Nahum - నహూము 1 | View All

1. నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

“నీనెవె” – ఆదికాండము 10:11; 2 రాజులు 19:36; యోనా 1:2; యోనా 3:2-3; జెఫన్యా 2:13; మత్తయి 12:41. “దేవోక్తి”– సంఖ్యాకాండము 23:7 నోట్. “ఎల్‌కోషు”– ఇది ఎక్కడ ఉందో తెలియదు. “దర్శనాన్ని”– ఆదికాండము 15:1; యెషయా 1:1.

2. యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

“రోషం గల” – నిర్గమకాండము 20:5; నిర్గమకాండము 34:14; ద్వితీయోపదేశకాండము 4:34; యెహోషువ 24:19; జెకర్యా 8:2. ఇక్కడ రోషం అనే పదం తన ప్రజలపట్ల ప్రేమనూ, వారిని నాశనం చేయజూచే వారిపట్ల కోపాన్నీ తెలియజేస్తున్నది. అష్షూరు రాజ్యానికంతటికీ ప్రతినిధిగా ఉన్న దాని ముఖ్య పట్టణం నీనెవె ఇస్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసింది (2 రాజులు 17:5-6). “ప్రతీకారం”– సంఖ్యాకాండము 31:1-3 (నోట్‌); ద్వితీయోపదేశకాండము 32:40-41. దేవుడు న్యాయసమ్మతంగా తీర్పు తీర్చి ఆయన్ను వ్యతిరేకించే వారందరినీ శిక్షిస్తాడు. “తీవ్ర కోపం” – సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18. “శత్రువులకు”– ఆయన ప్రజల శత్రువులు ఆయన శత్రువులే.

3. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

“త్వరగా కోపపడడు” – నిర్గమకాండము 34:6.

4. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.

5. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

6. ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
ప్రకటన గ్రంథం 6:17

7. యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.

“ఉత్తముడు” – కీర్తనల గ్రంథము 25:7-8; కీర్తనల గ్రంథము 34:8; కీర్తనల గ్రంథము 100:5; కీర్తనల గ్రంథము 106:1; కీర్తనల గ్రంథము 107:1; కీర్తనల గ్రంథము 145:9; మత్తయి 19:17. ప్రశ్న: దేవుడు కోపగించి పగ సాధిస్తే, అగ్నిలాగా తన ఆగ్రహాన్ని ప్రవహింపజేస్తే ఆయన ఉత్తముడెలా అవుతాడు? జవాబు: ఆయన ఉత్తముడు కాబట్టే ఇలా చేస్తాడు. ఆయన ఉత్తమ లక్షణాల్లో న్యాయం అనేది ఒకటి. మనుషులు ఈ భూమిని చెడగొట్టి, తన రాజ్యాన్నీ తన పనినీ తన ప్రజలనూ నాశనం చేయజూస్తే తన మంచితనాన్ని బట్టి ఆయన వారిని అలా చేయనివ్వలేడు. తన ప్రజల సంరక్షణకు పూనుకోకుండా దౌర్జన్యపరులను శిక్షించకుండా ఉండలేడు (సంఖ్యాకాండము 31:1-3). “ఆశ్రయం”– ద్వితీయోపదేశకాండము 33:27; కీర్తనల గ్రంథము 2:12; కీర్తనల గ్రంథము 5:11; కీర్తనల గ్రంథము 9:9 మొ।।. “నమ్మకం”– 2 రాజులు 17:14; కీర్తనల గ్రంథము 4:5; కీర్తనల గ్రంథము 20:7; కీర్తనల గ్రంథము 62:8; సామెతలు 3:5; యెషయా 26:4; యెషయా 30:15; యోహాను 14:1. “ఆయనకు తెలుసు” – కీర్తనల గ్రంథము 1:6; కీర్తనల గ్రంథము 55:22; కీర్తనల గ్రంథము 103:13; 1 పేతురు 5:7.

8. ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,

ఏకైక నిజ దేవునిలో నమ్మకం ఉంచక ఆయనను నిరాకరించినవారికి ఆయన్నుండి ఏ మంచి విషయమైనా ఆశించడానికి హక్కు లేదు. నీనెవె ఆయనలో నమ్మకం ఉంచలేదు. అది నీచమైన నగరం (వ 14). అందువల్ల అది నాశనం పాలవుతుంది. ఇది క్రీ.పూ. 612లో జరిగింది.

9. యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.

నీనెవె పూర్తిగా ధ్వంసమైపోతుందని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. నీనెవె, అష్షూరుల గురించిన ఇతర భవిష్యద్వాక్కులు యెషయా 10:12-19; యెహెఙ్కేలు 32:22-23. అష్షూరు గురించిన నోట్ 2 రాజులు 15:19

10. ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.

11. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

12. యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

“మిమ్మల్ని బాధించినా” – యెషయా 10:5-6 చూడండి. ఇక్కడ దేవుడు యూదాతో మాట్లాడుతున్నట్టుంది. అష్షూరువాళ్ళు జెరుసలంను పట్టుకోవాలని ప్రయత్నించి అలా చేయలేకపోయారు. మరో సారి ప్రయత్నించే అవకాశమే వారికి రాలేదు (యెషయా 36, 37 అధ్యాయాలు).

13. వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

అష్షూరువారు ఒకప్పుడు యూదాపై కొంత అధికారాన్ని చూపారు. అష్షూరును నాశనం చేయడంద్వారా దేవుడు యూదాపై ఉన్న అష్షూరు కాడిని విరగొట్టివేస్తాడు.

14. నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.

“దేవుళ్ళు” – నిర్గమకాండము 12:12 పోల్చి చూడండి. “నీచుడివి”– హోషేయ 9:10 పోల్చిచూడండి.

15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
అపో. కార్యములు 10:36, రోమీయులకు 10:15, ఎఫెసీయులకు 6:15

పర్వతాలు అంటే జెరుసలం పర్వతాలు. శుభవార్త అంటే అష్షూరువారి పీడ నుంచి విడుదల అవుతుందని తెలిపే వార్త (యెషయా 37:29, యెషయా 37:33-35). యెషయా 52:7; రోమీయులకు 10:15 పోల్చి చూడండి. దేవుడు నహూము ద్వారా యూదాకు ధైర్యం చెప్తూ అష్షూరు మరింకెన్నడూ వీరిపై దాడి చేయదంటున్నాడు. నిజంగానే వారెన్నడూ యూదాపై దాడి చేయలేదు.Shortcut Links
నహూము - Nahum : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |