12. కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రా యేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి.
వాళ్ళు ఆయన మాటలు, హెచ్చరికలు, శిక్షలు, విధానాలన్నిటినీ నిర్లక్ష్యం చేశారు. అందువల్ల ఒక అంతిమ శిక్షను దేవుడు వారిపైకి పిలిపిస్తాడు – ఆమోసు 3:11-15. మొత్తంగా ఆ జాతికి తప్పించుకునే మార్గం ఉండదు. దేవుని తీర్పును ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడి ఉండాలి. “మీ దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడండి” అనడంలో అర్థం ఇదే కావచ్చు. అయితే ఇది పశ్చాత్తాపపడండి అన్న హెచ్చరిక కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. వారు పాపాలకు విముఖులై వారికి దేవుడు చెప్పబోయేదాన్ని వినేందుకు సిద్ధపడాలి. ఆమోసు 5:4-6 పోల్చి చూడండి.