Daniel - దానియేలు 6 | View All

1. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.

1. Darius the Mede decided to divide the kingdom into 120 provinces, and he appointed a high officer to rule over each province.

2. వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్ప కుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

2. The king also chose Daniel and two others as administrators to supervise the high officers and protect the king's interests.

3. ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను.

3. Daniel soon proved himself more capable than all the other administrators and high officers. Because of Daniel's great ability, the king made plans to place him over the entire empire.

4. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.

4. Then the other administrators and high officers began searching for some fault in the way Daniel was handling government affairs, but they couldn't find anything to criticize or condemn. He was faithful, always responsible, and completely trustworthy.

5. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.

5. So they concluded, 'Our only chance of finding grounds for accusing Daniel will be in connection with the rules of his religion.'

6. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి - రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

6. So the administrators and high officers went to the king and said, 'Long live King Darius!

7. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి

7. We are all in agreement-- we administrators, officials, high officers, advisers, and governors-- that the king should make a law that will be strictly enforced. Give orders that for the next thirty days any person who prays to anyone, divine or human-- except to you, Your Majesty-- will be thrown into the den of lions.

8. మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.

8. And now, Your Majesty, issue and sign this law so it cannot be changed, an official law of the Medes and Persians that cannot be revoked.'

9. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.

9. So King Darius signed the law.

10. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

10. But when Daniel learned that the law had been signed, he went home and knelt down as usual in his upstairs room, with its windows open toward Jerusalem. He prayed three times a day, just as he had always done, giving thanks to his God.

11. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి

11. Then the officials went together to Daniel's house and found him praying and asking for God's help.

12. రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమును బట్టిరాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజుమాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.

12. So they went straight to the king and reminded him about his law. 'Did you not sign a law that for the next thirty days any person who prays to anyone, divine or human-- except to you, Your Majesty-- will be thrown into the den of lions?' 'Yes,' the king replied, 'that decision stands; it is an official law of the Medes and Persians that cannot be revoked.'

13. అందుకు వారుచెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి.

13. Then they told the king, 'That man Daniel, one of the captives from Judah, is ignoring you and your law. He still prays to his God three times a day.'

14. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యుడస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.

14. Hearing this, the king was deeply troubled, and he tried to think of a way to save Daniel. He spent the rest of the day looking for a way to get Daniel out of this predicament.

15. ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చిరాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి.

15. In the evening the men went together to the king and said, 'Your Majesty, you know that according to the law of the Medes and the Persians, no law that the king signs can be changed.'

16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

16. So at last the king gave orders for Daniel to be arrested and thrown into the den of lions. The king said to him, 'May your God, whom you serve so faithfully, rescue you.'

17. వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియదానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.

17. A stone was brought and placed over the mouth of the den. The king sealed the stone with his own royal seal and the seals of his nobles, so that no one could rescue Daniel.

18. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

18. Then the king returned to his palace and spent the night fasting. He refused his usual entertainment and couldn't sleep at all that night.

19. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను.

19. Very early the next morning, the king got up and hurried out to the lions' den.

20. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.

20. When he got there, he called out in anguish, 'Daniel, servant of the living God! Was your God, whom you serve so faithfully, able to rescue you from the lions?'

21. అందుకు దానియేలురాజు చిరకాలము జీవించునుగాక.
2 తిమోతికి 4:17

21. Daniel answered, 'Long live the king!

22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
హెబ్రీయులకు 11:33

22. My God sent his angel to shut the lions' mouths so that they would not hurt me, for I have been found innocent in his sight. And I have not wronged you, Your Majesty.'

23. రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.

23. The king was overjoyed and ordered that Daniel be lifted from the den. Not a scratch was found on him, for he had trusted in his God.

24. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.

24. Then the king gave orders to arrest the men who had maliciously accused Daniel. He had them thrown into the lions' den, along with their wives and children. The lions leaped on them and tore them apart before they even hit the floor of the den.

25. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాట లాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.

25. Then King Darius sent this message to the people of every race and nation and language throughout the world: 'Peace and prosperity to you!

26. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
1 పేతురు 1:23, ప్రకటన గ్రంథం 4:9-10

26. 'I decree that everyone throughout my kingdom should tremble with fear before the God of Daniel. For he is the living God, and he will endure forever. His kingdom will never be destroyed, and his rule will never end.

27. ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.

27. He rescues and saves his people; he performs miraculous signs and wonders in the heavens and on earth. He has rescued Daniel from the power of the lions.'

28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్థిల్లెను.

28. So Daniel prospered during the reign of Darius and the reign of Cyrus the Persian.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దానియేలు శత్రువుల దుర్మార్గం. (1-5) 
దానియేలు వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ, అతను తన బాధ్యతలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని మరియు తన విశ్వాసం పట్ల తనకున్న భక్తిలో అస్థిరతను కలిగి ఉన్నాడని, దేవుణ్ణి గౌరవించటానికి మేము అంగీకరిస్తున్నాము. తమ విశ్వాసాన్ని ప్రకటించే వ్యక్తులు తమ మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలలో తప్ప, తమ మనస్సాక్షిని దృఢంగా అనుసరించే విషయాలలో తప్ప, వారిపై తీవ్రమైన విమర్శకుల తప్పును కనుగొనే విధంగా ప్రవర్తించినప్పుడు అది దేవునికి మహిమను తెస్తుంది.

ప్రార్థనలో అతని స్థిరత్వం. (6-10) 
ముప్పై రోజుల పాటు ప్రార్థనను నిషేధించడం అంటే, ఆ సమయంలో దేవుడు మానవాళి నుండి పొందే గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా, వ్యక్తులు దేవునిలో పొందే ఓదార్పును దూరం చేయడంతో సమానం. ప్రతి వ్యక్తి తనకు అవసరమైనప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు సహజంగా దేవుని వైపు మొగ్గు చూపలేదా? దేవుని సన్నిధిపై ఆధారపడకుండా మనం ఒక్కరోజు కూడా వెళ్ళలేము, కాబట్టి ప్రార్థన లేకుండా ఎవరైనా ముప్పై రోజులు ఎలా సహిస్తారు? దురదృష్టవశాత్తూ, ఎటువంటి శాసనం నిషేధించబడకుండా, నిరంతరం ముప్పై రోజులకు పైగా దేవునికి హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రార్థనలు చేయడంలో విఫలమైన వారు వినయపూర్వకంగా కృతజ్ఞతతో నిరంతరం ఆయనకు సేవ చేసే వారి కంటే చాలా ఎక్కువ. ప్రక్షాళన చట్టాలు ఎల్లప్పుడూ తప్పుడు సాకులతో అమలు చేయబడతాయి, కానీ క్రైస్తవులకు చేదు ఫిర్యాదులు చేయడం లేదా దూషించడంలో పాల్గొనడం తగదు. ప్రార్థనకు నిర్ణీత సమయాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. దానియేలు బహిరంగంగా మరియు నిస్సందేహంగా ప్రార్థించాడు మరియు అతని డిమాండ్ బాధ్యతలు ఉన్నప్పటికీ, రోజువారీ భక్తి అభ్యాసాలను నిర్లక్ష్యం చేయడం సాకుగా భావించలేదు. సాపేక్షంగా తక్కువ ప్రాపంచిక నిశ్చితార్థం కలిగి ఉన్నప్పటికీ, తమ ఆత్మలను పోషించుకోవడానికి ఇంత ఎక్కువ కృషిని పెట్టుబడి పెట్టడానికి నిరాకరించే వారు ఎంత క్షమించరానివారు! కష్ట సమయాల్లో, విచక్షణ అనే ముసుగులో, దేవుని పేరు మీద పిరికితనానికి లొంగిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన లేకుండా జీవించే వారిలాగా తమ ఆత్మలను నిర్లక్ష్యం చేసే వారందరూ, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అలా చేశామని చెప్పినప్పటికీ, చివరికి మూర్ఖులుగానే పరిగణించబడతారు. దానియేలు ప్రార్థించడమే కాకుండా కృతజ్ఞతలు కూడా ఇచ్చాడు, ప్రమాద సమయాన్ని తగ్గించడానికి తన ఆరాధనలో ఏ భాగాన్ని తగ్గించలేదు. సారాంశంలో, ప్రార్థన యొక్క కర్తవ్యం సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మరియు విమోచకునిగా దేవుని సమృద్ధితో పాటు పాపాత్ములుగా మన స్వంత అవసరాలలో పాతుకుపోయింది. మన చెరలో ఉన్న ఈ విదేశీ దేశంలో కూడా మనం క్రీస్తుపై దృష్టి పెట్టాలి మరియు అక్కడ మన ప్రార్థనలను నిర్దేశించాలి.

అతను సింహం గుహలో పడవేయబడ్డాడు. (11-17) 
దేవుని పట్ల మనస్సాక్షికి అనుగుణంగా నమ్మకంగా చేసే చర్యలు మొండిగా మరియు పౌర అధికారాన్ని ధిక్కరించేవిగా తప్పుగా చిత్రీకరించడం అసాధారణం కాదు. జాగ్రత్తగా పరిశీలించకపోవడం వల్ల, కింగ్ డారియస్ లాగా, మనం వెయ్యిసార్లు చర్యరద్దు చేయాలని కోరుకునే చర్యలకు మనం తరచుగా చింతిస్తున్నాము. గౌరవనీయమైన డానియల్, అతని గౌరవనీయమైన పాత్ర ఉన్నప్పటికీ, అన్యాయంగా తన దేవుణ్ణి ఆరాధించినందుకు సింహాల గుహలో పడవేయబడ్డాడు, నేరస్థులలో చెత్తగా పరిగణించబడ్డాడు. నిశ్చయంగా, దానియేలు యొక్క అద్భుత విమోచనను మరింత స్పష్టంగా చూపించడానికి దేవుని ప్రావిడెన్స్ ద్వారా రాయిని గుహపై ఉంచడం జరిగింది. డారియస్ రాజు తన స్వంత ముద్రతో రాయిని మూసివేసాడు, బహుశా దానియేలు శత్రువులు అతనికి హాని కలిగించకుండా నిరోధించడానికి. మనం ధర్మబద్ధమైన పనులలో నిమగ్నమై మన జీవితాలను మరియు ఆత్మలను దేవునికి అప్పగిద్దాం. మనం విశ్వసనీయంగా సేవ చేసే వారిపై కూడా మనం ఎల్లప్పుడూ పూర్తిగా ఆధారపడలేనప్పటికీ, విశ్వాసులు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలో దేవుని అనుగ్రహం మరియు ఓదార్పుపై ఆధారపడవచ్చు.

అతని అద్భుత సంరక్షణ. (18-24) 
ప్రశాంతమైన రాత్రికి ఖచ్చితమైన మార్గం స్పష్టమైన మనస్సాక్షిని నిర్వహించడం. సజీవుడైన దేవుని సేవకులకు తమను కాపాడే శక్తి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న యజమాని ఉన్నాడని, రాజు సందేహాలకు భిన్నంగా మనం నమ్మకంగా ఉండవచ్చు. అత్యంత క్రూరమైన ప్రాణులపై కూడా దైవిక శక్తిని సాక్ష్యమివ్వండి మరియు గర్జించే సింహాన్ని నిరంతరం మ్రింగివేయాలని కోరుకునే దేవుని సామర్థ్యంపై విశ్వాసం కలిగి ఉండండి. దానియేలు తన దేవునిపై అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. కర్తవ్య మార్గంలో రక్షణ కోసం ధైర్యంగా మరియు ఆనందంగా దేవునిపై విశ్వాసం ఉంచే వారు ఎల్లప్పుడూ ఆయనను ప్రస్తుత సహాయకుడిగా కనుగొంటారు. ఈ విధంగా, నీతిమంతులు కష్టాల నుండి రక్షించబడతారు, అయితే దుర్మార్గులు వారి పతనాన్ని ఎదుర్కొంటారు. దుష్టుల క్లుప్త విజయం చివరికి వారి నాశనానికి దారి తీస్తుంది.

డారియస్ డిక్రీ. (25-28)
మనం మన జీవితాలను దేవుని భక్తితో నడిపించినప్పుడు మరియు ఆయన మార్గదర్శకానికి కట్టుబడి ఉన్నప్పుడు, మనతో శాంతి ఉంటుంది. రాజ్యం, శక్తి మరియు కీర్తి శాశ్వతంగా ప్రభువుకే చెందుతాయి. అయినప్పటికీ, చాలా మంది అతని విమోచన దయ గురించి తెలియకుండానే ఇతరులకు అతని అద్భుత కార్యాలను ప్రకటించడంలో నిమగ్నమై ఉన్నారు. మనం ఆయన మాటను విశ్వసించడమే కాకుండా దానిని ఆచరణలో పెట్టుదాం, తద్వారా చివరికి మనల్ని మనం మోసం చేసుకున్నామని కనుగొనలేము.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |