Micah - మీకా 4 | View All

1. అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.

1. antyadhinamulalo yehovaa mandiraparvathamu parvathamula shikharamuna sthiraparachabadi kondalakante etthugaa etthabadagaa pravaahamu vachinatlu janulu daaniloniki vatthuru.

2. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.

2. kaabatti aa kaalamuna anyajanulanekulu vachi seeyonulonundi dharmashaastramunu, yerooshalemulo nundi yehovaa vaakkunu bayalu vellunu; yaakobu dhevuni mandiramunaku yehovaa parvathamunaku manamu velludamu randi, aayana thanamaargamulavishayamai manaku bodhinchunu, manamu aayana trovalalo naduchukondamu ani cheppukonduru.

3. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చు కత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.

3. aayana madhyavarthiyai aneka janamulaku nyaayamu theerchunu, dooramuna nivasinchu balamu gala anyajanulaku theerpu theerchunu. Vaaru thama khadgamulanu naagati nakkulugaanu thama yeetelanu machu katthulu gaanu saagakottuduru, janamu meediki janamu khadgamu etthaka yundunu, yudhdamucheya nerchukonuta janulu ika maanivethuru.

4. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.

4. evari bhayamulekunda prathivaadunu thana draakshachettukrindanu thana anjoorapu chettukrindanu koorchundunu; sainyamulakadhipathiyagu yehovaa maata yichiyunnaadu.

5. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము.

5. sakala janamulu thama thama dhevathala naamamu smarinchuchu naduchukonduru, manamaithe mana dhevudaina yehovaa naamamu nellappudunu smarinchu kondumu.

6. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమ కూర్చుదును; ఇదే యెహోవా వాక్కు.

6. aa dinamuna nenu kuntivaarini pogucheyudunu, avathalaku vellagottabadinavaarini baadhimpabadinavaarini sama koorchudunu; idhe yehovaa vaakku.

7. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును.
లూకా 1:33

7. kuntivaarini sheshamugaanu dooramunaku vellagottabadinavaarini balamaina janamugaanu nenu chethunu, yehovaa seeyonu konda yandu ippatinundi shaashvathakaalamuvaraku vaariki raajugaa undunu.

8. మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వము కలుగును;

8. mandala gopuramaa, seeyonu kumaarthe parvathamaa, munupatilaaguna yerooshalemu kumaarthemeeda neeku prabhutvamu kalugunu;

9. నీవెందుకు కేకలువేయు చున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?
యోహాను 16:21

9. neevenduku kekaluveyu chunnaavu? neeku raaju lekapovutachethane nee aalochana karthalu nashinchipovuta chethane prasoothi streeki vachina vedhanalu neeku vachinavaa?

10. సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
ప్రకటన గ్రంథం 12:2

10. seeyonu kumaaree, pramaathi streevalene neevu vedhanapadi prasavinchumu, neevu pattanamu vidichi bayata vaasamu chethuvu, babulonu puramuvaraku neevu velluduvu, akkadane neevu rakshana nonduduvu, akkadane yehovaa nee shatruvula chethilonundi ninnu vimochinchunu.

11. మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.

11. manamu choochuchundagaa seeyonu apavitraparachabadunu gaaka ani cheppukonuchu anyajanulanekulu neemeediki koodivachi yunnaaru.

12. కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.

12. kallamulo okadu panalu koorchunattu yehovaa vaarini sama koorchunu, ayithe vaaru aayana thalampulu telisikona kunnaaru, aayana aalochana vaaru grahimpakunnaaru.

13. సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.

13. seeyonu kumaaree, nee shrungamu inupadhigaanu nee dekkalu itthadivigaanu nenu cheyuchunnaanu, lechi kallamu trokkumu, aneka janamulanu neevu anaga drokku duvu, vaariki dorikina laabhamunu nenu yehovaaku prathishtinchudunu, vaari aasthini sarvalokanaadhuniki prathi shtinchudunu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Micah - మీకా 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు రాజ్యం యొక్క శాంతి. (1-8) 
దేశాలు ఇంకా శాంతి యువరాజును పూర్తిగా స్వీకరించలేదు, వారు తమ కత్తులను నాగలికి మార్చుకోలేదని మరియు యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుందని సూచించింది. అయినప్పటికీ, ఈ వాగ్దానాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ప్రత్యేకించి సువార్త చర్చికి సంబంధించినవి, మరియు ఈ వాగ్దానాలు చేసిన వ్యక్తి విశ్వాసపాత్రుడు కాబట్టి అవి మరింతగా ఫలిస్తాయి. చివరి రోజులలో, మెస్సీయ యుగంలో, దేవుని కోసం అద్భుతమైన చర్చి ప్రపంచంలో స్థాపించబడుతుంది, ఇది క్రీస్తు స్వయంగా కదలని పునాదిపై స్థాపించబడింది.
పూర్వం, అన్యులు తమ విగ్రహాలను పూజించేవారు, కానీ ఇక్కడ వివరించిన కాలంలో, ప్రజలు తమను హృదయపూర్వకంగా దేవునికి అంకితం చేస్తారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఆనందం పొందుతారు. "హల్టెత్" అనే పదం దైవిక వాక్యానికి అనుగుణంగా నడుచుకోని వారిని వివరిస్తుంది. బాబిలోన్ నుండి బందీలను సేకరించడం చర్చికి స్వస్థత, శుద్ధీకరణ మరియు శ్రేయస్సు యొక్క ప్రక్రియను సూచిస్తుంది, క్రీస్తు యొక్క పాలన శాశ్వతమైన స్వర్గరాజ్యం ద్వారా విజయం సాధించే వరకు కొనసాగుతుంది.
మనం ఆయన పవిత్ర మార్గాలను నేర్చుకుని వాటిని అనుసరించేలా దేవుని శాసనాలలో పాల్గొనమని ఒకరినొకరు ప్రోత్సహిద్దాం. మనము ఆయన చట్టాన్ని నేరుగా ఆయన చేతుల నుండి స్వీకరించినప్పుడు, ఆయన ఆత్మ దానిని మన హృదయాలపై వ్రాయడంతో, విమోచకుని యొక్క నీతితో మనకున్న సంబంధాన్ని మనం ప్రదర్శించగలము.

జెరూసలేంపై వచ్చే తీర్పులు, కానీ ఇజ్రాయెల్ యొక్క చివరి విజయం. (9-13)
అనేక దేశాలు ఏకతాటిపైకి వస్తాయి, ఆమె దురదృష్టాలను జరుపుకునే ఉద్దేశ్యంతో జియాన్‌కు వ్యతిరేకంగా గుమిగూడాయి. అయితే, ప్రభువు తమను నూర్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్న గడ్డివాముల వలె సేకరించాడని మరియు వారిని పూర్తిగా ఓడించడానికి సీయోను బలపరచబడుతుందని వారికి తెలియదు. యూదు చర్చి చరిత్రలో ఈ సమయం వరకు, ఈ జోస్యంతో సరిపోయే సంఘటనలు లేవు. దేవుడు తన ప్రజలను జయించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు, దానిని నిర్వహించడానికి అవసరమైన శక్తిని మరియు సామర్థ్యాన్ని వారికి అందిస్తాడు. కష్ట సమయాల్లో, విశ్వాసులు నిరాశకు లోను కాకుండా విశ్వాసంతో నిండిన ప్రార్థనలతో తమ స్వరాన్ని పెంచాలి.



Shortcut Links
మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |