సంఖ్యాకాండము 11:4-6 సంఖ్యాకాండము 14:2-3 సంఖ్యాకాండము 16:41 సంఖ్యాకాండము 20:2-5. ఎడారిలో ఇస్రాయేల్ ప్రజలు తమకు ఎదురైన ఇక్కట్ల గురించీ, వారి ఆహారం గురించీ, వారి శత్రువుల బలం గురించీ, దేవుని తీర్పుల గురించీ, ఎడారిలోని స్థితిగతుల గురించీ సణుక్కొన్నారు. అంటే దేవుని నాయకత్వం, ఆయన వారిని పోషిస్తున్న విధానం, ఆయన వారికోసం ఎన్నుకొన్న స్థలం, నియమించిన నాయకుల గురించి మూలిగారన్న మాట. దేవుణ్ణి శంకించడం, ఆయన మీద సణుక్కోవడం ఘోర పాపం.