Obadiah - ఓబద్యా 1 | View All

1. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.

“దర్శనం”– యెషయా 1:1; ఆదికాండము 15:1. “ఎదోం”– ఈ దేశం గురించి ఇతర ప్రవచనాలు యెషయా 34:5-15; యిర్మియా 49:7-22; యెహెఙ్కేలు 25:12-14; ఆమోసు 1:11-12.

2. నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.

వారు చాలా గర్విష్ఠులు. అందువల్ల దేవుడు వారి మెడ వంచుతాడు. తాము ఏదో పెద్ద వాళ్ళమనుకున్నారు. దేవుడు వారిని అల్పులుగా చేస్తాడు. సామెతలు 3:34; సామెతలు 6:16-17; యాకోబు 4:6-10; 1 పేతురు 5:5-6; కీర్తనల గ్రంథము 18:25-27; యెషయా 2:11-18 చూడండి.

3. అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడె వడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.

4. పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.

5. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు.

ఎదోం శత్రువులు దొంగలు, దోపిడీ దారుల కన్న చాలా కఠినంగా వారిపట్ల ప్రవర్తిస్తారు. ఏదీ మిగలకుండా సమూలంగా దోచుకుంటారు. “ద్రాక్ష పండ్లను”– ద్వితీయోపదేశకాండము 24:20-21.

6. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.

7. నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.

ఎదోం స్నేహితులు, సహకారులు సమయం వచ్చే సరికి యథార్థత చూపక ద్రోహులై వారిని మోసగిస్తారు. ఈ విధంగా దేవుడు ఎదోంవారిని నాశనం చేస్తాడు.

8. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.

ఎదోం ఇహలోక సంబంధమైన జ్ఞానులకు ప్రసిద్ధి – యిర్మియా 49:7 (యోబు స్నేహితుడు ఎలీఫజు ఎదోంలో ఓ ప్రాంతానికి చెందినవాడు – యోబు 2:11). “ఏశావు”– ఎదోంకు మరో పేరు. ఆదికాండము 25:29-30 చూడండి. “నాశనం”– వారి జ్ఞానం వారిని గానీ వారి దేశాన్ని గానీ కాపాడలేక పోతుంది.

9. తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసు లందరు హతులై నిర్మూలమగుదురు.

తేమానువాళ్ళు ఏశావు సంతానంలో ఒక గోత్రం. ఎదోంలో వీళ్ళు నివసించే ప్రాంతానికి కూడా ఆ పేరే వచ్చింది.

10. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.

ఎదోంపైకి దేవుడు నాశనాన్ని పంపడానికి గల ప్రధాన కారణం ఇది. ఇస్రాయేల్ పై శత్రువులు దాడి చేసినప్పుడు ఎదోం ఆనందించడమే గాక ఇస్రాయేల్‌ను ధ్వంసం చెయ్యడంలో చెయ్యి కలిపింది. ఓబద్యా 1:10 “సోదరులైన యాకోబు”– ఎదోం యాకోబు అన్న (ఆదికాండము 25:24-30). అందువల్ల ఇస్రాయేల్, ఎదోంలు

11. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూష లేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా.

“వారిలో ఒకడిలాగా”– ఏశావు ఇస్రాయేల్ బద్ధ శత్రువుల్లో ఒకడిలాగా ఉన్నాడు.

12. నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;

సోదరుని వినాశనాన్ని చూచి ఆనందించడం దయ్యం స్వభావం. ఇలా చేసినవాళ్ళు దేవుని తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ జాతి అంతా ఈ విషయంలో దోషులే.

13. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;

“వారి ఆస్తి పాస్తులను పట్టుకోవడం”– కష్టంలో ఉన్న ప్రజలపై బడి వారి కష్టాన్ని అధికం చేశారు.

14. వారిలో తప్పించుకొనినవారిని సంహ రించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదిన మందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు.

తమ సోదర జాతిలో ఏ ఒక్కరూ తప్పించుకు పోకూడదని కృత నిశ్చయులై ఉన్నారు. వారి అసూయ, ద్వేషం అంత భయంకరమైనవి.

15. యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.

“యెహోవా దినం”– యోవేలు 1:15; యోవేలు 2:1, యోవేలు 2:11, యోవేలు 2:31; యోవేలు 3:14. “నీ నెత్తి మీదికి”– బైబిలంతటిలోనూ ఏక ధారగా కనిపించే అంశం ఇది (కీర్తనల గ్రంథము 7:15-16; కీర్తనల గ్రంథము 18:25-27; యిర్మియా 50:29; యెహెఙ్కేలు 35:11; హబక్కూకు 2:8; గలతియులకు 6:7). ఇది వ్యక్తులకూ, జాతులకు కూడా వర్తి

16. మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.

“పవిత్ర పర్వతం”– అంటే జెరుసలం. ఎదోంవాళ్ళు ఇస్రాయేల్ ఓటమిని బట్టి త్రాగుడుతో ఉత్సవం చేసుకొన్నారు. అయితే యెహోవా దినాన ఎదోం, మరి కొన్ని ఇతర జాతులు మద్యం గాక వేరొకటి తాగవలసి ఉంటుంది. యిర్మియా 25:15-29; యిర్మియా 49:12-13; ప్రకటన గ్రంథం 14:10 చూడండి.

17. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.

18. మరియయాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొన కుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.

యెహెఙ్కేలు 25:12-14; జెకర్యా 12:6. ఎదోం ఇస్రాయేల్‌కు చేసినట్టుగానే దేవుడు ఎదోంకు చేస్తాడు. దాని నాశనానికి ఇస్రాయేల్‌ను సాధనంగా వాడుకుంటాడు.

19. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీ నీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు.

ఇస్రాయేల్‌ప్రజ ఎదోం దేశాన్ని ఆక్రమించు కుంటారు. ఇది ఇంకా జరగలేదు. అయితే దేవుని వాక్కు సత్యం అనే మాట ఎంత ఖాయమో ఇది నెరవేరుతుందనేది కూడా అంతే ఖాయం. “ఫిలిష్తీయవారి”– ఇస్రాయేల్‌కు పశ్చిమాన మధ్యధరా సముద్ర తీరాన ఆ రోజుల్లో ఉన్న ప్రజ. “గిలాదు”– యొర్దాను నదికి తూ

20. మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెర పట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణ ములను స్వతంత్రించుకొందురు.

“సారెపతు”– 1 రాజులు 17:9. సారెపతు ఎక్కడ ఉందో సరిగ్గా తెలియదు.

21. మరియఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
ప్రకటన గ్రంథం 11:15

రాబోయే రాజ్యంలో అధికార పీఠం (రాజధాని నగరం కూడా అనవచ్చు) జెరుసలం అవుతుంది. ఇస్రాయేల్ రాజ్యం, దేశాలన్నిటిపై పరిపాలన యెహోవాకు చెందుతాయి – యెషయా 2:1-4; యెషయా 11:10-16; యెహెఙ్కేలు 48:35; యోవేలు 3:20-21; జెకర్యా 14వ అధ్యాయం; ప్రకటన గ్రంథం 11:15.Shortcut Links
ఓబద్యా - Obadiah : 1 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |