Leviticus - లేవీయకాండము 17 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

1. The Lord said to Moses,

2. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

2. Speak to Aaron and to his sons, and to all the Israelites. Tell them this is what the Lord has commanded:

3. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని

3. Any one of you Israelites might kill a bull, a lamb, or a goat. You might be in the camp or outside the camp.

4. ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును;

4. It doesn't matter; you must bring that animal to the entrance of the Meeting Tent. You must give a part of that animal as a gift to the Lord. You spilled blood, so you must take a gift to the Lord's Holy Tent. If you don't take part of the animal as a gift to the Lord, you must be separated from your people!

5. వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టి వేయబడవలెను.

5. This rule is so that you will bring your fellowship offering to the Lord. You must bring any animal that you kill in the field to the Lord at the entrance of the Meeting Tent. Bring those animals to the priest.

6. యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.

6. Then the priest will throw their blood onto the Lord's altar near the entrance of the Meeting Tent. And the priest will burn the fat from those animals on the altar as a sweet-smelling gift to the Lord.

7. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.

7. In this way you will stop being unfaithful to me by offering sacrifices to your 'goat gods.' This law will continue forever.

8. మరియు నీవు వారితో ఇట్లనుము ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను

8. Tell the people: Any citizen of Israel, traveler, or foreigner living among you might want to offer a burnt offering or some other sacrifice.

9. యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.

9. They must take the sacrifice to the entrance of the Meeting Tent and offer it to the Lord. Whoever does not do this will be separated from their people.

10. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును.
అపో. కార్యములు 15:20-29

10. I will turn against those who eat blood. Whether they are citizens of Israel or foreigners living among you, I will separate them from their people.

11. రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
హెబ్రీయులకు 9:22

11. This is because the life of the body is in the blood. I have told you that you must pour the blood on the altar to purify yourselves. Blood is what makes a person pure.

12. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

12. That is why I am telling you Israelites and the foreigners living among you that you must not eat blood.

13. మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;

13. 'If any of you, whether Israelite or foreigner living among you, goes hunting and kills a wild animal or bird that you are allowed to eat, you must pour the blood of that animal on the ground and cover it with dirt.

14. దానిరక్తము దాని ప్రాణమునకాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

14. This is because the life of every kind of animal is in its blood. So I give this command to the Israelites: Don't eat meat that still has blood in it! Whoever eats blood must be separated from their people.

15. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.

15. 'If any of you, whether Israelite or foreigner living among you, eats an animal that died by itself or was killed by some other animal, you will be unclean until evening. You must wash your clothes and bathe your whole body with water.

16. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.

16. If you don't wash your clothes and bathe your whole body, you will be responsible for your guilt.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
గుడారం వద్ద అన్ని బలులు అర్పించాలి. (1-9) 
ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు, వారు చంపిన పశువులను గుడారానికి తీసుకురావాలి. అప్పుడు వారు దేవునికి ప్రత్యేక నైవేద్యంగా మాంసాన్ని తినవచ్చు. కానీ వారు కనానుకు చేరుకున్న తర్వాత, వారు త్యాగం కోసం మాత్రమే దీన్ని చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో, మనం గుడారం లేదా దేవాలయం వంటి నిర్దిష్ట ప్రదేశానికి నైవేద్యాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. బదులుగా, మన హృదయాల నుండి మన ఆధ్యాత్మిక బహుమతులను అందించవచ్చు మరియు సువార్తలో మనం పంచుకునే ఐక్యత ఒక నిర్దిష్ట స్థలం లేదా భవనంపై ఆధారపడి ఉండదు. క్రీస్తు మనము దేవునితో మాట్లాడగల మరియు అతనికి ఇవ్వదలిచిన వస్తువులను అందించే ఒక ప్రత్యేక స్థలం వంటివాడు. మనం ఇతరుల ద్వారా దేవునితో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు లేదా దేవునికి వస్తువులను సమర్పించడానికి ఇతర ప్రత్యేక స్థలాలను ఉపయోగించకూడదు. మనం ఇంట్లో ఆయనకు సమర్పించే వస్తువులతో దేవుడు ఇంకా సంతోషిస్తున్నప్పటికీ, ఆయనకు సన్నిహితంగా ఉండటానికి మనం ఇంకా ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్లాలి. 

రక్తం తినడం లేదా సహజ మరణంతో మరణించిన జంతువులు తినడం నిషేధించబడింది. (10-16)
చాలా కాలం క్రితం, ప్రజలు రక్తం తినకూడదని ఒక నియమం ఉంది. ఇది మతపరమైన కారణాల కోసం ప్రత్యేక నియమం, కానీ ఇప్పుడు అది వర్తించదు. తప్పులను సరిదిద్దడానికి జంతువుల రక్తం చాలా ముఖ్యమైనది, కానీ ఇప్పుడు మేము యేసు రక్తం మాత్రమే చేయగలదని నమ్ముతున్నాము. కాబట్టి ఇప్పుడు ఆహారం కోసం జంతువుల రక్తాన్ని తినడం ఫర్వాలేదు, కానీ యేసు రక్తం నిజంగా ముఖ్యమైనది మరియు ప్రత్యేకమైనది అని మనం ఇంకా గుర్తుంచుకోవాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |