Ezekiel - యెహెఙ్కేలు 44 | View All

1. తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.

మూసివున్న తూర్పు ద్వారం దేవుని మహిమాప్రకాశం ఆ ద్వారం గుండానే ప్రవేశించిందని అస్తమానమూ ప్రజలకు గుర్తుచేస్తూ ఉంటుంది. పాత ఆలయం తూర్పు ద్వారం గుండా వెడలిపోయినట్టుగా (యెహెఙ్కేలు 10:19; యెహెఙ్కేలు 11:22) తిరిగి మరెన్నడూ వెడలిపోనని దేవుడు వారికిచ్చిన మాటలను (యెహెఙ్కేలు 43:7, యెహెఙ్కేలు 43:9) కూడా అది వారికి గుర్తు చేస్తూ ఉంటుంది.

2. అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.

3. అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహా రము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటపమార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను.

“అధిపతి”– యెహెఙ్కేలు 34:24; యెహెఙ్కేలు 37:25. ఈ అధ్యాయాల్లోని అధిపతి అభిషిక్తుడు (క్రీస్తు) కాదు. ఎందుకంటే ఈ అధిపతి తన పాపాల కోసం బలులు అర్పించ వలసినవాడు (యెహెఙ్కేలు 45:22).

4. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా
ప్రకటన గ్రంథం 15:8

యెహెఙ్కేలు 43:5; నిర్గమకాండము 40:35; 1 రాజులు 8:10-11.

5. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటను గూర్చి యోచించుము.

తాను వెల్లడించిన దానిలోని వివరాలన్నీ ఎంత ముఖ్యమైనవో దేవుడు యెహెజ్కేలు మనసుకు హత్తుకునేలా చెప్తున్నాడు.

6. తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును.

“అసహ్య క్రియలు”– యెహెఙ్కేలు 5:11; యెహెఙ్కేలు 7:20; యెహెఙ్కేలు 11:18, యెహెఙ్కేలు 11:21; యెహెఙ్కేలు 37:23; యిర్మియా 16:18.

7. ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగ పరచిరి.
అపో. కార్యములు 21:28

“సున్నతి లేని”– యిర్మియా 9:26; అపో. కార్యములు 7:51. అంటే ఆధ్యాత్మికంగా అయోగ్యులు, దేవునితో ఒడంబడిక సంబంధం లేనివారు.

8. నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.

చెయ్యమని దేవుడు మనకు అప్పగించినదాన్ని ఇతరుల పైకి మనం నెట్టేస్తే ఆయన సేవకు మనం పనికి రామని మనకు మనమే నిరూపించుకొన్న వారమౌతాం.

9. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.

అంటే ఈ దర్శనం నెరవేరే కాలంలో ఇలాంటివారు కూడా ఇస్రాయేల్‌ప్రజల మధ్య నివసిస్తూ ఉంటారన్నమాట. ఇప్పటి కాలంలో మనకు కూడా ఇందులో గుణపాఠం ఉంది. దేవునితో సంబంధం లేకుండా, క్రీస్తు రక్తంలో శుద్ధి కానివాళ్ళకు సంఘంలో స్థానం ఉండకూడదు.

10. మరియఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.

“లేవీ గోత్రికులు తమ అపరాధం”– యెహెఙ్కేలు 16:18-21; యెహెఙ్కేలు 22:26; యిర్మియా 2:8; యిర్మియా 5:31; యిర్మియా 8:1-2; యిర్మియా 26:7-8; యిర్మియా 32:32.

11. అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వార పాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్ష మున నియమింపబడినవారు.

12. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

13. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు; వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతిపరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు.

“అవమానం...అనుభవించాలి”– పాపం విచారకరమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు – 2 సమూయేలు 12:10-14. విత్తనాలు చల్లడం, పంట కోయడం విషయంలో దేవుని చట్టం నుంచి మనం తప్పించుకోలేము. లేవీవారి విషయంలోనైతే వారికి దక్కవలసిన స్థానంకంటే తక్కువ స్థానాన్ని అంగీకరించవలసి రావడమే వారు భరించవలసిన అనుమానం.

14. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను.

15. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

సాదోకు సంతానం మాత్రమే విశ్వాస పాత్రులుగా నిలిచారు. వారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సాదోకు గురించి 2 సమూయేలు 8:17; 2 సమూయేలు 15:24-29; 2 సమూయేలు 20:25 చూడండి. విశ్వాసులుగా ఈ జీవితంలో మనం చేసే సేవపై మనకు శాశ్వతమైన ప్రతిఫలం ఉంటుందా ఉండదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది (1 కోరింథీయులకు 3:12-14).

16. వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

17. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనారబట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మములద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్ల బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు.

యాజుల కోసం ఈ ఆదేశాలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆదేశాలలాంటివి (నిర్గమకాండము 39:27-29; లేవీయకాండము 6:10; లేవీయకాండము 10:9; లేవీయకాండము 15:31; లేవీయకాండము 21:1-5, లేవీయకాండము 21:7; ద్వితీయోపదేశకాండము 17:8-9; లేవీ 23వ అధ్యాయం; లేవీయకాండము 21:1-3; సంఖ్యాకాండము 18:20, సంఖ్యాకాండము 18:23-24). ఈ దర్శనంలో వెల్లడి అయిన కాలంలో పవిత్ర వస్తువులకూ సాధారణ వస్తువులకూ, శుద్ధమైన, అశుద్ధమైన వస్తువులకూ మధ్య తేడాలు ఇంకా ఉంటాయని గమనించండి. అంతే కాదు, లోకంలో జగడాలు, మరణం కూడా ఇంకా ఉంటాయి (వ 24,25,31). ఈ కారణాలవల్ల ఈ దర్శనం విమోచన పొందినవారు ఉండే అనంత యుగాలను వర్ణించడంలేదని తెలుస్తున్నది. ఎందుకంటే అప్పుడు పైన చెప్పినవేవీ ఉండవు.

18. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుప నారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.

19. బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను,

20. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తలవెండ్రుకలు పెరుగ నియ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను.

21. లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.

22. వారు విధవ రాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొన కూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసికొనవచ్చును.

23. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

24. జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతి దినములను ఆచరించుదురు.

25. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడ కూడదు.

26. ఒకడు అంటుపడి శుచిర్భూéతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి

27. పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

28. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రా యేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్య కూడదు, నేనే వారికి స్వాస్థ్యము.

సంఖ్యాకాండము 18:20, సంఖ్యాకాండము 18:23-24; ద్వితీయోపదేశకాండము 10:9; యెహోషువ 13:14, యెహోషువ 13:33; యెహోషువ 18:7.

29. నైవేద్యములును పాపపరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును, ఇశ్రాయేలీయులచేత దేవునికి ప్రతిష్టితములగు వస్తువులన్నియు వారివి.

30. మీ ప్రతిష్ఠి తార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటి లోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను.
రోమీయులకు 11:16

31. పక్షులలోను పశువుల లోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 44 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈ అధ్యాయం నిజమైన పూజారులకు సంబంధించిన నిబంధనలను చర్చిస్తుంది. ఇక్కడ ప్రస్తావించబడిన యువరాజు స్పష్టంగా క్రీస్తే, మరియు 2వ వచనంలోని పదాలు క్రీస్తు చేసిన విధంగానే మరెవరూ నిజమైన అభయారణ్యం అయిన స్వర్గానికి ప్రాప్యత పొందలేరనే రిమైండర్‌గా పనిచేస్తాయి. అతను తన స్వంత శ్రేష్ఠత, వ్యక్తిగత పవిత్రత, నీతి మరియు బలం ద్వారా ప్రవేశించాడు-యెహోవా మహిమ యొక్క ప్రకాశం. అయితే, ఈ మార్గం మానవాళి అందరికీ మూసివేయబడింది మరియు మనమందరం పాపులుగా చేరుకోవాలి, అతని త్యాగం మరియు అతని దయ యొక్క పరివర్తన శక్తిపై విశ్వాసం మీద ఆధారపడాలి.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |