Daniel - దానియేలు 2 | View All

1. నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను.

1. nebukadnejaru thana yēlubaḍiyandu reṇḍava samvatsara muna kalalu kanenu. Andunugurin̄chi aayana manassu kalathapaḍagaa aayanaku nidrapaṭṭakuṇḍenu.

2. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖ మున నిలచిరి.

2. kaagaa raaju thaanu kanina kalalanu thanaku teliyajeppuṭakai shakunagaaṇḍranu gaaraḍeevidyagalavaarini maantrikulanu kaldeeyulanu piluva nampuḍani yaagna iyyagaa vaaru vachi raaju samukha muna nilachiri.

3. రాజు వారితో నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలె నని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా

3. raaju vaarithoo nēnoka kala kaṇṭini, aa kala bhaavamu telisikonavale nani nēnu manōvyaakula mondi yunnaananagaa

4. కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.

4. kaldeeyulu siriyaabaashathoo iṭlaniri raaju chirakaalamu jeevin̄chunugaaka. thamari daasulaku kala selaviyyuḍi; mēmu daani bhaavamunu teliyajēsedamu.

5. రాజు నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియ లుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయ బడును.

5. raaju nēnu daani marachi pōthini gaani, kalanu daani bhaavamunu meeru teliyajēyaniyeḍala meeru thutthuniya lugaa cheyabaḍuduru; mee yiṇḍlu peṇṭakuppagaa cheya baḍunu.

6. కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు

6. kalanu daani bhaavamunu teliyajēsinayeḍala daanamulunu bahumaanamulunu mahaa ghanathayu naa samukhamulō nonduduru ganuka kalanu daani bhaavamunu teliyajēyuḍanagaa vaaru

7. రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును

7. raaju aa kalanu thamari daasulamaina maaku cheppinayeḍala mēmu daani bhaavamunu

8. తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి.అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచి యుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను.

8. teliyajēsedamani marala pratyuttharamichiri.Anduku raaju uttharamichi cheppinadhi ēmanagaa nēnu marachi yuṇḍuṭa meeru chuchi kaalaharaṇamu cheyavalenani meeru kanipeṭṭuchunnaṭlu nēnu baagugaa grahin̄chuchunnaanu.

9. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధ మును మోసపుమాటలను నాయెదుట పలుక నుద్దేశించి యున్నారు. మీరు కలను చెప్పలేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును.

9. kaalamu upaayamugaa gaḍapavalenani abaddha munu mōsapumaaṭalanu naayeduṭa paluka nuddheshin̄chi yunnaaru. meeru kalanu cheppalēkapōyina yeḍala nēnu cheppina maaṭa khaṇḍithamu ganuka kalanu naaku cheppuḍi appuḍu daani bhaavamunu teliyajēyuṭaku meeku saamarthyamu kaladani nēnu telisikondunu.

10. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు.

10. anduku kaldeeyulu eelaagu pratyuttharamichiri -bhoomimeeda ē manushyuḍunu raaju aḍigina saṅgathi cheppajaalaḍu, ē chakravarthiyu adhikaariyu shakunagaaniyoddhanu gaaraḍeevidya galavaaniyoddhanu kaldeeyuniyoddhanu iṭṭi saṅgathi vichaarimpa lēdu.

11. రాజు విచారించిన సంగతి బహు అసాధారణ మైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా.

11. raaju vichaarin̄china saṅgathi bahu asaadhaaraṇa mainadhi, dhevathalukaaka marevarunu ee saṅgathi teliyajeppa jaalaru; dhevathala nivaasamulu shareerula madhya uṇḍavugadaa.

12. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.

12. anduku raaju kōpamu techukoni atyaagrahamu gala vaaḍai babulōnulōni gnaanulanandarini sanharimpavalenani yaagna icchenu.

13. ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును ఆతని స్నేహి తులను చంపజూచిరి.

13. iṭṭi shaasanamu bayaludheruṭavalana gnaanulu champabaḍavalasiyuṇḍagaa, vaaru daaniyēlunu aathani snēhi thulanu champajoochiri.

14. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను

14. appuḍu daaniyēlu babulōnulōni gnaanulanu champuṭakai bayaludherina raaja dhehasanrakshakula yadhipathiyagu aryōku daggaraku pōyi, gnaanayukthamugaa manavichesenu

15. రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను.

15. raaju noddhanuṇḍi ee yaagna yintha tvarithamugaa vachuṭa ēmani daaniyēlu raajuyokka adhipathiyaina aryōku naḍugagaa aryōku aa saṅgathi daaniyēlunaku teliyajeppenu.

16. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతి మాలెను.

16. appuḍu daaniyēlu raajasannidhiki pōyi svapna bhaavamunu teliya jeppuṭakai thanaku samayamu dayacheyumani raajunu bathi maalenu.

17. అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి

17. appuḍu daaniyēlu thana yiṇṭiki pōyi thana snēhithu laina hananyaakunu mishaayēlunakunu ajaryaakunu saṅgathi teliyajēsi

18. తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.

18. thaanunu thana snēhithulunu babulōnulō thakkina gnaanulathoo kooḍa nashimpakuṇḍunaṭlu aa kalayokka marmavishayamulō paralōkamandunna dhevuni valana kaṭaakshamu pondu nimitthamai aayananu vēḍukonuḍani vaarini heccharin̄chenu.

19. అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.
ప్రకటన గ్రంథం 11:13, ప్రకటన గ్రంథం 16:11

19. anthaṭa raatriyandu darshanamuchetha aa marmamu daaniyēlunaku bayaluparachabaḍenu ganuka daani yēlu paralōkamandunna dhevuni sthuthin̄chenu.

20. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.

20. eṭlanagaa dhevuḍu gnaanabalamulu kalavaaḍu, yugamulanniṭanu dhevuni naamamu sthuthinondunugaaka.

21. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.

21. aayana kaalamulanu samayamulanu maarchuvaaḍaiyuṇḍi, raajulanu trōsivēyuchu niyamin̄chuchu unnavaaḍunu, vivēkulaku vivēkamunu gnaanulaku gnaanamunu anugrahin̄chuvaaḍunaiyunnaaḍu.

22. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.

22. aayana marugumaaṭalanu marmamulanu bayaluparachunu, andhakaaramulōni saṅgathulu aayanaku teliyunu; veluguyokka nivaasasthalamu aayanayoddhanunnadhi.

23. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.

23. maa pitharula dhevaa, neevu vivēkamunu balamunu naakanugrahin̄chi yunnaavu; mēmaḍigina yee saṅgathi ippuḍu naaku teliyajēsiyunnaavu ganuka nēnu ninnu sthuthin̄chuchu ghanaparachuchunnaanu; yēlayanagaa raajuyokka saṅgathi neevē maaku teliyajēsithivani daaniyēlu marala cheppenu.

24. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లిబబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను.

24. iṭluṇḍagaa daaniyēlu babulōnulōni gnaanulanu nashimpa jēyuṭaku raaju niyamin̄china aryōkunoddhaku veḷlibabulōnulōni gnaanulanu nashimpajēyavaddu, nannu raaju samukhamunaku thooḍukoni pommu, nēnu aa kala bhaavamunu raajunaku teliyajēsedhananenu.

25. కావున అర్యోకురాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కను గొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను.

25. kaavuna aryōkuraajunaku bhaavamu teliyajeppagala yoka manushyuni cherapaṭṭabaḍina yoodulalō nēnu kanu goṇṭinani raajusamukhamuna manavichesi, daaniyēlunu tvaragaa raajusannidhiki thooḍukonipōyenu.

26. రాజునేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా

26. raajunēnu chuchina kalayu daani bhaavamunu teliyajeppuṭa neeku shakyamaa? Ani belteshaajaru anu daaniyēlunu aḍugagaa

27. దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.

27. daaniyēlu raajusamukhamulō eelaagu pratyutthara micchenu raajaḍigina yee marmamu gnaanulainanu gaaraḍeevidya galavaarainanu shakuna gaaṇḍrayinanu, jyōthishkulainanu teliyajeppajaalaru.

28. అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా
మత్తయి 24:6, మార్కు 13:7, లూకా 21:9, ప్రకటన గ్రంథం 1:1, ప్రకటన గ్రంథం 22:6

28. ayithē marmamulanu bayaluparacha gala dhevuḍokaḍu paralōkamandunnaaḍu, antyadhinamula yandu kalugabōvudaanini aayana raajagu nebukadnejaru naku teliyajēsenu. thaamu paḍakameeda paruṇḍagaa thamari manassulō kaligina svapnadarshanamulu ēvanagaa

29. రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను.
ప్రకటన గ్రంథం 1:19, ప్రకటన గ్రంథం 4:1

29. raajaa, prasthuthakaalamu gaḍachina pimmaṭa ēmi jarugunō anukoni thaamu paḍakameeda paruṇḍi manō chinthagalavaarai yuṇḍagaa marmamulanu bayalu parachuvaaḍu kalugabōvudaanini thamariki teliyajēsenu.

30. ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.

30. ithara manushyulakandarikaṇṭe naaku vishēsha gnaanamuṇḍuṭavalana ee marmamu naaku bayaluparacha baḍalēdu. Raajunaku daani bhaavamunu teliyajēyu nimitthamunu, thamari manassuyokka aalōchanalu thaamu telisikonu nimitthamunu adhi bayaluparachabaḍenu.

31. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.

31. raajaa, thaamu choochuchuṇḍagaa brahmaaṇḍamagu oka prathima kanabaḍenu gadaa. ee goppa prathima mahaa prakaashamunu, bhayaṅkaramunaina roopamunu galadai thamariyeduṭa nilichenu.

32. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

32. aa prathimayokka shirassu mēlimi baṅgaarumaya mainadhiyu,daani rommunu bhujamulunu veṇḍiviyu, daani udharamunu thoḍalunu itthaḍiviyu,

33. దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.

33. daani mōkaaḷlu inupaviyu, daani paadamulalō oka bhaagamu inupadhiyu oka bhaagamu maṭṭidiyunaiyuṇḍenu.

34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను.
అపో. కార్యములు 4:11, 1 పేతురు 2:4-7, మత్తయి 21:44, లూకా 20:18

34. mariyu chethi sahaayamu lēka theeyabaḍina oka raayi, yinumunu maṭṭiyu kalisina aa prathimayokka paadamulameeda paḍi daani paadamulanu thutthuniyalugaa virugagoṭṭinaṭṭu thamaku kana baḍenu.

35. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
ప్రకటన గ్రంథం 20:11, అపో. కార్యములు 4:11, 1 పేతురు 2:4-7, మత్తయి 21:44, లూకా 20:18

35. anthaṭa inumunu maṭṭiyu itthaḍiyu veṇḍiyu baṅgaaramunu ēkamugaa dan̄chabaḍi kaḷlamulōni chetthavale kaagaa vaaṭiki sthalamu ecchaṭanu dorakakuṇḍa gaali vaaṭini koṭṭukonipōyenu; prathimanu virugagoṭṭina aa raayi sarvabhoothalamantha mahaa parvathamaayenu.

36. తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.

36. thaamu kanina kalayidhe, daani bhaavamu raajusamukhamuna mēmu teliya jeppedamu.

37. రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.

37. raajaa, paralōka mandunna dhevuḍu raajyamunu adhikaaramunu balamunu ghanathayu thamariki anugra hin̄chi yunnaaḍu; thamaru raajulaku raajaiyunnaaru.

38. ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు

38. aayana manushyulu nivasin̄chu prathisthalamandunu, manushyulanēmi bhoojanthuvulanēmi aakaashapakshulanēmi anniṭini aayana thamari chethi kappagin̄chiyunnaaḍu, vaarandari meeda thamariki prabhutvamu nanugrahin̄chi yunnaaḍu; thaamē aa baṅgaarapu shirassu

39. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

39. thaamu chanipōyina tharuvaatha thamari raajyamukaṇṭe thakkuvaina raajyamokaṭi lēchunu. Aṭutharuvaatha lōkamantha yēlunaṭṭi mooḍava raajyamokaṭi lēchunu. adhi yitthaḍi vaṇṭidagunu.

40. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.

40. pimmaṭa naalugava raajyamokaṭi lēchunu. adhi inumu vale balamugaa uṇḍunu. Inumu samasthamainavaaṭini dan̄chi virugagoṭṭunadhi gadaa; inumu pagulagoṭṭunaṭlu adhi raajyamulanniṭini pagulagoṭṭi poḍicheyunu.

41. పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.

41. paadamulunu vrēḷlunu konthamaṭṭunaku kummari maṭṭidigaanu konthamaṭṭunaku inupadhi gaanunnaṭṭu thamariki kanabaḍenu ganuka aa raajyamulō bhēdamuluṇḍunu. Ayithē inumu buradathoo kalisiyunnaṭṭu kanabaḍenu ganuka aa raajya mulō aalaagunanuṇḍunu, aa raajyamu inumuvaṇṭi balamugaladai yuṇḍunu.

42. పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయ ములో నీరసముగాను ఉండును.

42. paadamula vrēḷlu konthamaṭṭunaku inupavigaanu konthamaṭṭunaku maṭṭivigaanu unnaṭlu aa raajyamu oka vishayamulō balamugaanu oka vishaya mulō neerasamugaanu uṇḍunu.

43. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.

43. inumunu buradayu miḷithamai yuṇḍuṭa thamariki kanabaḍenu; aṭuvale manushya jaathulu miḷithamulai yinumu maṭṭithoo athakanaṭlu vaaru okarithoo okaru posagakayunduru.

44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
1 కోరింథీయులకు 15:24, ప్రకటన గ్రంథం 11:15, మత్తయి 21:44

44. aa raajula kaalamulalō paralōkamandunna dhevuḍu oka raajyamu sthaapin̄chunu. daanikennaṭikini naashanamu kalugadu, aa raajyamu daani pondinavaariki gaaka marevarikini chendadu; adhi mundu cheppina raajyamulanniṭini pagulagoṭṭi nirmoolamu cheyunu gaani adhi yugamulavaraku niluchunu.

45. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
మత్తయి 24:6, ప్రకటన గ్రంథం 1:1, ప్రకటన గ్రంథం 1:19, ప్రకటన గ్రంథం 4:1, ప్రకటన గ్రంథం 22:6, మత్తయి 21:44

45. chethi sahaayamu lēka parvathamunuṇḍi thiyyabaḍina aa raayi yinumunu itthaḍini maṭṭini veṇḍini baṅgaaramunu pagulagoṭṭagaa thamaru chuchithirē; yinduvalana mahaa dhevuḍu mundu jaruga bōvu saṅgathi raajunaku teliyajēsiyunnaaḍu; kala nishchayamu, daani bhaavamu nammadaginadhi ani daaniyēlu raajuthoo cheppenu.

46. అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.

46. anthaṭa raajagu nebukadnejaru daaniyēlunaku saashṭhaaṅganamaskaaramu chesi athani poojin̄chi, naivēdya dhoopamulu athaniki samarpimpa aagnaapin̄chenu.

47. మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.
1 కోరింథీయులకు 14:25, ప్రకటన గ్రంథం 17:14, ప్రకటన గ్రంథం 19:16

47. mariyu raaju'ee marmamunu bayalu parachuṭaku neevu samarthuḍavaithivē; nee dhevuḍu dhevathalaku dhevuḍunu raajulaku prabhuvunu marmamulu bayaluparachu vaaḍunai yunnaaḍani daaniyēlunaku pratyutthara micchenu.

48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబు లోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను.

48. appuḍu raaju daaniyēlunu bahugaa hechin̄chi, anēka goppa daanamulichi, athanini babu lōnu sansthaanamanthaṭimeeda adhipathinigaanu babulōnu gnaanulandarilō pradhaanunigaanu niyamin̄chenu.

49. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దానియేలు రాజుసన్నిధిని ఉండెను.

49. anthaṭa daaniyēlu raajunoddha manavi chesikonagaa raaju shadraku mēshaaku abēdnegōyanu vaarini babulōnu sansthaanamu meeda vichaaraṇakarthalanugaa niyamin̄chenu; ayithē daaniyēlu raajusannidhini uṇḍenu.Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |