Numbers - సంఖ్యాకాండము 28 | View All

1. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. yehovaa mosheku eelaagu selavicchenu

2. నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.

2. neevu ishraayeleeyulaku eelaagu aagnaapinchumu naaku suvaasana kalugutakai meeru homaroopamulugaa naaku arpinchu aahaaramunu niyaamaka kaalamuna naayoddhaku techutaku jaagratthapadavalenu.

3. మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుముమీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోష మైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱె పిల్లలను అర్పింప వలెను.

3. mariyu neevu vaarikeelaagu aagnaapinchumumeeru yehovaaku nityamaina dahanabali roopamugaa prathi dinamu nirdosha maina yedaadhivagu rendu maga gorra pillalanu arpimpa valenu.

4. వాటిలో ఒక గొఱ్ఱెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

4. vaatilo oka gorrapillanu udayamandu arpinchi saayankaalamandu rendavadaanini arpimpavalenu.

5. దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.

5. danchitheesina moodu pallalonidi paavu noonethoo kalupa badina thoomedu pindilo padhiyavavanthu naivedyamu cheyavalenu.

6. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్య మైన దహనబలి.

6. adhi yehovaaku impaina suvaasanagala homamugaa seenaayikondameeda niyamimpabadina nitya maina dahanabali.

7. ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవల సిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్య మును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.

7. aa modati gorrapillathoo arpimpavala sina paanaarpanamu muppaavu; parishuddhasthalamulo madya munu yehovaaku paanaarpanamugaa poyimpavalenu.

8. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించి నట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.

8. udaya naivedyamunu daani paanaarpanamunu arpinchi natlu yehovaaku impaina suvaasanagala homamugaa aa rendava gorrapillanu saayankaalamandu arpimpavalenu.

9. విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.
మత్తయి 12:5

9. vishraanthidinamuna nirdoshamaina yedaadhivagu rendu gorrapillalanu naivedyaroopamugaanu, daani paanaarpanamu gaanu noonethoo kalapabadina thoomedu pindilo rendu padhiyavavanthulanu arpinvavalenu.

10. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
మత్తయి 12:5

10. nityamaina dahana baliyu daani paanaarpanamunu gaaka yidi prathi vishraanthi dinamuna cheyavalasina dahanabali.

11. నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

11. nelanelaku modatidinamuna yehovaaku dahana bali arpinchavalenu. Rendu kodedoodalanu oka pottelunu nirdoshamaina yedaadhivagu edu gorrapillalanu vaatilo prathi kodedoodathoonu,

12. నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను.

12. noonethoo kalupabadina thoomedu pindilo moodu padhiyavavanthulanu naivedyamugaanu okkokka potteluthoonu, noonethoo kalapabadi thoomedu pindilo rendu padhiyava vanthulanu naivedyamugaanu, okkokka gorrapillathoo noonethoo kalapabadina thoomedu pindilo noka padhiyavavanthunu naivedyamugaanu cheya valenu.

13. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి.

13. adhi yehovaaku impaina suvaasanagala dahana bali.

14. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱె పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

14. vaati paanaarpanamulu okkokka kodethoo padinnara draakshaarasamunu potteluthoo padiyu gorra pillathoo muppaavunu undavalenu. Idi samvatsaramulo maasa maasamunaku jarugavalasina dahanabali.

15. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింప వలెను.

15. nityamaina dahanabaliyu daani paanaarpanamunu gaaka yoka meka pillanu paapaparihaaraarthabaligaa yehovaaku arpimpa valenu.

16. మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.

16. modati nela padunaalugava dinamu yehovaaku paskaapanduga.

17. ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తిన వలెను.

17. aa nela padunayidava dinamu panduga jarugunu. edu dinamulu pongani bhakshyamulane thina valenu.

18. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయ కూడదు

18. modati dinamuna parishuddha sanghamu koodavalenu. Andulo meeru jeevanopaadhiyaina panulemiyu cheya koodadu

19. అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

19. ayithe yehovaaku dahanabaligaa meeru rendu kodedoodalanu oka pottelunu edaadhivagu edu maga gorrapillalanu arpimpavalenu. Avi meeku kaligina vaatilo nirdoshamainavai yundavalenu

20. వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.

20. vaati naive dyamu noonethoo kalapabadina godhumala pindi.

21. ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టే లుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱె పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

21. okkokka kodethoo thoomulo moodu padhiyavavanthulanu, potte luthoo rendu padhiyava vanthulanu aa yedu gorrapillalalo okkokka gorra pillathoo okkokka padhiyavavanthunu

22. మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.

22. meeku praayashchitthamu kalugutakai paapaparihaaraarthabaligaa oka mekanu arpimpavalenu.

23. ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.

23. udayamuna meeru arpinchu nitya maina dahanabali gaaka veetini meeru arpimpavalenu.

24. అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్ప ణమును గాక దానిని అర్పించవలెను.

24. atle aa yedu dinamulalo prathidinamu yehovaaku impaina suvaasanagala homadravyamunu aahaaramugaa arpinchavalenu. Nityamaina dahanabaliyu daani paanaarpa namunu gaaka daanini arpinchavalenu.

25. ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.

25. edava dinamuna parishuddhasanghamu koodavalenu. aa dinamuna meeru jeevano paadhiyaina panulemiyu cheyakoodadu.

26. మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

26. mariyu prathama phalamulanu arpinchudinamuna, anagaa vaaramula pandugadhinamuna meeru yehovaaku krottha pantalo naivedyamu techunappudu meeru parishuddha sanghamugaa koodavalenu. Naadu meeru jeevanopaadhiyaina panulemiyu cheyakoodadu.

27. యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

27. yehovaaku impaina suvaasanagala dahanabaligaa meeru rendu kode doodalanu oka pottelunu edaadhivaina yedu maga gorra pillalanu vaatiki naivedyamugaa prathi kodedoodathoonu

28. నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

28. noonethoo kalupabadina thoomedu pindilo moodu padhiyava vanthulanu, prathi potteluthoo rendu padhiyavavanthulanu

29. ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

29. aa yedu gorrapillalalo okkokka pillathoo okkokka padhiyavavanthunu

30. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయ బడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

30. mee nimitthamu praayashchitthamu cheya badutakai yoka mekapillanu arpimpavalenu.

31. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

31. nityamaina dahanabaliyu daani naivedyamunu gaaka vaatini vaati paanaarpanamulanu arpimpavalenu. Avi nirdoshamulugaa nundavalenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
అర్పణలు, రోజువారీ త్యాగం. (1-8) 
దేవుడు తన పట్ల తమ భక్తిని చూపించడానికి త్యాగాలు చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు గుర్తు చేశాడు. ఇది తమ శత్రువులతో పోరాడుతున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకునే కొత్త వ్యక్తుల సమూహం కోసం. వారు ప్రతిరోజూ ప్రార్థించాలి మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు అలా చేయడానికి వారి ఉత్తమమైన వాటిని ఉపయోగించాలి. వారు పోసిన ప్రత్యేక ద్రాక్షారసం యేసు త్యాగానికి మరియు వారి విశ్వాసం కోసం తమ ప్రాణాలను అర్పించిన ధైర్య విశ్వాసుల త్యాగాలకు చిహ్నం. Phi 2:17 

సబ్బాత్ మరియు అమావాస్యలలో నైవేద్యము. (9-15) 
సబ్బాత్ అని పిలువబడే ప్రత్యేక రోజున, మనం ప్రతిరోజూ అందించే సాధారణ రెండిటికి అదనంగా రెండు అదనపు గొర్రెపిల్లలను అందించాలి. సబ్బాత్ రోజులలో మరింత అంకితభావంతో ఉండాలని ఇది మనకు గుర్తు చేయడమే, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన రోజు మరియు ఆ రోజు మనం చేసే ప్రత్యేక పనులపై దృష్టి పెట్టాలి. సబ్బాత్ రోజున మనకు ప్రత్యేక విశ్రాంతి కూడా ఉంది, తద్వారా మనం చేయవలసిన ప్రత్యేక పనులను చేయడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అమావాస్య రోజుల్లో, మన జీవితంలో మనకు లభించిన అన్ని మంచి విషయాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతాము. మనకు ప్రత్యేకమైన దయ మరియు సంతోషాన్ని తెచ్చే యేసు యొక్క ప్రత్యేక బహుమతి కోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం కూడా గుర్తుంచుకోవాలి. అమావాస్య రోజుల్లో మనం పూజించే విధానం, దేవుడు మనకు ఇచ్చిన అన్ని మంచివాటిని జరుపుకోవడానికి చర్చిలో ఎలా ఆరాధిస్తామో అలాగే ఉంటుంది. యెషయా 66:26 చంద్రుడు రాత్రిపూట ప్రకాశించడానికి సూర్యుని నుండి తన కాంతిని పొందుతాడు. అదే విధంగా, చర్చి యేసు నుండి దాని వెలుగును పొందుతుంది, అతను దానిని బలంగా మరియు మెరుగ్గా చేస్తాడు, ముఖ్యంగా ప్రజలు అతని బోధనలను అనుసరించినప్పుడు. 

పాస్ ఓవర్ వద్ద మరియు మొదటి ఫలాల రోజున నైవేద్యాలు. (16-31)
యేసు త్యాగం ఎంత శక్తివంతమైనదో, అది మనకు ఎంత అవసరమో మనం గుర్తుంచుకోవాలని ఈ అధ్యాయం చెబుతోంది. మనం బిజీగా ఉన్నప్పటికీ లేదా విషయాలు బాగా జరుగుతున్నప్పటికీ, మన మతపరమైన ఆచారాల కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెచ్చించాలి. మన తప్పులకి పశ్చాత్తాపపడాలి, యేసుపై నమ్మకం ఉంచాలి మరియు ఆయనను ప్రేమించాలి. ఇది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి వ్యక్తులుగా ఉండటానికి సహాయపడుతుంది. మనం ఈ పనులు చేయకపోతే, దేవుడు మన ఆరాధనతో సంతోషించడు. కానీ యేసు మనకు అవసరమైన దేనికైనా సహాయం చేయగలడు, అది ఏమైనప్పటికీ.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |