తారు. ఒక యాజకుడు ఆలయంలో సామాన్య ప్రజలు వుండే చోటికి వెళ్లదలచినప్పుడు అతడు వేరే బట్టలు ధరించి వెళ్లవలసి ఉంటుంది.

15. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.

15. ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి భాగాన్నంతా అతడు కొలిచాడు.

16. తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను.

16. ఆ మనుష్యుడు కొలకర్రతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది ఐదువందల మూరల పొడఉంది.

17. ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును

17. అతడు ఉత్తర భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.

18. దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,

18. అతడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.

19. పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.

19. అతడు తిరిగి వెళ్లి పశ్చిమ దిశను కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.

20. నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.

20. ఆ విధంగా అతడు ఆలయం చుట్టూ యొక్క నాలుగు పక్కల కొలిచాడు. ఆలయం చుట్టూ గోడ కట్టబడింది. ఆ గోడ పొడవు అది ఐదువందల మూరల, వెడల్పు అది ఐదువందల మూరలు ఉంది. అది మామూలు ప్రదేశాన్ని, పవిత్ర స్థలం నుండి వేరుచేసింది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 42 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈ అధ్యాయం పూజారి గదులు, వాటి ఉద్దేశ్యం మరియు ఆలయం నిర్మించబడిన పవిత్ర పర్వత పరిమాణాన్ని వివరిస్తుంది. పూజారుల కోసం అనేక గదులు ఉండేవి. యేసు ఒకసారి వ్యాఖ్యానించినట్లుగా, "నా తండ్రి ఇంటిలో అనేక భవనాలు ఉన్నాయి," అదేవిధంగా, అతని భూసంబంధమైన నివాసంలో, అనేక గదులు ఉన్నాయి. విశ్వాసం ద్వారా, అనేకమంది అతని పవిత్ర స్థలంలో ఆశ్రయం పొందుతారు మరియు అక్కడ విస్తారమైన స్థలం ఉంటుంది. ఈ గదులు ఏకాంతంగా ఉన్నప్పటికీ, ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి. ఈ గదులలోని మన ప్రైవేట్ మతపరమైన ఆచారాలు మనలను బహిరంగ ఆరాధనకు సిద్ధం చేయాలి మరియు మన భక్తిని పెంపొందించడంలో, మనకు అందించిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడతాయి.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |