Leviticus - లేవీయకాండము 3 | View All

1. అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.

1. athadu arpinchunadhi samaadhaanabaliyainayedala athadu govulalonidi theesikoni vachinayedala adhi magadhegaani aadudhegaani yehovaa sannidhiki nirdoshamaina daanini theesikoniraavalenu.

2. తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

2. thaanu arpinchu daani thalameeda thana cheyyi unchi pratyakshapu gudaaramu yokka dvaaramuna daanini vadhimpavalenu. Yaaja kulagu aharonu kumaarulu balipeethamuchuttu daani rakthamunu prokshimpavalenu.

3. అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్రగ్రంధులను వాటిమీదను

3. athadu aa samaadhaana bali pashuvuyokka aantramula lopali krovvunu aantra mulameedi krovvanthatini rendu mootra grandhulanu vaatimeedanu

4. డొక్కలమీదనున్న క్రొవ్వును కాలేజముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.

4. dokkalameedanunna krovvunu kaale jamumeedanu mootragranthula meedanunna vapanu yehovaaku homamugaa arpinvalenu.

5. అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింప వలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

5. aharonu kumaarulu balipeethamumeeda, anagaa agnimeedi katte lapainunna dahanabali dravyamupaini daanini dahimpa valenu. adhi yehovaaku impaina suvaasanagala homamu.

6. యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱె మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను.

6. yehovaaku samaadhaanabaligaa okadu arpinchunadhi gorra mekalalonidainayedala adhi magadhegaani aadudhegaani nirdoshamainadaani theesikoni raavalenu.

7. అతడర్పించు అర్పణము గొఱ్ఱెపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.

7. athadarpinchu arpa namu gorrapillayaina yedala yehovaa sannidhiki daanini theesikoni raavalenu.

8. తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

8. thaanu arpinchu daani thalameeda athadu thana cheyyi unchi pratyakshapu gudaaramu neduta daanini vadhimpavalenu. Aharonu kumaarulu balipeethamu chuttu daani rakthamunu prokshimpavalenu.

9. ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

9. aa samaadhaana bali pashuvuyokka krovvunu muddipoosa modalukoni krovvina thooka anthatini aantramulaloni krovvunu aantramulameedi krovvu anthatini

10. రెండు మూత్రగ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.

10. rendu mootra granthulanu vaatimeedi dokkala painunna krovvunu mootra granthulameedi kaalejamuyokka vapanu theesi yehovaaku homamu cheyavalenu.

11. యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.

11. yaajakudu bali peethamumeeda daanini dahimpavalenu. adhi yehovaaku homaroopamaina aahaaramu.

12. అతడు అర్పించునది మేక యైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.

12. athadu arpinchunadhi meka yainayedala yehovaa sannidhiki daanini theesikoni raavalenu.

13. తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

13. thaanu daani thalameeda cheyyi unchi pratya kshapu gudaaramu neduta daanini vadhimpavalenu. Aharonu kumaarulu balipeethamuchuttu daani rakthamunu prokshimpavalenu.

14. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

14. thaanu daanilo arpinchu aantramulanu kappu krovvunu aantramulameedi krovvu anthatini

15. రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.

15. rendu mootra granthulanu vaatimeedi dokkalapainunna krovvunu rendu mootra granthulapainunna kaalejamuyokka vapanu yehovaaku homamugaa arpimpavalenu.

16. యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.

16. yaajakudu balipeethamumeeda vaatini dahimpa valenu. Krovvanthayu yehovaadhe; adhi suvaasanagala homa roopamaina aahaaramu. meeru krovvunainanu rakthamunainanu thinakoodadu.

17. అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
అపో. కార్యములు 15:20-29

17. adhi mee tharatharamulaku mee nivaasasthalamulannitilonu nityamaina kattada.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మంద శాంతి సమర్పణ. (1-5) 
శాంతి సమర్పణలు ప్రజలు తమ జీవితాలలో మంచి విషయాల కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం. వారు తమ అర్పణలను బలిపీఠంతో, పూజారితో మరియు దేవునితో తమ స్నేహాన్ని జరుపుకునే మార్గంగా పంచుకుంటారు. వారు ఏదైనా విషయంలో దేవుని సహాయం అవసరమైనప్పుడు కూడా ఈ అర్పణను ఉపయోగించుకుంటారు. ఈరోజు, క్రీస్తును మన శాంతిగా స్మరించుకుంటాము, మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం చేస్తాడు మరియు మన హృదయాలలో శాంతిని ఇస్తాడు. జంతుబలులు ఇవ్వడం కంటే ముఖ్యమైనది అయిన ఆయనను స్తుతించడం ద్వారా కూడా మనం దేవునికి మన కృతజ్ఞతా భావాన్ని చూపవచ్చు.

మంద యొక్క శాంతి సమర్పణ. (6-17)
శాంతి సమర్పణలు దేవుడు వారికి ఇచ్చిన అన్ని మంచి వస్తువులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక మార్గం. వారు తమ ఆహారాన్ని దేవునితో మరియు ఆయన పూజారులతో పంచుకున్నారు. ప్రజలు దేవుని నుండి ఏదైనా కోరుకున్నప్పుడు, వారు అతని సహాయం కోసం అడగడానికి శాంతి నైవేద్యాన్ని కూడా అర్పిస్తారు. యేసు మన అంతిమ శాంతి సమర్పణ, మరియు ఆయన ద్వారా, మన ప్రార్థనలలో మనం కోరినది పొందవచ్చు. దేవుడు తమకు చేసిన మంచి పనులకు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు శాంతి అర్పణలు కూడా ఇచ్చారు. మనం ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాల కోసం కృతజ్ఞతలు తెలుపుతూ, మన ప్రేమను ఆయనకు అందించాలి, ఇది మనం ఇవ్వగలిగే జంతువులు లేదా బహుమతుల కంటే చాలా ముఖ్యమైనది. హెబ్రీయులకు 10:29 మన తప్పులను సరిచేసుకోవడానికి తనను తాను త్యాగం చేసి యేసు చేసిన మంచి పనికి మనం క్రెడిట్ తీసుకోవాలని దేవుడు కోరుకోడు. ఈ ఆలోచన యూదులకు కొన్ని విషయాలు నిజంగా ముఖ్యమైనవి మరియు చెడు విషయాలతో కలపకూడదని అర్థం చేసుకోవడానికి సహాయపడింది. వారు జంతువులను బలి ఇచ్చినప్పుడు అది ఎంత ప్రత్యేకమైనదో చూడటానికి కూడా వారికి సహాయపడింది. శాంతికి నాయకుడైన యేసు, సిలువపై మరణించినప్పుడు దేవునితో సమాధానమిచ్చాడు. ఆయన వల్లే ఆయనను విశ్వసించే వ్యక్తులు దేవునితో స్నేహంగా ఉండగలుగుతారు మరియు వారి హృదయాలలో శాంతిని కలిగి ఉంటారు. మనమందరం యేసులా శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. యేసులా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ దేవుడు చాలా ప్రేమ, దయ మరియు శాంతిని ప్రసాదిస్తాడని నేను ఆశిస్తున్నాను.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |