Micah - మీకా 1 | View All

1. యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

“హిజ్కియా”– యెషయా హోషేయలకు మీకా సమకాలికుడు. యిర్మియా 1:2; హోషేయ 1:1; యోవేలు 1:1. “మోరషతు”– బహుశా దక్షిణ యూదాలోని మోరెషత్ గాతు అనే పట్టణమే. “జెరుసలం”– కొందరు ప్రవక్తల్లాగా కాక మీకా ఉత్తర ఇస్రాయేల్, దక్షిణ యూదా రాజ్యాలు రెంటిని గురించీ దేవునిమూలంగా పలికిన ప్రవక్త. “దర్శనరీతిగా”– యెషయా 1:1 చూడండి.

2. సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్దాలయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

ఇస్రాయేల్ యూదాలకు దేవుడు చెప్పనున్న మాటలను లోకమంతా వినాలి. యెషయా 1:2 పోల్చిచూడండి. దేవుడు తన ప్రజల పాపాల గురించి మాట్లాడుతున్నప్పుడు, లోక రాజ్యాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా సాక్ష్యం చెపుతున్నాడు.ఎందుకంటే వారు కూడా అదే పాపాలు చేస్తున్నారు. “పవిత్రాలయం”– పరలోకంలో ఉన్న ఆలయం (ప్రకటన గ్రంథం 7:15; ప్రకటన గ్రంథం 11:9; ప్రకటన గ్రంథం 15:5-6; ప్రకటన గ్రంథం 16:17).

3. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.

“బయలుదేరుతున్నాడు”– అంటే దేవుడొక నిశ్చయమైన చర్య తీసుకోబోతున్నాడు అని మీకా ఉద్దేశం. కీర్తనల గ్రంథము 18:9; కీర్తనల గ్రంథము 144:5; యెషయా 26:21; యెషయా 31:4; యెషయా 64:1-3 పోల్చిచూడండి. “ఎత్తయిన స్థలాలపై”– ఆమోసు 4:3. ఎత్తయిన స్థలాలంటే పర్వతాలు కావచ్చు (వ 4), లేక కొండలపైన నిర్మించబడే అబద్ధ దేవతల పూజాస్థలాలు కావచ్చు (వ 5)

4. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,

“కరిగిన”– కీర్తనల గ్రంథము 46:6; కీర్తనల గ్రంథము 97:5; నహూము 1:5. ఈ మాటలు దుర్మార్గాలు చేసే వారిని శిక్షించేందుకు దేవుడి రాకడను చూపిస్తున్నాయి.

5. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?

యాకోబు”– అంటే ఇస్రాయేల్ ఉత్తర రాజ్యం. “షోమ్రోను”– ఇస్రాయేల్ రాజధాని, దేవునికీ ఆయన ధర్మశాస్త్రానికీ విరుద్ధంగా ఆ దేశం చేసిన తిరుగుబాటుకూ కేంద్ర స్థానం. “ఎత్తయిన”– లేవీయకాండము 26:30; సంఖ్యాకాండము 22:41; 1 రాజులు 3:2; 1 రాజులు 12:32; మొ।।. అంటే జెరుసలం మొత్తం విగ్రహ పూజ, అబద్ధ ఆరాధనలకు నిలయమైందని మీకా చెపుతున్నాడు. ఆహాజురాజు కాలంలో ఇది జరిగింది – 2 రాజులు 16:1-18; 2 దినవృత్తాంతములు 28:25.

6. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను;

చేస్తాను”– ఇందుకు విదేశీ సైన్యాలను ఉపయోగిస్తాడు (యెషయా 10:5-6). దీని నెరవేర్పు కోసం 2 రాజులు 17:5-20 చూడండి.

7. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టు కొనిన విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును.

“వేశ్యల”– హోషేయ 4:10-15 చూడండి.

8. దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.

9. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి.

“నయం కానివి”– యెషయా 17:11; యిర్మియా 30:12-13; హోషేయ 7:1. దేవుడు ప్రజలను నయం చేయాలంటే ముందు అందుకు ప్రజలు సమ్మతించాలి. దేవుని స్వస్థతను ప్రజలు నిరాకరిస్తే వారి గాయానికి నిజంగా నివారణ ఉండదు. ఇస్రాయేల్ పై అష్షూరువారు తెచ్చే వినాశాన్ని గురించి మీకా ఇక్కడ మాట్లాడుతున్నాడు. “జెరుసలం వరకు”– యెషయా 36:1-2.

10. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.

“గాతు”– యెహోషువ 11:22; యెహోషువ 13:3; 1 సమూయేలు 5:8; 1 సమూయేలు 6:17. దేవుని ప్రజల యాతన, నాశనం గురించి వారి శత్రువుల పట్టణాల్లో తెలియడం ప్రవక్తకు ఇష్టం లేదు.

11. షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము; జయ నానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.

“దిగంబరులై సిగ్గుపడుతూ”– విజయం సాధించిన సైన్యాలు తమ ఖైదీలను తీసుకుపోయే పద్ధతి ఇదే. యెషయా 20:4 పోల్చిచూడండి.

12. మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.

“యెహోవా కలిగించాడు”– యెషయా 10:5-6 పోల్చి చూడండి.

13. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.

“లాకీషు”– యూదాలో జెరుసలంకు 50 కి.మీ. ఆగ్నేయ దిశగా ఉన్న పెద్ద ఊరు. “సీయోను కుమార్తె”– జెరుసలం నగరం. 2 రాజులు 19:21; కీర్తనల గ్రంథము 9:14 పోల్చి చూడండి. “ప్రథమ కారణం”– జెరుసలంలో కనిపించిన విగ్రహ పూజ బహుశా మొదట లాకీషులో ఆరంభమైందని దీని అర్థం కావచ్చు.

14. మోరెషెత్గతు విషయములో మీరు విడు దలకైకోలు ఇయ్యవలసివచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రా యేలు రాజును మోసపుచ్చునవై యుండును.

మోరెషత్‌గాతు (వ 1) శత్రువుల పాలవుతుంది.

15. మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

ఇస్రాయేల్‌వారిలో ఉన్న ఘనుడు అంటే దేవుడే – 1 సమూయేలు 15:29. కీర్తనల గ్రంథము 106:20; యిర్మియా 2:11; హోషేయ 4:7 పోల్చిచూడండి. బహుశా ప్రవక్తలు దేవుణ్ణి ఇలా సంబోధించడానికి కారణం ఆయన సన్నిధి గుడారంలోను ఆలయంలోను మహిమా మేఘంలో ప్రత్యక్షమయ్యాడనే – నిర్గమకాండము 40:34-35; 1 రాజులు 8:10-11. “అదుల్లాం”– అక్కడి ప్రజలను శిక్షించేందుకు దేవుడు వస్తాడు.

16. సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.

“బోడి చేసుకోండి”– శోకానికి గుర్తుగా (యోబు 1:20). “దేశాంతరం”– ద్వితీయోపదేశకాండము 4:27; ఆమోసు 5:27; ఆమోసు 6:7; ఆమోసు 7:17.Shortcut Links
మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |