Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
“ఆమోను”– 2 రాజులు 21:19. “యోషియా”– 2 రాజులు 2:1. “వచ్చిన వాక్కు”– యిర్మియా 1:4; హోషేయ 1:1; యోవేలు 1:1. “హిజ్కియా”– 2 రాజులు 18:1.
2. ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.
ఈ వచనాలు, 18వ వచనం, జెఫన్యా 3:8 లను బట్టి చూస్తే దేవుడు జెఫన్యా ద్వారా ఇప్పటికి ఇంకా నెరవేరక ఎప్పుడో భవిష్యత్తులో రాబోయే సమయం గురించి మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నది. ఆదికాండము 6:7 పోల్చి చూడండి. జలప్రళయం ద్వారా సమస్తాన్ని ఇక నాశనం చెయ్యనని దేవుడు నోవహుకు మాట ఇచ్చాడు – ఆదికాండము 9:1, ఆదికాండము 9:16. అగ్నివల్ల కలుగబోయే నాశనాన్ని గురించి జెఫన్యా ద్వారా మాట్లాడుతున్నాడు. 2 పేతురు 3:10-13 పోల్చి చూడండి.
3. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్య జాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.మత్తయి 13:41
4. నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.
దేవుడు ఎప్పుడో రాబోతున్న లోక వినాశనం గురించి ప్రకటించాక, ఇప్పుడు యూదా జెరుసలంల శిక్షను గురించి మాట్లాడుతున్నాడు. ఇది త్వరలోనే వస్తుంది. క్రీ.పూ. 586లో ఇది నెరవేరింది – 2 రాజులు 25వ అధ్యాయం. “చెయ్యి చాపుతాను”– యెషయా 10:5; యిర్మియా 51:20. “బయల్”– న్యాయాధిపతులు 2:11 నోట్. “పూజారులనూ”– 2 రాజులు 21:11-12; యిర్మియా 1:18; యిర్మియా 2:8, యిర్మియా 2:26-28; హోషేయ 10:5.
5. మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.
“నక్షత్ర సమూహాన్ని”– 2 రాజులు 21:3; యిర్మియా 8:2; యిర్మియా 19:13; అపో. కార్యములు 7:42; ద్వితీయోపదేశకాండము 4:19; ద్వితీయోపదేశకాండము 17:3-5. “మోలెకు”– లేవీయకాండము 18:21 నోట్. ఏకైక నిజ దేవుని పేరును ఇతర జాతులవారి అబద్ధ దేవుళ్ళ పూజతో కలపడం వారి ఆత్మ సంబంధమైన అంధత్వాన్నీ భ్రష్టత్వాన్నీ తెలియజేస్తూ ఉంది.
6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.
వారిలోని గొప్ప పాపం ఇదే. ఇతర పాపాలకు మూలం ఇదే. “వెదకని”– ఆమోసు 5:4, ఆమోసు 5:6.
7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
“యెహోవా దినం”– వ 14; యెషయా 13:6-13; యోవేలు 1:15; ఆమోసు 5:18; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 పేతురు 3:10. “మౌనంగా”– హబక్కూకు 2:20. “బలిని”– యిర్మియా 46:10. ఇక్కడ ఈ పదానికి అర్థం “వధ”. యూదాను నాశనం చేసే ఈ పనికి యూదా శత్రువులు సిద్ధం చేయబడ్డారు.
8. యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.
“విదేశీయుల బట్టల్లాంటి”– దేవుని ప్రజలు పవిత్ర ప్రజ అనుసరించవలసిన విధానాలను విడిచి, అందుకు వ్యతిరేకంగా విదేశీయుల పద్ధతులను అనుసరించడానికి గుర్తుగా విదేశీయుల రీతిలో బట్టలు ధరిస్తున్నట్టుగా దేవుడు చూశాడు.
9. మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దిన మందు నేను శిక్షింతును.
“గడపలు”– 1 సమూయేలు 5:5. యూదాప్రజలు నేర్చుకున్న విదేశీయుల విధానాల్లో ఇదొకటి. దీన్ని ఆచరించడానికి వారు శ్రద్ధ చూపారు గాని అబద్ధాలాడడం, హత్యలు చెయ్యడం మంచి నీళ్ళప్రాయంగా చేస్తున్నారు. తమ జీవితాలు పాపంతో నిండివున్నప్పటికీ మత సంబంధమైన మూఢాచారాలు కొన్ని తమను దేవుని అనుగ్రహానికి పాత్రులుగా చేస్తాయని కొందరు అనుకుంటారు. అలాంటివారికి వీరు ఒక ఉదాహరణ.
10. ఆ దినమందు మత్స్యపు గుమ్మ ములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.
నెహెమ్యా 3:3; నెహెమ్యా 11:9; 1 రాజులు 20:34.
11. కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.
12. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును.
“ఏమీ చేయడు”– తమ పాపంలో, అపనమ్మకంలో భద్రంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కీర్తనల గ్రంథము 10:11; కీర్తనల గ్రంథము 73:11-12. “మడ్డి”– యిర్మియా 48:11. “నెమ్మదిగా కూర్చునివున్న”– ఆమోసు 6:1.
13. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపుర ముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.
“దోపిడీ”– యిర్మియా 15:13; 2 రాజులు 24:13.
14. యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.ప్రకటన గ్రంథం 6:17
వ 7. “త్వరగా వస్తున్నది”– యోవేలు 1:15.
15. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
ఆమోసు 5:18-20.
16. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.
యోవేలు 2:2.
17. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును.
“గుడ్డివారిలాగా”– ద్వితీయోపదేశకాండము 28:28-29; యెషయా 59:10.
18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.
“కోప దినం”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18. ధనవంతులు కొన్ని సార్లు తమ ధనం తమకు భద్రత ఇస్తుందనుకుంటారు. అయితే దేవుడు కోపంతో వారిమీదికి లేచినప్పుడు భద్రత అనేదే లేదని వారు గ్రహిస్తారు. “దహనం”– వ 2,3; జెఫన్యా 3:8.