Malachi - మలాకీ 1 | View All

1. ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుక బడిన యెహోవా వాక్కు.

“దేవోక్తి”– సంఖ్యాకాండము 23:7; యెషయా 13:1; జెకర్యా 9:1. “మలాకీ ద్వారా”– హెబ్రీయులకు 1:1; 2 పేతురు 1:21. మలాకీ అనే పేరుకు అర్థం “నా వార్తాహరుడు.”

2. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరుఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.
రోమీయులకు 9:13

“ప్రేమతో చూశాను”– ద్వితీయోపదేశకాండము 4:37; ద్వితీయోపదేశకాండము 7:7-8; 1 రాజులు 10:9; కీర్తనల గ్రంథము 44:3; యిర్మియా 31:3. రోమీయులకు 5:8; 1 యోహాను 4:8-10 పోల్చి చూడండి. “నీవెలా...”– దేవుడు ఇస్రాయేల్ పట్ల తన ప్రేమను అసంఖ్యాకమైన రీతుల్లో చూపించాడు. అయితే దాన్ని చూడ్డానికి వారికిష్టం లేదు. వారు కూడా ఈనాటి మనుషుల్లాంటి వారే నన్నమాట. “మీరు...అడుగుతున్నారు”– వ 6,7; మలాకీ 2:14, మలాకీ 2:17; మలాకీ 3:7-8, మలాకీ 3:13. ప్రజలు తమ అపనమ్మకం వల్ల దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన ప్రతి మాటనూ ప్రశ్నించారు. పతనమైన, పాపిష్టి మానవుల విధానం ఎప్పుడూ ఇంతే. “ఏశావు”– ఆదికాండము 25:24-26. “యాకోబును ప్రేమించాను”– రోమీయులకు 9:13. ఇక్కడ యాకోబు అంటే ఇస్రాయేల్ జాతి అని అర్థం.

3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.

ఏశావు సంతతివారు దేవుని పట్ల, ఆయన ప్రజలైన ఇస్రాయేల్‌పట్ల ప్రవర్తించిన తీరు వారిని దేవుని అసహ్యానికి పాత్రులుగా చేసింది. ఆమోసు 1:11; ఓబద్యా మొ।। చూడండి. “ద్వేషించాను”– కీర్తనల గ్రంథము 5:5-6; లేవీయకాండము 26:30; సామెతలు 3:32; సామెతలు 11:20; సామెతలు 16:5 పోల్చి చూడండి. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తాడు – యోహాను 3:16; 1 యోహాను 4:8. అంటే ప్రతి వ్యక్తికీ ఆధ్యాత్మికమైన మేలు కలగాలని కోరుతాడు. లోకమంతటి పట్లా ఆయనకు కనికరం, దయ ఉన్నాయి. ఎదోంవారిలో సహా ఎవరైనా సరే తన పాపాలకు పశ్చాత్తాపపడి దేవునివైపుకు తిరిగితే, ఆయన అతణ్ణి రక్షించి తన ప్రియ సంతానంగా చేసుకుంటాడు (యోహాను 1:12-13; 1 తిమోతికి 2:4; ప్రకటన గ్రంథం 22:17). అయితే మనుషులు ఇలా చెయ్యకపోతే ఆయన కోపం వారిపై నిలిచి ఉంటుంది – యోహాను 3:36; రోమీయులకు 1:18. ఆయన వారి విధానాలను, స్వభావాన్ని అసహ్యించుకుంటాడు. వారి పాపాలను బట్టి తీర్పుతీర్చి శిక్ష విధిస్తాడు. “ద్వేషించడం” అనే మాటకు బైబిల్లో అప్పుడప్పుడు “తక్కువగా ప్రేమించడం” అనే అర్థం కూడా ఉంది (లూకా 14:26; మత్తయి 10:37). పాత ఒడంబడిక రోజుల్లో దేవునికి ఇస్రాయేల్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉందనీ ఇప్పుడు క్రీస్తు విశ్వాసుల పట్ల ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందనీ బైబిలు వెల్లడిస్తున్నది. విశ్వాసులకు దేవునితో ఒక విశిష్టమైన కుటుంబ సంబంధం ఉంది. తండ్రివలె దేవుడు వారిని ప్రేమిస్తాడు (యోహాను 14:21; యోహాను 17:6; 1 యోహాను 3:1-2). “నక్కలపాలు”– ఏశావు సంతతిని వారి దేశం నుంచి వెళ్ళగొట్టడం మూలంగా దేవుడు వారిపట్ల తన ద్వేషాన్ని కనుపరిచాడు. ఏశావు (ఎదోం) గురించి ఇతర ప్రవక్తలు చెప్పిన సంగతులు చూడండి – యెషయా 34:5-15; యిర్మియా 49:7-22; యెహెఙ్కేలు 25:12-14; యెహెఙ్కేలు 35:1-15.

4. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.

“మళ్ళీ కట్టుకొందాం”– గర్వం, ఆత్మనిబ్బరం, దేవుని సంకల్పాల విషయంలో అజ్ఞానం ఈ మాటల్లో కనిపిస్తున్నాయి. “సేనల ప్రభువు యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్. “పడద్రోస్తాను”– యెషయా 34:11; యిర్మియా 49:16. “దుర్మార్గుల దేశం”– ఏశావు సంతానం చాలా దుర్మార్గులని దీనివల్ల తెలుస్తున్నది. ఇది దేవుని ద్వేషానికి గురి కావడానికి తగిన కారణమే. “తీవ్ర కోపానికి”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18.

5. కన్ను లార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.

“మీరు”– ఇస్రాయేల్‌ప్రజలు. లోకమంతటిపైనా దేవుడు మహా రాజన్న సంగతిని (కీర్తనల గ్రంథము 47:2) వారిలో కొంతమంది సందేహిస్తున్నారా? తానే మహారాజునని దేవుని చర్యలు నిరూపిస్తున్నాయి.

6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
లూకా 6:46

ఈ వచనంనుంచి మలాకీ 2:9 వరకు దేవుడు ఇస్రాయేల్‌లోని యాజులను గద్దిస్తున్నాడు. “తండ్రిని...యజమాన్ని”– నిర్గమకాండము 20:12; లేవీయకాండము 20:9; యెషయా 1:2-3; యెషయా 63:16; యెషయా 64:8. “యాజులారా”– నిర్గమకాండము 28:1 నోట్. “అలక్ష్యం”– లేవీయకాండము 22:9; సంఖ్యాకాండము 14:11; సంఖ్యాకాండము 16:30; 1 సమూయేలు 2:17; సామెతలు 14:31; హోషేయ 12:14; రోమీయులకు 2:4. మనుషులు కేవలం తమ మాటల ద్వారానే గాక, దేవుని వాక్కు పట్ల వారి అభిప్రాయం మూలంగా, వారు చేసే పనులు, చేయకుండా ఉండే పనుల మూలంగా దేవుని పట్ల తమ నిజమైన మనస్తత్వాన్ని బయట పెడతారు.

7. నా బలి పీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా
1 కోరింథీయులకు 10:21

“ఆహారాన్ని”– లేవీయకాండము 3:11, లేవీయకాండము 3:16; లేవీయకాండము 21:6, లేవీయకాండము 21:8. దేవునికి ఆకలి వేయదు. మనుషుల హస్తాల నుంచి ఆయనేమీ కోరడు – కీర్తనల గ్రంథము 50:9-14; అపో. కార్యములు 17:24-25. అయితే ఆహారం శరీరాన్ని తృప్తి పరచినట్టే ప్రేమతో తన ప్రజలు ఇచ్చిన పవిత్ర అర్పణలు దేవుని హృదయాన్ని సంతృప్తి పరుస్తాయి. “అపవిత్రపరిచాం?”– వారు తెచ్చిన అర్పణలు దేవుని వాక్కును అనుసరించినవి కాదు (ద్వితీయోపదేశకాండము 15:21) గనుక అవి అపవిత్రాలు. లేవీయకాండము 1:2 దగ్గర అర్పణల గురించి నోట్ చూడండి. గుడ్డి, కుంటి, అంగవైకల్యం గల జంతువులను వారు ఎందుకు తెస్తున్నారు? మంచివాటిని తమకోసం ఉంచేసుకొని, చెడ్డవాటిని దేవునికి ఇవ్వజూస్తున్నారు. ఈ విధంగా వారు దేవునిపట్ల తమ తిరస్కార భావాన్ని చూపుతున్నారు. ఈనాడు కూడా అనేకమంది ఇలానే చేస్తున్నారు. అయినా దేవుని దీవెనలు తమకు కలగాలని చూస్తున్నారు. అవి రాకపోతే ఆయనపై సణుగుతున్నారు.

8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

“అధికారి”– వారు దేవుని పట్ల ప్రవర్తించిన విధంగా మనుషుల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిపట్ల కలలో కూడా ప్రవర్తించరు. “ఇవ్వడం” గురించి 2 కోరింథీయులకు 9:15 లో నోట్స్ రిఫరెన్సులు చూడండి.

9. దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

10. మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“ద్వారాలను మూసివేస్తే”– ఆత్మలో, సత్యంలో చెయ్యని ఆరాధన కంటే (యోహాను 4:23-24) అసలు ఆరాధించకపోవడమే మంచిది. దేవునికి అప్రతిష్ఠ కలిగే ఆరాధన జరుగుతున్న స్థలాలలో మనుషులు అర్థం లేని ఆచారాలతో ఆత్మవంచన చేసుకోవడం కంటే అలాంటివాటిని మూసివేయడమే మేలు. యెషయా 1:11-17 పోల్చి చూడండి.

11. తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మత్తయి 8:11, లూకా 13:29, 2 థెస్సలొనీకయులకు 1:12, ప్రకటన గ్రంథం 15:4

12. అయితే­యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు
1 కోరింథీయులకు 10:21

భూమిపై ఉన్న జనాలన్నిటిలో నిజ దేవుడు గొప్పవాడుగా ఎంచబడుతాడు. అయితే ఆయన స్వంత ప్రజలే ఆయన్ను అనామకుడిగా చూశారు. వారికి ఆయన్ను ఆరాధించడం విసుగు కలిగేదిగా, వ్యర్థమైనదిగా, తిరస్కారానికి యోగ్యమైనదిగా కనిపిస్తున్నది (వ 7,8). ఇలా ఆలోచిస్తూ, ఇలా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు వారి తరువాత ఎంతోమంది ఉన్నారు.

13. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చు చున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

14. నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

వీళ్ళు దేవుని దీవెనలు పొందాలని చూస్తున్నారా? దేవుడే వారిని శపిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 27:15-26; గలతియులకు 3:10; హెబ్రీయులకు 6:8 పోల్చి చూడండి. “భయం”– ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7. “వంచకుడు”– దేవునికి ఇవ్వవలసినది ఇవ్వక, తమకున్న శ్రేష్ఠమైనవి అర్పించక ఆయన్ను వారు వంచింపజూస్తున్నారు. ఈనాడు కూడా ఇదే జరుగుతున్నది. యేసుప్రభువుకు మనం ఇవ్వగలిగిన శ్రేష్ఠమైనది కావాలి, నీచమైనది కాదు.Shortcut Links
మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |