Jonah - యోనా 1 | View All

1. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

“యోనా”– 2 రాజులు 14:25. ఈ రిఫరెన్స్, ఈ చిన్న పుస్తకం మినహా యోనా గురించి మరింకేదీ మనకు తెలియదు. యోనా అనే పేరుకు గువ్వ అని అర్థం. “వాక్కు వచ్చింది”– యిర్మియా 1:2; హోషేయ 1:1; యోవేలు 1:1.

2. నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

“నీనెవె”– ఆదికాండము 10:11; 2 రాజులు 19:36; నహూము 1—3 అధ్యాయాలు; జెఫన్యా 2:13; మత్తయి 12:41. నీనెవె అష్షూరువారి ప్రధాన నగరం, ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం. ఒక పురాతన వృత్తాంతం ప్రకారం ఆ నగరం, దాని శివార్లు, అనుబంధ పట్టణాల చుట్టుకొలత దాదాపు 100 కి.మీ. ఉండేది. ఇస్రాయేల్‌లో యోనా స్వగ్రామం నుంచి నీనెవె దాదాపు 800 కి.మీ. దూరాన ఉంది. “దానిలో ఉన్న చెడుతనం”– నహూము రోజుల్లో నీనెవె మదించి, హింసాత్మకంగా, క్రూరంగా, పూర్తిగా చెడిపోయి ఉంది (నహూము 1:11; నహూము 2:12-13; నహూము 3:1, నహూము 3:4, నహూము 3:16, నహూము 3:19). యోనా కాలంలో కూడా కొంతవరకు అలా ఉండి ఉండాలి – 3:8. అది ఇస్రాయేల్‌కు బద్దవిరోధి – యోనా కాలం తరువాత అది ఉత్తర రాజ్యాన్ని చితగ్గొట్టి దాని ప్రజను బందీలుగా తీసుకుపోయింది. 2 రాజులు 17:3-6 చూడండి. దేవుడు కొన్ని సార్లు తన సేవకులకు అతి కష్టమైన, చెయ్యడానికి ఏమాత్రం ఇష్టంలేని పనులను అప్పగిస్తుంటాడు. ఆ పనులను చెయ్యవలసిన అవసరం వారికి కనిపించకపోవచ్చు కూడా.

3. అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

“పారిపోదామని”– యోనా 4:2. యోనా స్వయంగా ఇందుకు కారణం చెప్పాడు. నీనెవె పశ్చాత్తాపపడడం, దేవునినుంచి క్షమాపణ పొందడం యోనాకు ఇష్టం లేదు. ఆ నగరాన్ని దేవుడు ధ్వంసం చెయ్యాలని అతనికి ఉంది. దేవుని నుంచి ఎవరూ పారిపోలేరని అతనికి అర్థం అయినట్టు లేదు – కీర్తనల గ్రంథము 139:7-12. అంతేగాక, ఇస్రాయేల్‌లో తానొక్కడే ప్రవక్త అనీ, దేవుడు వేరెవరినీ నీనెవెకు పంపలేడనీ యోనా ఊహించి నట్టున్నాడు. “తర్‌షీషు”– బహుశా నేటి స్పెయిన్ దేశం దక్షిణ కొనలో ఉండవచ్చు. ఇది నీనెవెకు వ్యతిరేక దిశలో ఉంది. అతడు ఇంతకంటే దూరంగా పారిపోగల నగరమేదీ లేదు. యొప్పే ఇస్రాయేల్‌దేశంలో మధ్యధరా తీరాన ఉంది.

4. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.

“యెహోవా...పుట్టించాడు”– వ 17; యోనా 4:6-7, యోనా 4:8; కీర్తనల గ్రంథము 107:25; కీర్తన 29 పోల్చి చూడండి. సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి అంతటినీ అదుపులో ఉంచుకొని, ఎప్పుడైనా దేన్నైనా తన ప్రయోజన సిద్ధికి వాడుకోగలడు.

5. కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను

“తన దేవుడికి”– ఈ నావికులు ఇస్రాయేల్‌వారు కాదు. వివిధ రకాలైన చిల్లర దేవుళ్ళను పూజించేవాళ్ళు. ఆ దేవుళ్ళకు ప్రకృతి శక్తులపై ఎలాంటి అధికారమూ, అదుపూ లేవు (కీర్తనల గ్రంథము 115:3-8). “నిద్రపోయాడు”– ఏమి జరిగినా, తాను చచ్చినా బ్రతికినా యోనాకు పెద్దగా చింత లేదు అని అర్థమౌతున్నది. సజీవుడైన నిజ దేవునితో అతని సహవాసం పోయింది. అవిధేయత, బహుశా నిరాశ, మైకంలో ఉన్నాడు.

6. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.

ఇతర దేవుళ్ళకు చేసే ప్రార్థనలు పనికి రావడం లేదని ఓడ నాయకుడు గ్రహించాడు. బహుశా యోనా దేవుడు తమ కోసం ఏమన్నా చెయ్యగలడని ఆశించాడు.

7. అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.

8. కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా

9. అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.

10. తాను యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయ పడినీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.

“మహా భయం”– యోనా ఆరాధించే దేవుడు ఏదో చిన్న కుల దైవం కాదనీ, లేదా అనేకమంది ఆరాధించే చిల్లర దేవుళ్ళలాంటి వాడు కాదనీ వారికి అర్థమైంది. “చెప్పాడు”– కనీసం యోనా వారితో ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు అన్నీ చెప్పేశాడు (వ 12).

11. అప్పుడు వారుసముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌచున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా

12. నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను

మరణాన్ని కోరుకొనే మనఃస్థితిలో యోనా ఉన్నట్టున్నాడు – వ 5. దేవుని నుంచి తాను పారిపోలేనని గుర్తించి నీనెవె వెళ్ళడం కంటే చనిపోవడమే మంచిదనుకున్నాడు.

13. వారు ఓడను దరికి తెచ్చు టకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.

పరలోక దేవుడైన యెహోవా పేరు వినడంతోనే వారు హడలిపోయారు – వ 10. ఆయన సేవకుల్లో ఒకడికి హాని చెయ్యడం ద్వారా ఆయనకు కోపం తెప్పించడం వారికి ఇష్టం లేదు.

14. కాబట్టి వారు యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని

15. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.

“ప్రశాంతం అయింది”– కీర్తనల గ్రంథము 109:29; మత్తయి 8:26.

16. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.

“యెహోవాకు...భయపడి”– మార్కు 4:41; నిర్గమకాండము 20:1; కీర్తనల గ్రంథము 76:7; కీర్తనల గ్రంథము 96:4; మలాకీ 1:4. మహా శక్తి గల సృష్టికర్త దాన్ని జరిగించాడన్న వింతైన, ఖచ్చితమైన సాక్ష్యాధారాలు వారు చూశారు. తమ దేవుళ్ళను వారు వదిలిపెట్టారని రాసిలేదు. బహుశా తాము పూజించే దేవుళ్ళ జాబితాలో యెహోవా పేరును కూడా చేర్చుకుని ఉంటారు. చాలా సార్లు మనుషుల తీరు ఇలాగే ఉంటుంది. ఏకైక నిజ దేవుణ్ణి ఆరాధించాలంటే ఇతర దేవుళ్ళందరినీ విగ్రహాలనూ వదిలేయాలని చాలామంది అర్థం చేసుకోరు – [Exo,20,1-6}; 1 రాజులు 8:21; యెషయా 42:8.

17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.
మత్తయి 12:40, 1 కోరింథీయులకు 15:4

వ 4 పోల్చి చూడండి. “బ్రహ్మాండమైన చేప”– ఇది తిమింగలం అని ఇక్కడ రాసిలేదు. ఈ ఒక్క పనికోసం దేవుడు సిద్ధపరచిన ఒక ప్రత్యేకమైన చేప కావచ్చు. యోనా సముద్రంలో మునిగిపోకుండా దేవుడు ఇలా చేశాడు. “మూడు రోజులు”– మత్తయి 12:40; {Mat,16,4]. “కడుపులో”– యోనాను, ఆ బ్రహ్మాండమైన చేపను చేసిన దేవుడు తన ఇష్టం వచ్చినంత కాలం అతణ్ణి చేప కడుపులో ప్రాణాలతో ఉంచగలిగాడు.Shortcut Links
యోనా - Jonah : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |