Leviticus - లేవీయకాండము 21 | View All

1. మరియయెహోవా మోషేతో ఇట్లనెను.

చావు పాపంవల్ల కలిగే ఫలితం. చచ్చినదాన్ని తాకడం కూడా అశుద్ధతను కలిగిస్తున్నదని వారు అనుకోవాలి (ఆదికాండము 2:17 రోమీయులకు 6:16 రోమీయులకు 6:21 రోమీయులకు 6:23 లేవీయకాండము 11:40 సంఖ్యాకాండము 19:14 యెహోషువ 44:25). కాబట్టి చావు అనేది మానవ భ్రష్ట స్థితినీ చెడిపోయిన వ్యక్తిత్వాన్నీ తెలియజేస్తుంది. అందుకని పతనమైపోయిన ఈ ప్రపంచం నీడపడి తాము కూడా చెడిపోకుండేలా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి (2 కోరింథీయులకు 6:14-18 గలతియులకు 1:14 గలతియులకు 6:14 కొలొస్సయులకు 3:2 కొలొస్సయులకు 3:5 తీతుకు 2:14 1 యోహాను 2:15-16 1 యోహాను 5:19). రాబోయే రెండు అధ్యాయాల్లో యాజులకు సంబంధించిన కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యాజులు కొత్త ఒడంబడిక కాలంలోని విశ్వాసులందరికీ సూచనగా ఉన్నారు (నిర్గమకాండము 28:1 నోట్‌). యాజులు ఏ కల్మషమూ లేనివారుగా తమను తాము పవిత్రులుగా ఉంచుకోవాలి. ఇప్పటి విశ్వాసులలో కనిపించిన ఆధ్యాత్మిక విషయాలకు ఈ నియమాలు దృష్టాంతాలుగా ఉన్నాయి.

2. యాజ కులగు అహరోను కుమారులతో ఇట్లనుముమీలో ఎవ డును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,

3. తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.

4. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు.

5. వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.

ద్వితీయోపదేశకాండము 14:1 యెహెఙ్కేలు 44:20. ఆ కాలంలో ఆ చుట్టుప్రక్కల ప్రజల్లో ఇలాంటి ఆచారాలు ఉండేవి కాబోలు.

6. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.

7. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

8. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.

పవిత్రత అనే మాట బైబిలంతటిలోకీ గొప్ప ప్రాముఖ్యత గల పదాలలో ఒకటి.

9. మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.
ప్రకటన గ్రంథం 17:16, ప్రకటన గ్రంథం 18:8

10. ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;

ప్రముఖ యాజి మన అందరి ప్రముఖ యాజి అయిన క్రీస్తుకు గుర్తు. మామూలు యాజులకంటే ప్రముఖ యాజి బాధ్యతలు మరెక్కువగా ఉన్నాయి. అతడు చేయవలసిన పని మహత్తరమైనది. మనుషులతో ఎలాంటి సంబంధమూ అతనికి అడ్డు రాకూడదు (మత్తయి 10:37 మత్తయి 12:46-50 మత్తయి 16:21-23 పోల్చి చూడండి).

11. అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననే గాని తన తల్లి శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.

12. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను

13. అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.

14. విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను.

15. యెహోవా అను నేను అతని పరి శుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

16. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

యాజులు శరీర సంబంధమైన లోపాలు లేకపోవడం అనే విషయం క్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన పవిత్రమైన మానవ స్వభావాన్ని సూచిస్తుంది. ఇలాంటి స్వభావం తన ప్రజలందరిలో కనబడాలని దేవుని కోరిక (మత్తయి 5:48 2 కోరింథీయులకు 7:1 2 కోరింథీయులకు 13:11 ఎఫెసీయులకు 4:13 కొలొస్సయులకు 1:28 కొలొస్సయులకు 4:12 యాకోబు 1:4). 18-20 వచనాల్లో కనిపించే శారీరక లోపాలు మనిషిని దేవుని సేవకు అయోగ్యుణ్ణిగా చేసే ఆత్మ సంబంధమైన లోపాలకు సూచనలుగా ఉన్నాయి. శరీరసంబంధమైన ఈ అంగవైకల్యాలవల్ల ఆధ్యాత్మిక జీవితానికి ఎలాంటి లోపమూ కలగదని చెప్పనక్కరలేదు. ఆ మాటకొస్తే అంగ వైకల్యం ఉన్న కొందరు వ్యక్తులు దేవునికి నమ్మకమైన సేవకులుగా ప్రసిద్ధికెక్కారు.

17. నీవు అహరోనుతో ఇట్లనుమునీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.

18. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని

19. కాలైనను చేయినైనను విరిగినవాడే గాని

20. గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.

21. యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.

22. అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.

23. మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;

24. నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |