Numbers - సంఖ్యాకాండము 12 | View All

1. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.

మోషే మొదటి భార్య మిద్యాను జాతికి చెందిన సిప్పోరా (నిర్గమకాండము 2:15-16 నిర్గమకాండము 2:21 నిర్గమకాండము 2:1). ఈ వచనాన్ని బట్టి ఆమె మరణించిందనీ మోషే మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడనీ కనిపిస్తున్నది. ఈ సారి ఇతియోపియా ప్రాంతానికి చెందిన స్త్రీని చేసుకున్నాడు. మోషేను నిరసిస్తూ మాట్లాడడానికి ఇదే అదనుగా భావించారు అతని అన్న, అక్క. అయితే 2వ వచనం ప్రకారం వారికి మోషేకు లొంగి ఉండడం ఇష్టం లేనట్టూ, అతని నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్టూ స్పష్టమౌతున్నది. దేవుడు వారికిచ్చిన పదవులతో వారు తృప్తిపడి ఊరుకోలేదు. ఇది భయంకరమైన పాపం (సంఖ్యాకాండము 16:9-11 నోట్‌). తన సంఘంలో దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో దాన్ని అంగీకరించడం మనం నేర్చుకోవాలి. దెబ్బలాటలూ, పదవులకోసం, పేరుప్రతిష్ఠలకోసం ప్రాకులాటలూ ఇది క్రీస్తు నేర్పిన మార్గం కాదు (కీర్తనల గ్రంథము 75:6-7 మత్తయి 20:25-28 మత్తయి 23:11-12 లూకా 17:10). మనం ప్రాకులాడవలసినది ఉన్నత పదవులకోసం కాదు గాని దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలోనే నమ్మకంగా ఆసక్తితో పని చెయ్యడం కోసమే. సంఖ్యాకాండము 16:1-2 నోట్.

2. వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా

3. యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.

బైబిల్లో దేవుని ప్రజల మంచి లక్షణాలు, వారి పాపాలూ కూడా రాసి ఉన్నాయి. మోషే తన తోబుట్టువుల దూషణ తిరస్కారాలూ, తిరుగుబాటు ధోరణులూ వినయంతో సహించాడు. తనను తాను సమర్ధించుకోవడానికి ప్రయత్నించలేదు. తన పరువు మర్యాదలు మంట గలుస్తున్నాయని చూసుకోలేదు. ఈ విషయంలో అతని ప్రవర్తన మనందరికీ గొప్ప ఆదర్శం. ఇతనికంటే క్రీస్తు మరి ఎక్కువగా మనకు ఆదర్శం (యెషయా 53:7 హెబ్రీయులకు 12:2-3 1 పేతురు 2:21-23).

4. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా

దేవుడు కొన్ని సార్లు తన సేవకులను వ్యతిరేకత, తిరుగుబాటు, నీలాపనిందలవల్ల దీర్ఘకాలం బాధపడనిస్తాడు. ఇక్కడైతే ఈ వ్యవహారాన్ని తక్షణమే పరిష్కరించి మోషే నిర్దోషత్వాన్ని నిరూపించవలసిన అవసరం ఉంది. ఇలా చెయ్యడం వల్ల ఇస్రాయేల్ వారు ఓ గుణపాఠం నేర్చుకోవాలి.

5. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.

6. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.

ఆ రోజుల్లో దేవుడు తన సత్యాన్ని వెల్లడించే పద్ధతులలో ఇది ఒకటి. తరచుగా స్వప్నాలు, దర్శనాల ద్వారా ఆయన మాట్లాడేవాడు. “దర్శనం” - లేక దృశ్యం – ఆదికాండము 15:1 యెషయా 1:1 యెహెఙ్కేలు 8:4 దానియేలు 2:19 దానియేలు 7:2 నహూము 1:1 అపో. కార్యములు 9:10 అపో. కార్యములు 10:3 అపో. కార్యములు 16:9 అపో. కార్యములు 18:9 ప్రకటన గ్రంథం 9:17. “కల”– ఆదికాండము 28:12 ఆదికాండము 35:5 1 రాజులు 3:5 దానియేలు 7:1 యోవేలు 2:28 మత్తయి 1:20. ప్రస్తుతం మనకు దేవుని సత్యం బైబిలు ద్వారా సంపూర్ణంగా వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు స్వప్నాలు, దృశ్యాలతో అంతగా పనిలేదు. అయినా ఈ రోజుల్లో కూడా దేవునికి ఇష్టమైనప్పుడెల్లా వీటి ద్వారా కూడా ఆయన మాట్లాడవచ్చు. అయితే ఒక విషయం మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. బైబిల్లో తాను వెల్లడించిన సత్యానికి ఆయన దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా దృశ్యాల ద్వారా ఏమీ కలపడు. ఆ సత్యానికి వ్యతిరేకమైనవేమీ తెలపడు. స్వప్నాల గురించి ఆదికాండము 15:12 ద్వితీయోపదేశకాండము 13:1 చూడండి.

8. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
2,Joh,1,12, 3,Joh,1,14

“ముఖాముఖిగా”– ద్వితీయోపదేశకాండము 34:10.

9. యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.

10. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.

ద్వితీయోపదేశకాండము 24:9 లేవీయకాండము 13:1-2 లేవీయకాండము 13:47 లేవీయకాండము 14:34 నోట్ అహరోనుకు శిక్ష వచ్చినట్టు కనిపించడం లేదు. బహుశా దీనికంతటికి మూలకారణం మిర్యాం అయివుండవచ్చు. ఒకవేళ అహరోనుకు వచ్చిన శిక్ష తన సోదరిని అలాంటి స్థితిలో చూడవలసి రావడం, అందుకు తాను కూడా కొంతవరకు బాధ్యుడినన్న ఆవేదన కావచ్చు.

11. అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాప మును మామీద మోపవద్దు.

అహరోనుకు కలిగిన పరితాపం, పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తున్నాయి. మోషేను స్వామీ అని పిలుస్తున్నాడు. ఇక ముందు ఎన్నడూ అహరోను తిరుగుబాటు చేసినట్టు కనిపించదు.

12. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా

13. మోషే యెలుగెత్తిదేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను.

14. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.

పాపక్షమాపణ దొరికినా, ఆ పాప ఫలితాలను కొంతవరకు భరించవలసి రావడం న్యాయమే. సంఖ్యాకాండము 14:22-23 నోట్.

15. కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.

16. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |