Leviticus - లేవీయకాండము 25 | View All

1. మరియయెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. The LORD spoke to Moses at Mount Sinai:

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుమునేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.

2. 'Speak to the Israelites and tell them, 'When you enter the land that I am giving you, the land must observe a Sabbath to the LORD.

3. ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.

3. Six years you may sow your field, and six years you may prune your vineyard and gather the produce,

4. ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.

4. but in the seventh year the land must have a Sabbath of complete rest a Sabbath to the LORD. You must not sow your field or prune your vineyard.

5. నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.

5. You must not gather in the aftergrowth of your harvest and you must not pick the grapes of your unpruned vines; the land must have a year of complete rest.

6. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.

6. You may have the Sabbath produce of the land to eat you, your male servant, your female servant, your hired worker, the resident foreigner who stays with you,

7. మరియు నీ పశువుల కును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.

7. your cattle, and the wild animals that are in your land all its produce will be for you to eat.

8. మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.

8. ''You must count off seven weeks of years, seven times seven years, and the days of the seven weeks of years will amount to forty-nine years.

9. ఏడవ నెల పది యౌవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.

9. You must sound loud horn blasts in the seventh month, on the tenth day of the month, on the Day of Atonement you must sound the horn in your entire land.

10. మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

10. So you must consecrate the fiftieth year, and you must proclaim a release in the land for all its inhabitants. That year will be your jubilee; each one of you must return to his property and each one of you must return to his clan.

11. ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.

11. That fiftieth year will be your jubilee; you must not sow the land, harvest its aftergrowth, or pick the grapes of its unpruned vines.

12. అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.

12. Because that year is a jubilee, it will be holy to you you may eat its produce from the field.

13. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.

13. ''In this year of jubilee you must each return to your property.

14. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.

14. If you make a sale to your fellow citizen or buy from your fellow citizen, no one is to wrong his brother.

15. సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.

15. You may buy it from your fellow citizen according to the number of years since the last jubilee; he may sell it to you according to the years of produce that are left.

16. ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.

16. The more years there are, the more you may make its purchase price, and the fewer years there are, the less you must make its purchase price, because he is only selling to you a number of years of produce.

17. మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

17. No one is to oppress his fellow citizen, but you must fear your God, because I am the LORD your God.

18. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.

18. You must obey my statutes and my regulations; you must be sure to keep them so that you may live securely in the land.

19. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.

19. 'The land will give its fruit and you may eat until you are satisfied, and you may live securely in the land.

20. ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.

20. If you say, 'What will we eat in the seventh year if we do not sow and gather our produce?'

21. అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.

21. I will command my blessing for you in the sixth year so that it may yield the produce for three years,

22. మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు.

22. and you may sow the eighth year and eat from that sixth year's produce old produce. Until you bring in the ninth year's produce, you may eat old produce.

23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.

23. The land must not be sold without reclaim because the land belongs to me, for you are foreigners and residents with me.

24. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను.

24. In all your landed property you must provide for the right of redemption of the land.

25. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.

25. ''If your brother becomes impoverished and sells some of his property, his near redeemer is to come to you and redeem what his brother sold.

26. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన యెడల

26. If a man has no redeemer, but he prospers and gains enough for its redemption,

27. దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.

27. he is to calculate the value of the years it was sold, refund the balance to the man to whom he had sold it, and return to his property.

28. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.

28. If he has not prospered enough to refund a balance to him, then what he sold will belong to the one who bought it until the jubilee year, but it must revert in the jubilee and the original owner may return to his property.

29. ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.

29. ''If a man sells a residential house in a walled city, its right of redemption must extend until one full year from its sale; its right of redemption must extend to a full calendar year.

30. అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.

30. If it is not redeemed before the full calendar year is ended, the house in the walled city will belong without reclaim to the one who bought it throughout his generations; it will not revert in the jubilee.

31. చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును.

31. The houses of villages, however, which have no wall surrounding them must be considered as the field of the land; they will have the right of redemption and must revert in the jubilee.

32. అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.

32. As for the cities of the Levites, the houses in the cities which they possess, the Levites must have a perpetual right of redemption.

33. లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపాదించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.

33. Whatever someone among the Levites might redeem the sale of a house which is his property in a city must revert in the jubilee, because the houses of the cities of the Levites are their property in the midst of the Israelites.

34. వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

34. Moreover, the open field areas of their cities must not be sold, because that is their perpetual possession.

35. పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.
లూకా 6:35

35. ''If your brother becomes impoverished and is indebted to you, you must support him; he must live with you like a foreign resident.

36. నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
లూకా 6:35

36. Do not take interest or profit from him, but you must fear your God and your brother must live with you.

37. నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.

37. You must not lend him your money at interest and you must not sell him food for profit.

38. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

38. I am the LORD your God who brought you out from the land of Egypt to give you the land of Canaan to be your God.

39. నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.

39. ''If your brother becomes impoverished with regard to you so that he sells himself to you, you must not subject him to slave service.

40. వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.

40. He must be with you as a hired worker, as a resident foreigner; he must serve with you until the year of jubilee,

41. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.

41. but then he may go free, he and his children with him, and may return to his family and to the property of his ancestors.

42. ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;

42. Since they are my servants whom I brought out from the land of Egypt, they must not be sold in a slave sale.

43. నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.
కొలొస్సయులకు 4:1

43. You must not rule over him harshly, but you must fear your God.

44. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.

44. ''As for your male and female slaves who may belong to you you may buy male and female slaves from the nations all around you.

45. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.

45. Also you may buy slaves from the children of the foreigners who reside with you, and from their families that are with you, whom they have fathered in your land, they may become your property.

46. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.

46. You may give them as inheritance to your children after you to possess as property. You may enslave them perpetually. However, as for your brothers the Israelites, no man may rule over his brother harshly.

47. పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన యెడల

47. ''If a resident foreigner who is with you prospers and your brother becomes impoverished with regard to him so that he sells himself to a resident foreigner who is with you or to a member of a foreigner's family,

48. తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడి పింపవచ్చును.

48. after he has sold himself he retains a right of redemption. One of his brothers may redeem him,

49. వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.

49. or his uncle or his cousin may redeem him, or anyone of the rest of his blood relatives his family may redeem him, or if he prospers he may redeem himself.

50. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.

50. He must calculate with the one who bought him the number of years from the year he sold himself to him until the jubilee year, and the cost of his sale must correspond to the number of years, according to the rate of wages a hired worker would have earned while with him.

51. ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.

51. If there are still many years, in keeping with them he must refund most of the cost of his purchase for his redemption,

52. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.

52. but if only a few years remain until the jubilee, he must calculate for himself in keeping with the remaining years and refund it for his redemption.

53. ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.
కొలొస్సయులకు 4:1

53. He must be with the one who bought him like a yearly hired worker. The one who bought him must not rule over him harshly in your sight.

54. అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.

54. If, however, he is not redeemed in these ways, he must go free in the jubilee year, he and his children with him,

55. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.

55. because the Israelites are my own servants; they are my servants whom I brought out from the land of Egypt. I am the LORD your God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఏడవ సంవత్సరంలో భూమికి విశ్రాంతి యొక్క విశ్రాంతిదినం. (1-7) 
వారంలో ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నట్లే, ప్రతి ఏడవ సంవత్సరానికి పని మానేయాలనే నియమం ఉండేది. అత్యాశతో ఉండకూడదని మరియు చాలా వస్తువులను కలిగి ఉండటమే మనకు సంతోషాన్ని కలిగిస్తుందని భావించాలని ఇది గుర్తు చేసింది. మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు మన వస్తువులను తెలివిగా ఉపయోగించుకోవడానికి దేవునిపై నమ్మకం ఉంచాలి. ఈ విశ్రాంతి సంవత్సరం కూడా మనం యేసును విశ్వసించినప్పుడు మనకు లభించే విరామం లాంటిది, ఇక్కడ మనం ప్రపంచంలోని ఒత్తిళ్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు మరియు మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవునిపై విశ్వాసం ఉంచవచ్చు. 

యాభైవ సంవత్సరం జూబ్లీ, అణచివేత నిషేధించబడింది. (8-22) 
"జూబ్లీ" అనే పదానికి వెండి బాకాలు చేసే సంతోషకరమైన ధ్వని అని అర్థం. యేసు చేసిన త్యాగం వల్ల ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని ప్రకటించడానికి ఈ ధ్వని ఒక ప్రత్యేక రోజున చేయబడింది. గతంలో ప్రజలు తమ భూములను శాశ్వతంగా అమ్ముకునే అవకాశం ఉండేది కాదు. వారు దానిని జూబ్లీ సంవత్సరం అని పిలిచే ప్రత్యేక సంవత్సరం వరకు మాత్రమే అద్దెకు ఇవ్వగలరు, ఆ భూమి అసలు యజమానికి లేదా వారి కుటుంబానికి తిరిగి వెళ్లే వరకు. ఇది యేసు వచ్చే వరకు కుటుంబాలు మరియు తెగలను కలిసి ఉంచడానికి సహాయపడింది. పాపానికి బానిసలుగా ఉండకుండా యేసు మనల్ని ఎలా రక్షించి, దేవుని పిల్లలవలె స్వేచ్ఛగా తిరిగి వస్తాడు అనేదానికి జూబ్లీ సంవత్సరం చిహ్నం లాంటిది. మనం ఇతరులతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి మరియు వారి నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించకూడదు. మనం కూడా దేవుణ్ణి గౌరవించాలి మరియు మన పొరుగువారిని బాధపెట్టే ఏదీ చేయకూడదు. మనం ఇలా చేస్తే, మనకు ప్రతిఫలం లభిస్తుంది మరియు మంచి విషయాలు మనకు వస్తాయి. ఇది బైబిల్‌లోని ఒక కథ నుండి మనం నేర్చుకోగల పాఠం, ప్రజలు ఒక సంవత్సరం పాటు పంటలు వేయలేదు, కానీ వారు దేవునిపై నమ్మకం ఉంచినందున తినడానికి తగినంతగా ఉన్నారు. కొన్నిసార్లు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని మనం ఆందోళన చెందుతాము, కానీ ఆ భయాలు సరైనది చేయకుండా మనల్ని ఆపకూడదు. మనం వింతగా ప్రవర్తిస్తున్నామని ఇతరులు భావించినప్పటికీ, సురక్షితంగా ఉండటానికి మంచి మార్గం అనుసరించడం ఉత్తమ మార్గం. 

భూమి మరియు గృహాల విముక్తి. (23-34) 
ఎవరైనా తమ భూమిని విక్రయించినా లేదా రుణం ఇచ్చినా మరియు నిర్దిష్ట సంవత్సరానికి ముందు దానిని తిరిగి కొనుగోలు చేయకపోతే, అది అసలు యజమానికి తిరిగి వెళ్లిపోతుంది. మనకు అర్హత లేకపోయినా దేవుడు మనల్ని క్షమించి, కృపను ఎలా ఇస్తాడో ఇది చూపిస్తుంది. నగరాల్లో ఇళ్లను విక్రయించిన వ్యక్తులు ఏడాదిలోపు వాటిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. దీంతో కొత్త వ్యక్తులు నగరానికి వచ్చి నివసించడం సులువైంది. 

పేదల పట్ల కరుణ. (35-38) 
నిరుపేదగా ఉండటం మరియు తక్కువ పరిస్థితుల్లో జీవించడం చాలా పెద్ద సమస్య. వారిపట్ల జాలిపడి, వారికి చేయూతనిస్తూ, వీలైతే వారికి కావలసినవి అందించి వారికి సహాయం చేయాలి. పేదలమైనందున మనకు డబ్బు చెల్లించాల్సిన వ్యక్తులతో మనం చెడుగా ప్రవర్తించకూడదు. మనం న్యాయంగా మరియు దయగా ఉండాలి ఎందుకంటే ఇది సరైన పని. పేదల పట్ల మనం మంచిగా వ్యవహరిస్తే, వారు భవిష్యత్తులో మనకు సహాయం చేయగలరు. ధనవంతులకు కూడా పేదలు అవసరం, మరియు ఒకప్పుడు ఎవరైనా మనతో దయ చూపినందున మనం ఇతరులతో దయగా ఉండాలని గుర్తుంచుకోవాలి. 

బాండ్‌మెన్‌లకు సంబంధించిన చట్టాలు, అణచివేత నిషేధించబడింది. (39-55)
ఇజ్రాయెల్ నుండి ఎవరైనా చాలా డబ్బు బాకీ ఉంటే లేదా ఏదైనా తప్పు చేస్తే, వారు ఆరు సంవత్సరాలు పని చేసి ఇంటికి వెళ్ళవచ్చు. వారు పేదవారు అయినందున వారు ఎవరికైనా పని చేయాలని ఎంచుకుంటే, వారి యజమాని వారితో న్యాయంగా మరియు వారు కుటుంబంలో భాగమైనట్లుగా వ్యవహరించాలి. బాస్ న్యాయంగా ఉండాలి మరియు వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. యోహాను 8:32 మనలాగే తప్పుడు పనులు చేసే ఇతర వ్యక్తులను మనం రక్షించలేము, కానీ మనం వారికి యేసు గురించి చెప్పగలము. యేసు సహాయం వల్ల మనం కూడా మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు మరియు ఆయన పట్ల ప్రేమ మరియు కృతజ్ఞత చూపవచ్చు. ఇది యేసును సంతోషపరుస్తుంది మరియు ప్రసిద్ధి చెందింది. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |