Hosea - హోషేయ 10 | View All

1. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.

“ద్రాక్షచెట్టు”– యెషయా 5:1-7. “తమ కోసమే”– ఆ దేశంలో వారిని నాటిన దేవుని కోసం గాక తమకోసమే వారు ఫలించారు. “బలిపీఠాలను...దేవతా స్తంభాలను”– దేవునికోసం కాక నిజం కాని దేవతల కోసమే కట్టించారు (హోషేయ 4:7; హోషేయ 8:11; హోషేయ 12:11; 1 రాజులు 12:33; 1 రాజులు 14:23; 1 రాజులు 16:32).

2. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.

“కపట మనస్సు”– యిర్మియా 17:9; కీర్తనల గ్రంథము 36:3; కీర్తనల గ్రంథము 119:29. “అపరాధానికి”– హోషేయ 13:16; నిర్గమకాండము 34:7. “బ్రద్దలు చేస్తాడు”– వ 8. ఇతరులు ఈ పని చేసేలా దేవుడు చేస్తాడు – అంటే ఆయనే చేసినట్టన్నమాట.

3. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.

రాజ్యం ధ్వంసమై వారి రాజు ఖైదులో ఉన్నప్పుడు వారు ఇలా అంటారు – 2 రాజులు 17:4-6.

4. అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి.

హోషేయ 4:1; హోషేయ 7:1. కపట మనసులు తమను తాము వెల్లడిపరచుకునే పద్ధతి ఇదే. వ్యాజ్యాలు, కోర్టు కేసులు ఎలాంటివో చూడండి. ఇలాంటి విష పూరితమైన విషయాలకు మనం దూరంగా ఉందాం. 1 కోరింథీయులకు 6:1-8 చూడండి.

5. బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.

“షోమ్రోను...దూడ విగ్రహం”– హోషేయ 8:5. తనను తాను కాపాడుకోలేని ఒక దేవతను ప్రజలు పూజిస్తున్నారు. ఆ విగ్రహం ఎంత శోభాయమానంగా ఉన్నప్పటికీ శక్తి లేనిదే. ఇస్రాయేల్ ప్రజలతో బాటు దాన్ని కూడా చెరపట్టి తీసుకు పోవడం జరిగింది.

6. ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.

“తల వంపులు...సిగ్గు”– వారి బలహీనత, మూర్ఖత్వం, వారి దేవుళ్ళ శక్తిహీనత బయట పడుతుంది. అష్షూరు గురించి నోట్ 2 రాజులు 15:19.

7. షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.

8. ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరు గును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయు డనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.
లూకా 23:30, ప్రకటన గ్రంథం 6:16, ప్రకటన గ్రంథం 9:6

“ఎత్తయిన పూజా స్థలాలు”– హోషేయ 4:13. ఇస్రాయేల్‌వారు దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజించారు గనుక ఇవి చెడుతనం జరిగే స్థలాలు. “ఇస్రాయేల్‌వారు పాపం”– 1 రాజులు 12:30; 1 రాజులు 13:33-34; 1 రాజులు 16:26. “మా మీద పడండి”– దండెత్తి వచ్చిన అష్షూరువారి వల్ల కలిగే అపాయం, వేదనలు భరించరానివిగా అయిపోయి ప్రజలు ఏదైనా కొండ తమ మీద పడి చంపి తమ దుస్థితి నుంచి విడిపించాలని ఆశిస్తారు. లూకా 23:30; ప్రకటన గ్రంథం 6:16 పోల్చిచూడండి.

9. ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా

హోషేయ 9:9 చూడండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. “చేస్తూనే ఉన్నారు”– పశ్చాత్తాపం లేదు. దేవుని వైపు నిజంగా తిరగడం లేదు.

10. నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.

“నాకు ఇష్టం వచ్చినప్పుడు”– ప్రతి దాని గురించీ దేవునికీ ఒక సమయం ఉంటుంది. చాలా కాలం పాటు తీర్పు రాలేదు కాబట్టి అసలు రాదని భావించకూడదు. 2 పేతురు 3:4-9 చూడండి. “రెండు పాపాల”– బహుశా రెండు దూడ ప్రతిమల (ఒకటి దానులో, ఒకటి బేతేల్‌లో) గురించి కావచ్చు. లేక యిర్మియా 2:13 లో చెప్పిన రెండు అపరాధాలు కావచ్చు.

11. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.

“ఎఫ్రాయిం”లేక “యాకోబు” అంటే ఇస్రాయేల్ రాజ్యం అని అర్థం. యూదా అంటే దక్షిణ రాజ్యం. ఈ రెండూ కూడా తుదకు చెరలోకి వెళ్ళిపోయి తమను చెరపట్టినవారికి ఊడిగం చేస్తాయి.

12. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
2 కోరింథీయులకు 9:10

“పంట”– విత్తనాలు చల్లి పంట కోసే విషయంలో దేవుని నియమం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. హోషేయ 8:7; యోబు 4:8; కీర్తనల గ్రంథము 126:5-6; సామెతలు 11:18; సామెతలు 22:8; ప్రసంగి 11:6; గలతియులకు 6:7 చూడండి. ఇస్రాయేల్‌వారు దుష్టత్వం అనే విత్తనాలు చల్లుతూ వచ్చారు. శిక్ష అనే పంట కోసుకుంటారు. మంచి పనులు అనే విత్తనాలు చల్లి దేవుని ప్రేమపూర్వకమైన దీవెనలు పొందాలి. “కురిపించేవరకూ”– యెషయా 45:8. మనకు అవసరమైన వర్షం ఇదే – మనం నీతిగా న్యాయంగా ప్రవర్తించేలా చేసే దైవాశీర్వాదం. ఇలాంటి వర్షాన్ని ఆయన కురిపించేవరకు మనం ఆయన్ను వెదకాలి. “ఆయనను వెదకడానికి”– ద్వితీయోపదేశకాండము 4:29; కీర్తనల గ్రంథము 9:10; కీర్తనల గ్రంథము 22:26; కీర్తనల గ్రంథము 34:10; కీర్తనల గ్రంథము 69:32; యిర్మియా 29:13; మత్తయి 7:7-8. కఠిన హృదయాలను బ్రద్దలు చేసి న్యాయం అనే విత్తనాలు చల్లే ఏకైక మార్గం ఇదే. ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యం జరగాలన్నా మనకు దేవుని శక్తి, జ్ఞానం అవసరం. “బీడు భూమి”– యిర్మియా 4:3. అంటే వారి హృదయాలు అనే కఠినమైన నేల.

13. నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధము నకు ఫలము పొందియున్నారు.

ఇస్రాయేల్‌వారు సరి కాని విత్తనాలు చల్లుతూ వచ్చారు. అది గొప్ప కష్టానికి దారి తీసింది. “వంచన”– వ 2; హోషేయ 4:2; హోషేయ 7:13. “వీరులమీద”– దేవుణ్ణి వెదకకుండా ఆత్మ నిబ్బరంతో ఉన్నారు.

14. నీ జనుల మీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసి నట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లలమీద తల్లులు నేలను పడవేయబడుదురు.

బేత్ అర్బేల్ పై షల్మాను చేసిన దాడి గురించి మనకేమీ తెలియదు. ఈ పేర్లు బైబిల్లో ఇక్కడొక్క చోటనే కన్పిస్తాయి.

15. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలనుబట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రా యేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.

“బేతేల్”– దూడ విగ్రహాల్లో ఒకటి (వ 5) ఉన్న ఊరు (1 రాజులు 12:28-29). ఇది విగ్రహ పూజ కేంద్రం అయింది. ఆ పాపానికి తగిన శిక్ష దీనికి తప్పక వస్తుంది.Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |