Daniel - దానియేలు 8 | View All

1. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సర మందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.

1. In the third year of King Belshazzar's reign, I, Daniel, had a vision, after the one that had already appeared to me.

2. నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను.

2. In my vision I saw myself in the citadel of Susa in the province of Elam; in the vision I was beside the Ulai Canal.

3. నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచి నది.

3. I looked up, and there before me was a ram with two horns, standing beside the canal, and the horns were long. One of the horns was longer than the other but grew up later.

4. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరము గాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.

4. I watched the ram as he charged towards the west and the north and the south. No animal could stand against him, and none could rescue from his power. He did as he pleased and became great.

5. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.

5. As I was thinking about this, suddenly a goat with a prominent horn between his eyes came from the west, crossing the whole earth without touching the ground.

6. ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపము తోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

6. He came towards the two-horned ram I had seen standing beside the canal and charged at him in great rage.

7. నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

7. I saw him attack the ram furiously, striking the ram and shattering his two horns. The ram was powerless to stand against him; the goat knocked him to the ground and trampled on him, and none could rescue the ram from his power.

8. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

8. The goat became very great, but at the height of his power his large horn was broken off, and in its place four prominent horns grew up towards the four winds of heaven.

9. ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

9. Out of one of them came another horn, which started small but grew in power to the south and to the east and towards the Beautiful Land.

10. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగ ద్రొక్కుచుండెను
ప్రకటన గ్రంథం 12:4

10. It grew until it reached the host of the heavens, and it threw some of the starry host down to the earth and trampled on them.

11. ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.

11. It set itself up to be as great as the Prince of the host; it took away the daily sacrifice from him, and the place of his sanctuary was brought low.

12. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్య బడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.

12. Because of rebellion, the host [of the saints] and the daily sacrifice were given over to it. It prospered in everything it did, and truth was thrown to the ground.

13. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి.
ప్రకటన గ్రంథం 11:2

13. Then I heard a holy one speaking, and another holy one said to him, 'How long will it take for the vision to be fulfilled-- the vision concerning the daily sacrifice, the rebellion that causes desolation, and the surrender of the sanctuary and of the host that will be trampled underfoot?'

14. అందుకతడు రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చ బడును.

14. He said to me, 'It will take 2,300 evenings and mornings; then the sanctuary will be reconsecrated.'

15. దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపముగల యొకడు నాయెదుట నిలిచెను.

15. While I, Daniel, was watching the vision and trying to understand it, there before me stood one who looked like a man.

16. అంతట ఊలయి నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అదిగబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.
లూకా 1:19

16. And I heard a man's voice from the Ulai calling, 'Gabriel, tell this man the meaning of the vision.'

17. అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నర పుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమనెను.

17. As he came near the place where I was standing, I was terrified and fell prostrate. 'Son of man,' he said to me, 'understand that the vision concerns the time of the end.'

18. అతడు నాతో మాట లాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.

18. While he was speaking to me, I was in a deep sleep, with my face to the ground. Then he touched me and raised me to my feet.

19. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయు చున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది

19. He said: 'I am going to tell you what will happen later in the time of wrath, because the vision concerns the appointed time of the end.

20. నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.

20. The two-horned ram that you saw represents the kings of Media and Persia.

21. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించు చున్నది.

21. The shaggy goat is the king of Greece, and the large horn between his eyes is the first king.

22. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.

22. The four horns that replaced the one that was broken off represent four kingdoms that will emerge from his nation but will not have the same power.

23. వారి ప్రభుత్వముయొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గల వాడును యుక్తిగలవాడునై యుండి, ఉపాయము తెలిసి కొను ఒక రాజు పుట్టును.

23. 'In the latter part of their reign, when rebels have become completely wicked, a stern-faced king, a master of intrigue, will arise.

24. అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింప జేయును.

24. He will become very strong, but not by his own power. He will cause astounding devastation and will succeed in whatever he does. He will destroy the mighty men and the holy people.

25. మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతి శయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

25. He will cause deceit to prosper, and he will consider himself superior. When they feel secure, he will destroy many and take his stand against the Prince of princes. Yet he will be destroyed, but not by human power.

26. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను.
ప్రకటన గ్రంథం 10:4

26. 'The vision of the evenings and mornings that has been given you is true, but seal up the vision, for it concerns the distant future.'

27. ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధి గ్రస్తుడనైయుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుప గలవాడెవడును లేక పోయెను.

27. I, Daniel, was exhausted and lay ill for several days. Then I got up and went about the king's business. I was appalled by the vision; it was beyond understanding.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దానియేలు పొట్టేలు మరియు మేక దర్శనం. (1-14) 
దేవుడు దానియేలు‌కు భవిష్యత్తులో ఒక సంగ్రహావలోకనం ఇచ్చాడు, ఒకప్పుడు అధికారంలో ఉన్న బబులోనుకు ప్రత్యర్థిగా ఉన్న శక్తివంతమైన రాజ్యాల పతనాన్ని వెల్లడి చేశాడు. మన కాలం తర్వాత సంభవించే పరివర్తనలను మనం ముందుగానే చూడగలిగితే, మన స్వంత యుగంలో వచ్చిన మార్పుల వల్ల మనం తక్కువ కలవరపడవచ్చు. రెండు కొమ్ములతో ఉన్న పొట్టేలు రెండవ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది, మీడియా మరియు పర్షియా, చివరికి అలెగ్జాండర్ ది గ్రేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేకచే జయించబడింది. అలెగ్జాండర్, అతని బలం మరియు ప్రాపంచిక వైభవం ఉన్నప్పటికీ, ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో మరణించాడు, ఆనందాన్ని తీసుకురావడంలో భూసంబంధమైన సంపద మరియు శక్తి యొక్క వ్యర్థతను ప్రదర్శించాడు.
అలెగ్జాండర్ మరణానికి సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు, సర్వోన్నతమైన మొదటి కారణం యొక్క గొప్ప రూపకల్పన అతనికి పోషించాల్సిన పాత్ర లేదని మరియు తద్వారా అతన్ని ఈ ప్రపంచం నుండి తీసుకెళ్లిందని స్పష్టమవుతుంది. తదనంతరం, ఒకే గొప్ప కొమ్ముకు బదులుగా, అలెగ్జాండర్ యొక్క నలుగురు అగ్ర కమాండర్లను సూచించే నాలుగు ప్రముఖ కొమ్ములు ఉద్భవించాయి. వాటిలో, ఒక చిన్న కొమ్ము తలెత్తింది, చర్చి మరియు దేవుని ప్రజలను తీవ్రంగా హింసించేదిగా మారింది, బహుశా మహమ్మదీయ విశ్వాసం యొక్క పెరుగుదలను సూచిస్తుంది. ఈ విశ్వాసం వర్ధిల్లింది మరియు దేవుడు స్థాపించిన నిజమైన మతాన్ని దాదాపు నిర్మూలించింది.
తన ఇంటి అధికారాలను విస్మరించే మరియు అపవిత్రం చేసే వారి నుండి దేవుని న్యాయమే గెలుస్తుంది. దైవిక శాసనాల విలువను గుర్తించని వారికి వారి ఉనికి కంటే వారి లేకపోవడం ద్వారా వారి విలువను కూడా అతను గ్రహించాడు. ఈ విపత్తు కోసం ముందుగా నిర్ణయించిన సమయం గురించి దానియేలు విన్నప్పటికీ, ఖచ్చితమైన సమయం తెలియరాలేదు. దైవిక ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, మనం క్రీస్తు వైపు తిరగాలి, అతనిలో అన్ని జ్ఞానం మరియు జ్ఞానం దాగి ఉన్నాయి, మన నుండి కాదు, మన కోసం. ఖచ్చితమైన సమయం సవాళ్లను కలిగి ఉన్నప్పటికీ, ఈ సంఘటనల పరాకాష్ట చాలా దూరంలో ఉండదు. దేవుడు, తన మహిమ కొరకు, అతను ఉద్దేశించిన విధంగా చివరికి చర్చిని శుభ్రపరుస్తాడు. క్రీస్తు తన చర్చిని శుద్ధి చేయడానికి తనను తాను త్యాగం చేసాడు మరియు దానిని తన ముందు నిర్దోషిగా సమర్పించడానికి దానిని శుభ్రపరుస్తాడు.

దాని వివరణ. (15-27)
దేవుని శాశ్వతమైన కుమారుడు మనిషి రూపంలో ప్రవక్త ముందు కనిపించాడు, దర్శనాన్ని అర్థం చేసుకోమని దేవదూత గాబ్రియేల్‌కు సూచించాడు. దానియేలు యొక్క విపరీతమైన భావోద్వేగాలు, అతని ఆశ్చర్యం మరియు దాదాపు మూర్ఛతో గుర్తించబడ్డాయి, ఆ దృష్టి అతని ప్రజలకు మరియు చర్చికి సుదీర్ఘమైన మరియు తీవ్రమైన పరీక్షలను ముందే చెప్పిందని స్పష్టమైన సూచన.
దర్శనం ముగిసిన తర్వాత, దానిని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాలని దానియేలు‌కు ఆదేశాలు వచ్చాయి. అతను ఈ సూచనను పాటించాడు, దాని గురించి మౌనం వహించాడు మరియు తన బాధ్యతలను నెరవేర్చాడు. మనం ఈ లోకంలో జీవించి ఉండగా, ఎల్లప్పుడూ విధులు నిర్వర్తించవలసి ఉంటుంది మరియు దేవునిచే గొప్పగా అనుగ్రహించబడిన వారు కూడా తమ విధుల నుండి మినహాయించబడినట్లు భావించకూడదు. దేవునితో సహవాసం యొక్క ఆనందం మన బాధ్యతల నుండి మనల్ని మళ్లించకూడదు, కానీ వాటిని నెరవేర్చడంలో మనతో పాటు ఉండాలి.
ప్రజా బాధ్యతలు అప్పగించబడిన ప్రతి ఒక్కరూ తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి మరియు అనిశ్చితులు మరియు నిరుత్సాహం మధ్య, నిజమైన విశ్వాసులు ఇప్పటికీ అనుకూలమైన ఫలితం కోసం ఎదురుచూడవచ్చు. ఈ విధంగా, చర్చిలో మరియు ప్రపంచంలో మనలో ప్రతి ఒక్కరికి అప్పగించబడిన పనుల కోసం మన మనస్సులను సిద్ధం చేయడానికి మనం కృషి చేయాలి.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |