Zechariah - జెకర్యా 13 | View All

1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.

“ఆ రోజున”– జెకర్యా 12:3. “అశుద్ధతను కడిగి”– జెకర్యా 3:9; యెహెఙ్కేలు 36:24-29; హెబ్రీయులకు 9:14; 1 యోహాను 1:7, 1 యోహాను 1:9. రాబోయే కాలంలో ఇలా వారి శుద్ధికి ఆధారం రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు చేసిన బలి అర్పణ. ఇప్పుడు ఆ జలధార తెరచి ఉంది. ఎవరైనా అందులో కడుక్కోవచ్చు. అయితే ఇప్పటివరకు మొత్తం మీద యూదులు ఆ అర్పణను ఎప్పుడూ తిరస్కరించారు. ఈ జలధారను వారికోసం తెరవడం అంటే దేవుడు వారిలో ఒక ప్రత్యేకమైన పనిని జరిగిస్తాడు; దాని మూలంగా వారు ఆయనవైపు తిరిగి యేసుప్రభువును, పాపం కోసం ఆయన చేసిన బలిని స్వీకరిస్తారు (జెకర్యా 12:10; రోమీయులకు 11:25-27). అప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆ జలధారలో తమను తాము కడుక్కుంటారు.

2. ఇదే సైన్య ములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్ర హముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రా త్మను దేశములో లేకుండచేతును.

“విగ్రహాలు”– అంటే దేవుని స్థానంలో ఇస్రాయేల్‌వారు ఉంచుకున్నదేదైనా (ఎఫెసీయులకు 5:5 పోల్చి చూడండి). ఇస్రాయేల్‌లో చివరి రోజుల్లో కొందరు ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్న “మృగాన్నీ”, దాని ప్రతిమనూ పూజిస్తారు (ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 13:15). ఆ తరువాత దేవుడు ఇస్రాయేల్‌లో శాశ్వతంగా విగ్రహపూజను లేకుండా చేస్తాడు. “పరవశులై పలికేవారినీ”– యెహోవా తానే వస్తాడు (జెకర్యా 13:3, జెకర్యా 13:9), గనుక పరవశులై పలికేవారి అవసరం ఉండదు. దేవుడు అసలు ప్రవక్త అనే పదవినే రద్దు చేస్తాడు గనుక ఎవరైనా తాను ప్రవక్తనని చెప్పుకుంటే అబద్ధమాడుతున్నాడన్న మాట (వ 3; 1 కోరింథీయులకు 13:8-10).

3. ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.

“పొడవాలి”– ద్వితీయోపదేశకాండము 18:20. అబద్ధ ప్రవక్తలకు ఇస్రాయేల్‌లో ప్రవేశం ఉండదు.

4. ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.
మార్కు 1:6

అబద్ధ ప్రవక్తలు, లేదా తాము నిజ ప్రవక్తలం అనుకునేవాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. వ 6 యొక్క అర్థం అస్పష్టంగా ఉంది, 4,5 వచనాలను దాన్ని కలిపితే ఈ మనిషి 4,5 వచనాల్లో ప్రవక్తనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డవాడైనట్టుంది. అలా కాక 4,5 వచనాల నుంచి 6వ వచనాన్ని వేరుచేసి 7వ వచనానికి జోడిస్తే ఇది క్రీస్తుకు వర్తించే అవకాశం ఉంది.

5. వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.

6. నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.
యోహాను 18:35

7. ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 26:31-56, మార్కు 14:27-50, యోహాను 16:32

మత్తయి 26:31 చూడండి. కాపరి యేసుప్రభువు. గొర్రెలంటే ఆయన శిష్యులు. ఖడ్గమంటే పాపంపై మన స్థానంలో యేసు భరించిన దేవుని తీర్పు, శిక్ష (యెషయా 53:5; 1 పేతురు 2:24; 1 పేతురు 3:18). అయితే “నా చెయ్యి ఉంచుతాను” అనే మాటలూ 8,9 వచనాలూ ఇస్రాయేల్ జాతి అంతటినీ దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నట్లు సూచిస్తున్నాయి. క్రీస్తు శిష్యుల విషయంలో ఇది కొంతవరకు నెరవేరినంతమాత్రాన ఈ వచనం యొక్క పూర్తి అంతరార్థం నెరవేరిందనుకోవడానికి వీలు లేదు.

8. దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.

ఈ వచనాలు బహుశా ఈ యుగాంతానికి సంబంధించినవి. జెకర్యా 14:2-3 పోల్చి చూడండి. భవిష్యత్తులో ఇస్రాయేల్‌కు భయంకరమైన కష్టాలు కలుగుతాయి – దానియేలు 12:1; మత్తయి 24:15-22; యిర్మియా 30:7. అయితే దేవుడు కొంతమందిని ఆ కష్టాల గుండా దాటించి వారిని ఇస్రాయేల్ దేశంలో విమోచించబడినవారుగా ఉంచుతాడు.

9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.
1 పేతురు 1:7Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |