Zechariah - జెకర్యా 6 | View All

1. నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.

ఈ ఆఖరు దర్శనం భూమి అంతటిలో దేవుని ఉద్దేశం నెరవేరడం గురించి. జెకర్యా గ్రంథంలోని ఇతర భాగాలనుండి మనకు తెలిసినట్టుగా దేవుని ప్రజలను బాధించే దేశాలపై తీర్పు తీర్చడం ఈ ఉద్దేశంలో ఒక భాగం (జెకర్యా 1:14-15, జెకర్యా 1:21; జెకర్యా 12:2-4; జెకర్యా 14:2-3). యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు తదితర ప్రవక్తలు దీని గురించి రాశారు. “రెండు పర్వతాల”– జెకర్యా జెరుసలంలో ఉన్నాడు. ఇవి అక్కడి ప్రాముఖ్యమైన పర్వతాలలో రెండై ఉండవచ్చు. ఈ దర్శనంలోని పర్వతాలు కంచువి. దేవుని దృఢ సంకల్పం గురించీ, జెరుసలం విషయంలో ఆయన ఉద్దేశాలు ఎప్పుడూ సమసిపోవు అన్న సత్యం గురించీ ఇది సూచిస్తూ ఉండవచ్చు, లేక ఆయన తీర్పును సూచిస్తూ ఉండవచ్చు (“కంచు”– సంఖ్యాకాండము 21:9; నిర్గమకాండము 27:1-2; ప్రకటన గ్రంథం 1:15). “నాలుగు”– జెకర్యా 1:18. “రథాలు”– కీర్తనల గ్రంథము 68:17; 2 రాజులు 6:17. ఇవి యుద్ధ రథాలై దేవుని ప్రజల సంరక్షణనూ వారి శత్రువుల ఓటమినీ సూచించవచ్చు.

2. మొదటి రథము నకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱ ములు,
ప్రకటన గ్రంథం 6:2-4-5, ప్రకటన గ్రంథం 19:11

జెకర్యా 1:8 పోల్చి చూడండి. వేరువేరు రంగులు వేరువేరు తీర్పులను సూచిస్తూ ఉండవచ్చు.

3. మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.
ప్రకటన గ్రంథం 6:2-4-5, ప్రకటన గ్రంథం 19:11

4. నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా

5. అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.
ప్రకటన గ్రంథం 7:1

నాలుగు రథాలు నాలుగు ఆత్మలు (లేక గాలులు ఈ రెండు అర్థాలను ఇచ్చే హీబ్రూ పదం ఒక్కటే). ఇక్కడ ఇవి దేవదూతలు లేక పరలోక అధికారులు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం 7:1 పోల్చి చూడండి.

6. నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.
ప్రకటన గ్రంథం 6:2-4-5, ప్రకటన గ్రంథం 19:11

ఎర్రని గుర్రాలు పూన్చిన రథం ఎక్కడికీ వెళ్ళినట్టు చెప్పలేదు. అది జెరుసలంలోనే నిలిచిపోయిందేమో. ఈ యుగాంతంలో అక్కడ జరగనున్న మహా తీర్పుకు ఇది సూచనేమో.

7. బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోక మందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.

“లోకమంతటా”– ఈ దర్శనం లోకమంతటికీ సంబంధించిన దన్నమాట. “ఆత్రపడుతూ”– లోకంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి.

8. అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము; అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.

ఇస్రాయేల్ దేశం పైకి దాడులు తరచుగా ఉత్తర దిక్కునుండే వచ్చాయి. చివరి కాలంలో అంతిమ మహా దాడి అటునుండే వస్తుంది (యెహెఙ్కేలు 38:1-9, యెహెఙ్కేలు 38:15; యెహెఙ్కేలు 39:2). ఈ ఉత్తర సైన్యాలపై తీర్పు మూలంగా దేవుని కోపం విడుదల అయి, రేపబడిన ఆయన ఆత్మకు విశ్రాంతి కలుగుతుందని దీని అర్థం కావచ్చు.

9. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

“నాకు”– జెకర్యా 1:1.

10. చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి

“బంగారాలు”– ఎజ్రా 6:5.

11. వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి

“కిరీటం”– ఇస్రాయేల్‌లో ప్రముఖ యాజులు పాగాలే తప్ప కిరీటాలు ధరించలేదు (జెకర్యా 3:5; నిర్గమకాండము 28:4). రాజులు మాత్రమే కిరీటాలు ధరించేవారు. దావీదు తరువాత యూదాలోని రాజులంతా యూదా గోత్రానికి చెందినవారే. యాజులు లేవీగోత్రానికి చెందినవారు. యెహోషువ తలపై కిరీటం పెట్టడంలో భవిష్యత్ సూచకమైన గొప్ప అంతరార్థం ఉంది (జెకర్యా 3:8 పోల్చి చూడండి). యెహోషువ అనే పేరుకున్న అర్థం కూడా విశేషమైనది – “యెహోవా రక్షిస్తాడు”. యెహోషువ అనే పేరు గ్రీకు భాషలోకి యేసుగా వచ్చింది. రెండు పేర్లు ఒకటే. అర్థం ఒకటే.

12. అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
హెబ్రీయులకు 10:21

“కొమ్మ”– ఆ “కొమ్మ” యెహోషువ కాదు, యేసే. జెకర్యా 3:8 చూడండి. “యెహోవా ఆలయాన్ని”– యేసు రాతితో కలపతో ఏ ఆలయాన్ని నిర్మించడు గాని అంతకన్నా శ్రేష్ఠమైన దాన్ని నిర్మిస్తాడు. మత్తయి 16:19; ఎఫెసీయులకు 2:21-22 చూడండి.

13. అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.

“సింహాసనం మీద... పరిపాలన”– కీర్తనల గ్రంథము 89:35-37; యెషయా 9:7; యిర్మియా 33:19-22; యెహెఙ్కేలు 43:7; లూకా 1:32; ప్రకటన గ్రంథం 22:3. “ఈ రెంటికీ”– యూదాలో వేరువేరుగా ఉన్న యాజి, రాజు పదవులు రెండూ యేసుప్రభువులో ఏకం అయ్యాయి. తన ప్రజలను కేవలం పరిపాలించడమే కాదు. మధ్యవర్తిగా ప్రముఖయాజిగా వారి విషయం దేవునికి విజ్ఞాపన చేస్తాడు (రోమీయులకు 8:34; 1 తిమోతికి 2:5; హెబ్రీయులకు 7:24-27; 1 యోహాను 2:1-2).

14. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాప కార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.

15. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.

“ఆలయాన్ని”– ఇది కూడా ఇప్పుడు కట్టుబడుతూ ఉన్న ఆధ్యాత్మిక ఆలయం గురించి – “దూరంగా ఉన్నవారు” క్రీస్తు చెంతకు వచ్చి ఆ పనిలో చేయి కలపడం గురించి రాసిన మాటలు కావచ్చు (యోహాను 10:16; అపో. కార్యములు 2:39; ఎఫెసీయులకు 2:13). లేక యెహె 40-43 అధ్యాయాల్లో వివరించబడిన ఆలయ నిర్మాణం గురించి ఈ మాటలు చెప్పివుండవచ్చు.Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |