“ఆ కాలంలో”– ఇందులోను, తరువాత రెండు అధ్యాయాల్లోను ఈ మాట తరచుగా కనిపిస్తుంది. ఇది ఈ మూడు అధ్యాయాలు కలిసికట్టుగా చేసి ఇంకా భవిష్యత్తులో రాబోయే ఒక కాలాన్ని సూచిస్తున్నది – వ 4,6,8,9,11; జెకర్యా 13:1-2, జెకర్యా 13:4; జెకర్యా 14:4, జెకర్యా 14:6, జెకర్యా 14:8-9, జెకర్యా 14:13, జెకర్యా 14:20-21. ఆయా కాలాల్లో వివిధ దేశాలు జెరుసలంను ముట్టడించి ఓడించాయి. అయితే ఈ వచనం ఇంకా నెరవేరలేదు. దేశాలన్నీ కలిసి జెరుసలంపై ఇంకా దండెత్తి రాలేదు. ఆ నగరం వాటికి “బరువైన రాయిగా” ఇంత వరకు ఎప్పుడూ లేదు. ఉదాహరణకు క్రీ.శ. 70లో రోమ్‌వారు దాన్ని ముట్టడించి సమూలంగా నాశనం చేశారు.