Leviticus - లేవీయకాండము 14 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. And the Lord spak to Moises, and seide, This is the custom of a leprouse man,

2. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.
మత్తయి 8:4, లూకా 17:14, మార్కు 1:44, లూకా 5:14

2. whanne he schal be clensid. He schal be brouyt to the preest,

3. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల

3. which preest schal go out of the castels, and whanne he schal fynde that the lepre is clensid,

4. యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
హెబ్రీయులకు 9:19, మత్తయి 8:4

4. he schal comaunde to the man which is clensid, that he offre for hym silf twei quyke sparewis, whiche it is leueful to ete, and a `tree of cedre, and vermylyoun, and isope.

5. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి

5. And the preest schal comaunde that oon of the sparewes be offrid in `a vessel of erthe,

6. సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి

6. on quyke watris; sotheli he schal dippe the tother sparewe quyk with the `tre of cedre, and with a reed threed and ysope, in the blood of the sparewe offrid,

7. కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను.

7. with which he schal sprenge seuensithis hym that schal be clensid, that he be purgid riytfuli; and he schal delyuere the quyk sparewe, that it fle in to the feeld.

8. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.

8. And whanne the man hath waische hise clothis, he schal schaue alle the heeris of the bodi, and he schal be waischun in watir, and he schal be clensid, and he schal entre in to the castels; so oneli that he dwelle without his tabernacle bi seuene daies;

9. ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.

9. and that in the seuenthe dai he schaue the heeris of the heed, and the beerd, and brewis, and the heeris of al the bodi. And whanne the clothis and bodi ben waischun,

10. ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.

10. eft in the eiyetithe dai he schal take twei lambren without wem, and a scheep of o yeer without wem, and thre dymes of wheete flour, in to sacrifice, which be spreynte with oile, and bi it silf a sextarie of oyle.

11. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

11. And whanne the preest, that purgith the man, hath set hym and alle hise thingis bifor the Lord, in the dore of the tabernacle of witnessyng, he schal take a lomb,

12. అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింప వలెను.

12. and schal offre it for trespas, and schal offre the sextarie of oyle; and whanne alle thingis ben offrid bifor the Lord,

13. అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.

13. he schal offre the lomb, where the sacrifice for synne and the brent sacrifice is wont to be offrid, that is, in the hooli place; for as for synne so and for trespas the offryng perteyneth to the preest; it is hooli of the noumbre of hooli thingis.

14. అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.

14. And the preest schal take of the blood of sacrifice which is offrid for trespas, and schal putte on the laste part of the riyt eere `of hym which is clensid, and on the thumbis of the riyt hond and foot.

15. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.

15. And he schal putte of the sextarie of oyle in to his left hond,

16. అప్పుడు యాజ కుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.

16. and he schal dippe the riyt fyngur therynne, and schal sprynge seuensithis bifor the Lord.

17. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.

17. Sotheli he schal schede that that is residue of the oile in the left hond, on the laste part of the riyt eere `of hym which is clensid, and on the thombis of the riyt hond and foot, and on the blood which is sched for trespas,

18. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

18. and on the heed `of hym.

19. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను.

19. And the preest schal preye for hym bifor the Lord, and schal make sacrifice for synne; thanne he schal offre brent sacrifice,

20. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును.

20. and schal putte it in the auter with hise fletynge sacrifices, and the man schal be clensid riytfuli.

21. వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను

21. That if he is pore, and his hoond may not fynde tho thingis that ben seid, he schal take for trespas a lomb to offryng, that the preest preie for him, and the tenthe part of wheete flour spreynt togidire with oile in to sacrifice, and a sextarie of oile,

22. వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.

22. and twei turtlis, ethir twei `briddis of culueris, of whiche oon be for synne, and the tothir in to brent sacrifice;

23. వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.

23. and he schal offre tho in the eiytthe dai of his clensyng to the preest, at the dore of tabernacle of witnessyng bifor the Lord.

24. యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

24. And the preest schal take the lomb for trespas, and the sextarie of oile, and schal reise togidere;

25. అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.

25. and whanne the lomb is offrid, he schal putte of the blood therof on the laste part of the riyt eere `of hym that is clensid, and on the thumbis of his riyt hond and foot.

26. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని

26. Sotheli the preest putte the part of oile in to his left hond,

27. తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.

27. in which he schal dippe the fyngur of the riyt hond, and schal sprynge seuensithes ayens the Lord;

28. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.

28. and the preest schal touche the laste part of the riyt eere `of hym that is clensid, and the thombe of the riyt hond and foot, in the place of blood which is sched out for trespas.

29. యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.

29. Sotheli he schal putte the tother part of oile, which is in the left hond, on the `heed of the man clensid, that he plese the Lord for hym.

30. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.

30. And he schal offre a turtle, ethir a culuer brid,

31. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.

31. oon for trespas, and the tothir in to brent sacrifice, with her fletynge offryngis.

32. కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధియిదే.

32. This is the sacrifice of a leprouse man, that may not haue alle thingis in to the clensyng of hym silf.

33. మరియయెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

33. And the Lord spak to Moises and Aaron, and seide,

34. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల

34. Whanne ye han entrid in to the lond of Canaan, which lond Y schal yyue to you in to possessioun, if the wounde of lepre is in the housis,

35. ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.

35. he schal go, whos the hous is, `and schal telle to the preest, and schal seie, It semeth to me, that as a wound of lepre is in myn hous.

36. అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.

36. And the preest schal comaunde, `that thei bere out of the hous alle thingis bifore that he entre in to it, `and me se where it be lepre, lest alle thingis that ben in the hows, be maad vnclene; and the preest schal entre aftirward, that he se the lepre of the hows.

37. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల

37. And whanne he seeth in the wallis therof as litle valeis `foule bi palenesse, ethir bi reednesse, and lowere than the tother hiyere part,

38. యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.

38. he schal go out at the dore of the hows, and anoon he schal close it bi seuene daies.

39. ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల

39. And he schal turne ayen in the seuenthe day, and schal se it; if he fyndith that the lepre encreesside,

40. యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.

40. he schal comaunde that the stoonys be cast out, in whyche the lepre is, and that tho stonys be cast out of the citee in an vncleene place.

41. అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి

41. Sotheli he schal comaunde that thilke hows be rasid with ynne bi cumpas, and that the dust of the rasyng be spreynt without the citee, in an vnclene place,

42. వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.

42. and that othere stoonys be put ayen for these, that ben takun awey, and that the hows be daubid with othir morter.

43. అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.

43. But if aftir that the stoonus ben takun awey, and the dust is borun out,

44. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.

44. and othere erthe is daubid, the preest entrith, and seeth the lepre turned ayen, and the wallis spreynt with spottis, the lepre is stidfastly dwellynge, and the hows is vnclene;

45. కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.

45. which hows thei schulen destrye anoon, and thei schulen caste out of the citee, in an vnclene place, the stoonys therof, and the trees, and al the dust.

46. మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

46. He that entrith in to the hous, whanne it is schit, schal be vnclene `til to euentid,

47. ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.

47. and he that slepith and etith ony thing therynne, schal waische hise clothis.

48. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.

48. That if the preest entrith, and seeth that the lepre encreesside not in the hows, aftir that it was daubid the secounde tyme, he schal clense it; for heelthe is yoldun.

49. ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని

49. And in the clensyng therof he schal take twey sparewis, and `a tre of cedre, and `a reed threed, and isope.

50. పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి

50. And whanne o sparewe is offrid in a vessel of erthe, on quyk watris,

51. ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.

51. he schal take the `tre of cedre, and ysope, and reed threed, and the quyk sparewe, and he schal dippe alle thingis in the blood of the sparewe offrid, and in lyuynge watris;

52. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.

52. and he schal sprynge the hows seuen sithis; and he schal clense it as wel in the blood of the sparewe as in lyuynge watris, and in the quyk sparewe, and in the `tre of cedre, and in ysope, and `reed threed.

53. అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.

53. And whanne he hath left the sparewe to fle in to the feeld frely, he schal preye for the hows, and it schal be clensid riytfuli.

54. ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు

54. This is the lawe of al lepre,

55. వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,

55. and of smytyng, of lepre of clothis, and of housis,

56. వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,

56. of syngne of wounde, and of litle whelkis brekynge out, of spotte schynynge, and in colours chaungid in to dyuerse spices,

57. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

57. that it may be wist, what is cleene, ether uncleene.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కుష్ఠురోగిని పరిశుభ్రంగా ప్రకటించడం. (1-9) 
చాలా కాలం క్రితం, కుష్టు వ్యాధి అనే వ్యాధి ఉంది, ఇది ప్రజలను అనారోగ్యానికి గురిచేసింది మరియు వారు ఇతరుల చుట్టూ ఉండకూడదు. పూజారులు కూడా వారిని బాగు చేయలేరు, కానీ ప్రభువు వారికి సహాయం చేసినప్పుడు, వారు మళ్లీ ఇతరులతో ఉండడానికి ముందు వారు అనుసరించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తప్పు చేసిన మరియు విషయాలను సరిదిద్దాలనుకునే వ్యక్తులతో మనం ఎలా వ్యవహరించాలో ఇది మనకు బోధిస్తుంది. కుష్టురోగులకు పూజారులు ఎలా సహాయం చేశారో మనం వారికి సహాయం చేయాలి మరియు ఎలా మెరుగ్గా ఉండాలో వారికి గుర్తు చేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, వారు పశ్చాత్తాపపడి దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. వారు నిజంగా చెడుగా భావిస్తే మరియు మారాలని కోరుకుంటే, వారిని క్షమించాలి మరియు దయ మరియు ఆనందంతో తిరిగి స్వాగతించాలి. చెడు ప్రవర్తనను ప్రోత్సహించకుండా జాగ్రత్తపడాలి, మంచిగా చేయాలనుకునే వ్యక్తులను నిరుత్సాహపరచకూడదు. బైబిల్లో, ఒక జబ్బుపడిన వ్యక్తి స్వస్థత పొందినట్లు ప్రకటించబడిన ఒక వేడుక గురించి మాట్లాడుతుంది. ఇది మన పాపాల కోసం చనిపోయి, పరలోకానికి లేచిన యేసును గుర్తు చేస్తుంది. మనం క్షమించబడినప్పుడు, మనం దేవునికి సన్నిహితంగా ఉండేందుకు చెడు విషయాలకు దూరంగా ఉండేందుకు కష్టపడి పనిచేయాలి. 

అతడు అర్పించవలసిన బలులు. (10-32)
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బాగుపడి చర్చికి తిరిగి వెళ్ళగలిగినప్పుడు, వారు అర్పణలు ఇవ్వడం ద్వారా మరియు కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు యేసు వంటి పూజారి వద్దకు వెళ్లి, వారు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో చూపించడానికి ప్రత్యేకంగా ఏదైనా అందించాలి. యాజకుడు వాటిని మరల శుద్ధి చేయడానికి కొంచెం నూనెను రక్తాన్ని పూస్తాడు. మనము యేసును విశ్వసించినప్పుడు, రెండు ముఖ్యమైన విషయాలు జరుగుతాయి - మన పాపాలు క్షమించబడతాయి (సమర్థన) మరియు పరిశుద్ధాత్మ మనం మరింతగా యేసు (పవిత్రీకరణ) వలె మారడానికి సహాయం చేస్తుంది. ఎవరైనా చర్మవ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఒక ప్రత్యేక వేడుకను అనుసరించడం ద్వారా వారిని మళ్లీ శుభ్రపరచవచ్చు. ఎవరైనా ధనవంతుడు లేదా పేదవాడా అనేది పట్టింపు లేదు, యేసు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు మరియు రక్షణ యొక్క అదే బహుమతిని అందిస్తాడు. అందరికీ ఒక గొర్రెపిల్ల ఎలా అవసరమో, మన పాపాల కోసం శిలువపై చనిపోయి మనలను రక్షించేది యేసు ఒక్కడే. 

ఒక ఇంట్లో కుష్టు వ్యాధి. (33-53) 
కుష్టువ్యాధి అనే అనారోగ్యం ఇంట్లో లేదా బట్టలపై వ్యాపించినట్లే, పాపం అనే చెడు ప్రవర్తన కుటుంబంలో వ్యాపించి సమస్యలను కలిగిస్తుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మరియు చెడు ప్రవర్తనను చూసిన వెంటనే వాటిని ఆపాలి. చెడు ప్రవర్తనను ఆపకపోతే, అది మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చెడ్డ ఇంటిలో ఉండడం కంటే దానిని వదిలివేయడం మంచిది. పాపం మన శరీరాలతో చాలా అనుసంధానించబడి ఉంది, అది మరణం ద్వారా మాత్రమే తొలగించబడుతుంది. 

కుష్టు వ్యాధికి సంబంధించిన చట్టం యొక్క సారాంశం. (54-57)
మనల్ని అమితంగా ప్రేమించే దేవుడు, మనం బాగా లేకపోయినా, తన దయ వల్ల మమ్మల్ని తిరిగి బ్రతికించాడు. ఎఫెసీయులకు 2:4-5 మనం చేసిన తప్పులకు క్షమించండి మరియు వాటిని మళ్లీ చేయకుండా ఉండటం ద్వారా మనం విషయాలను మెరుగుపరుస్తాము. కష్టకాలంలో ఉన్న ఇతరులతో మనం మంచిగా మరియు దయగా ఉండటానికి ప్రయత్నించాలి మరియు మనకు మరియు వారికి సహాయం చేయడానికి ఉన్నత శక్తి నుండి సహాయం కోసం అడగాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |