Nahum - నహూము 1 | View All

1. నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

1. [This verse may not be a part of this translation]

2. యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

2. యెహోవా రోషంగల దేవుడు! యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు. యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు. ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.

3. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

3. యెహోవా ఓర్పు గలవాడు కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు. యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు. ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు. దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు. మానవుడు నేల మీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు!

4. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.

4. యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది. ఆయన నదులన్నీ ఇంకి పోయేలా చేస్తాడు! బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి నశించి పోతాయి. లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.

5. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

5. యెహోవా వస్తాడు. పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి. యెహోవా వస్తాడు. భయంతో భూమి కంపిస్తుంది. ఈ ప్రపంచం, అందులో నివసించే ప్రతివాడూ భయంతో వణుకుతారు.

6. ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
ప్రకటన గ్రంథం 6:17

6. యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు. ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు. ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది. ఆయన రాకతో బండలు బద్దలై చెదిరి పోతాయి.

7. యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.

7. యెహోవా మంచివాడు, ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం. ఆయనను నమ్మిన వారి పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.

8. ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,

8. ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు. ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు. ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.

9. యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.

9. యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు? కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు. కష్టం రెండువ సారి రాదు.

10. ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.

10. చిక్కు పడిన ముండ్ల పొదలా నీ శత్రువు నాశనం చేయబడతాడు. ఎండిన కలుపు మొక్కల్లా వారు వేగంగా కాలిపోతారు.

11. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

11. అష్షూరూ, నీలో నుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరంగా దుష్ట పథకాలు వేశాడు. అతడు చెడు సలహా ఇచ్చాడు.

12. యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

12. యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు: “అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు. వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు. వారంతా అంతం చేయబడతారు. నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను. కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను.

13. వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

13. అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను. మీ మెడ మీద నుండి ఆ కాడిని తీసివేస్తాను. మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.”

14. నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.

14. అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను నీ కొరకు నీ సమాధిని నేను తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!

15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
అపో. కార్యములు 10:36, రోమీయులకు 10:15, ఎఫెసీయులకు 6:15

15. యూదా, చూడు! పర్వతాల మీద నుండి వస్తున్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక దూత ఇక్కడికి వస్తున్నాడు! శాంతి ఉన్నదని అతడు చెపున్నాడు! యూదా, నీ ప్రత్యేక పండుగలను జరుపుకో! యూదా, నీవు మాట ఇచ్చిన వాటిని నెరవేర్చు. దుష్ట జనులు మళ్లీ నీ మీద దాడి చేసి నిన్ను ఓడించలేరు! ఆ దుష్ట జనులందరూ నాశనం చేయబడ్డారు.Shortcut Links
నహూము - Nahum : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |