Zephaniah - జెఫన్యా 1 | View All

1. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

1. ఇది జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజుగా ఉన్న కాలంలో జెఫన్కా ఈ సందేశం అందు కొన్నాడు. జెఫన్యా కూషు కుమారుడు. కూషు గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు. ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం

2. ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.

2. “ భూమి మీదనున్న సమస్తాన్ని ెనేను నాశనం చేస్తాను!

3. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్య జాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 13:41

3. మనుష్యులందరినీ, జంతుపులన్నింటినీ నేను నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత పాపం చేయించే వాటన్నింటినీ నేను నాశనం చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను తొలగించి వేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు.

4. నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.

4. ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “ యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలం నుండి నేను వీటిని తీసివేస్తాను: బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను.

5. మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

5. నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు.ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలం నుండి నేను తొలగించి వేస్తాను.

6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

6. కొందరు మనుష్యులు యెహోవా నుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబడించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం యెహోవాను అడగటం మాని వేసారు. కనుక నేను ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్త్తాను.”

7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.

7. నా ప్రభువైన యెహోవా ముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిధులతో సిద్ధంగా ఉండుమని చెప్పాడు.

8. యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.

8. “ బలి అర్పించే యెహోవా దినాన రాజకుమారులను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు ధరించిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను.

9. మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దిన మందు నేను శిక్షింతును.

9. ఆ సమయంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అబద్ధాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు.

10. ఆ దినమందు మత్స్యపు గుమ్మ ములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.

10. యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్న వాటి పెద్ద శబ్ధాలను ప్రజలు వింటారు.

11. కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.

11. పట్టణం దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందుకంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం చేయబడతారు గనుక.

12. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును.

12. “ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టాను సారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కను గొంటాను. ఆ ప్రజలు ‘యెహోవా, ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు,ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను!

13. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపుర ముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.

13. అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షా తోటలు నాటుకొన్న వారు ఆ ద్రాక్షా పండ్లరసం తాగరు - ఇతరులకు అవి లభిస్తాయి.”

14. యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
ప్రకటన గ్రంథం 6:17

14. యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన స్తెనికులు కూడ ఏడుస్తారు!

15. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.

15. ఆ సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి మబ్బు తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది.

16. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.

16. అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.

17. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును.

17. యెహోవా ఇలా చెప్పాడు: “ నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను.ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేకమంది ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేల మీద చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట కుప్పలా ఉంటాయి.

18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.

18. వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమి మీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”Shortcut Links
జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |