Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదాన ములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.
“విగ్రహం”– అంతకు ముందు కల వివరణలో నెబుకద్నెజరు బంగారు తలగా ఉన్నాడు. ఇక్కడ తలనుండి కాళ్ళదాకా బంగారంతో విగ్రహాన్ని చేయించాడు (కనీసం బంగారు తాపడంతో అయినా చేయించి వుంటాడు – యెషయా 40:19). ఇతడు గర్విష్ఠి. తన వైభవం గురించి కలలు కనేవాడు (దానియేలు 4:30). ఈ విగ్రహాన్ని చేయించడం ద్వారా తన అంతరంగంలో ఏముందో ఇతను బయట పెట్టుకుంటున్నాడు గదా. 2వ అధ్యాయంలోని విగ్రహం పూర్తిగా బంగారంతో చేసి ఉండాలని అంటే అది సూచించే రాజ్యాలు తన రాజ్యమే అయి ఉండాలనీ, తన సామ్రాజ్యం స్థానంలో మరొకటి రాకూడదనీ ఇతని ఆశ.
2. రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా
నెబుకద్నెజరు నిజ దేవుణ్ణి తెలుసుకునే దారిలో బయలుదేరినట్టు అనిపించింది (దానియేలు 2:47). అయితే ఈ విగ్రహం వ్యవహారం చూస్తూ ఉంటే ఆ దారిన ఎంతో దూరం వెళ్ళినట్టు లేదు. ఇప్పటికి నిజ దేవుడు అతని దృష్టిలో ఇతర దేవుళ్ళలో ఒకడుగా ఉన్నాడు అంతే. తాను అప్పటిదాకా పూజించిన దేవుళ్ళను ఇతడు వదులుకోదలచుకోలేదు (వ 11). మనుషులు చాలా సార్లు ఇంతే. తమ జాబితాకు మరో దేవుణ్ణి కలుపుకునేందుకు చాలామంది ఇష్టపడతారు గాని తమకున్న అసత్య దేవుళ్ళను మాత్రం విడిచిపెట్టడమంటే ఇష్టం లేదు.
3. ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధి పతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.
4. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా, దేశస్థులారా, ఆ యా భాషలు మాటలాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.ప్రకటన గ్రంథం 10:11
5. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనీయ వీణ విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.మత్తయి 4:9, ప్రకటన గ్రంథం 13:15
6. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయ బడును.మత్తయి 13:42-50, ప్రకటన గ్రంథం 13:15
7. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ వీణ సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆ యా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.
పాపంలో పడిన మనిషి ప్రమాదంలోనుంచి ప్రాణాలతో బయట పడేందుకు ఏదైనా చేస్తాడు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఇలా దిగజారకుండా నిలుస్తారు. (యోబు 2:4-5 నోట్). ఈ యుగాంతంలో క్రీస్తు విరోధి ఈ లోకాన్ని పాలించే రోజుల్లో ఈ విషయం పూర్తిగా వెల్లడౌతుంది (ప్రకటన గ్రంథం 13:15-17).
8. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి
ఈ జ్యోతిష్కుల ప్రాణాలను కాపాడింది యూదులే (దానియేలు 1:12-21). అందుకు వారు చేసినది ఇది (కీర్తనల గ్రంథము 35:12-18 పోల్చి చూడండి). ఈ అధ్యాయంలో దానియేలు గురించి మాట లేదు. ఇందుకు మూడు సాధ్యమైన కారణాలను చెప్పుకోవచ్చు. ఏదో ప్రభుత్వ కార్యంమీద బబులోను విడిచివెళ్ళి ఉండవచ్చు. ఒకవేళ నగరంలోనే ఉంటే ఈ విగ్రహ ప్రతిష్ఠకు హాజరు కావలసిన అవసరం అతనికి లేకపోయి ఉండవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉంటే నిస్సందేహంగా తన స్నేహితుల్లాగానే ఆ బొమ్మకు మ్రొక్కకుండా నిలిచి ఉండివుంటాడు గాని ఆ సమయంలో అతని ఉన్నత పదవిని బట్టి (దానియేలు 2:48) అతనిపై ఫిర్యాదు చేసేందుకు జ్యోతిష్కులకు ధైర్యం చాలి ఉండకపోవచ్చు.
9. రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి రాజు చిరకాలము జీవించును గాక.
10. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.మత్తయి 4:9
11. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.
12. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.
13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషా కును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.
14. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?
15. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?మత్తయి 4:9
16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.
17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము.
“ఒకవేళ”– దేవుని సంకల్పం ఏదైనా సరే వారు దాన్ని అంగీకరించారు. ఏం సంభవించినా సరే వారు సిద్ధంగా ఉన్నారు. అగ్నిజ్వాలల వల్ల కలిగే హింస, మరణం నుండి తప్పించు కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని అనుభవించవలసి వస్తే అనుభవించేందుకైనా అంతే సిద్ధం. ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్న విశ్వాసులందరికీ, ఈ యుగాంతంలో వచ్చే మహా బాధల కాలంలో (మత్తయి 24:21) ఉండే దేవుని ప్రజలందరికీ వీరి మనస్సు, ప్రవర్తన ఆదర్శప్రాయం.
19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.
వ 13; సామెతలు 19:12, సామెతలు 19:19.
20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషా కును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా
21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి.
22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.
23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగాహెబ్రీయులకు 11:34
24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడి గెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.
25. అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.
“దేవ కుమారుని లాంటివాడు”– ఎవరో ఒక దివ్యమూర్తి అని నెబుకద్నెజరు అనుకున్నాడు. అతడు చాలామంది దేవుళ్ళను కొలిచేవాడు. నిజ దేవుని ఏకైక కుమారుని గురించి అతడికేమీ తెలియదు. అయితే బైబిల్లోని ఇతర భాగాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే తన సేవకులతోపాటు ఉండేందుకు దిగివచ్చినది యెహోవా దూత (ఆదికాండము 16:7 నోట్) అని తెలుస్తున్నది. ఈ అగ్నిపరీక్ష దేవ కుమారుణ్ణి వారి మధ్యకు తెచ్చి నిలబెట్టింది. ఆయనను దగ్గరికి తీసుకువచ్చే పరీక్షలను, బాధలను మనం సంతోషంతో ఆహ్వానించాలి. యెషయా 43:1-2 పోల్చి చూడండి.
26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చిషద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకు లారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయ టికి వచ్చిరి.
“సర్వాతీతుడైన దేవుని”– దానియేలు 4:2, దానియేలు 4:34; దానియేలు 5:18, దానియేలు 5:21; దానియేలు 7:18. “బయటికి రండి”– కీర్తనల గ్రంథము 66:8-12 చూడండి. వారు ఈ విశ్వాస పరీక్షలో గెలిచారు. మంటలలో కూడా దేవునికి మహిమ కలిగించారు. ఇప్పుడు వారు సమృద్ధికరమైన స్థలంలో ప్రవేశించారు. దేవుడు తన సేవకులను ఎప్పుడూ ఏదో ఒక అద్భుతమైన రీతిలో విడిపిస్తాడనుకుంటే అది పొరపాటే. తనకోసం ప్రాణాలు ధారపోయాలని కొందరిని కోరుకుంటాడు (హెబ్రీయులకు 11:35-38). ఒక వ్యక్తి విషయంలో ఆయన దేన్ని నిర్ణయిస్తే అతనికీ అదే మంచిది (అపో. కార్యములు 12:1-11 పోల్చిచూడండి).
27. అధిపతులును సేనాధిపతులును సంస్థానాధి పతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒక టైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపో కుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.
28. నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి.
నిజ దేవుణ్ణి తెలుసుకునే దారిలో మరో అడుగు ముందుకు వేశాడీ చక్రవర్తి (దానియేలు 2:47). దేవుని అద్భుతాలను చూచిన ఈజిప్ట్ రాజైన ఫరో ఈ విధంగా ప్రవర్తించలేదు (నిర్గమకాండము 8:15, నిర్గమకాండము 8:32; నిర్గమకాండము 9:34). బబులోనులో దేవుడు తన సేవకుల పైనే గాక చక్రవర్తి పట్ల కూడా అనుగ్రహం చూపుతున్నాడు.
29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.
“మరే దేవుడు రక్షించలేడు”– విగ్రహారాధకుడైన రాజు నోటనుండి ఒక బలమైన వాస్తవమైన సాక్ష్యం. బబులోను దేవుళ్ళలో ఎవరూ ఇలాంటిదేదీ ఎన్నడూ చేయలేదని అతనికి బాగా తెలుసు. దానియేలు 6:27 లో కూడా ఇలాంటిదే మరో సాక్ష్యం కనిపిస్తున్నది.
30. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.