Numbers - సంఖ్యాకాండము 28 | View All

1. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:

2. నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.

2. “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వవలెను. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వవలెనని వారితో చెప్పుము. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పుము. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం.

3. మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుముమీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోష మైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱ పిల్లలను అర్పింప వలెను.

3. వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు.

4. వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

4. ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొర్రెపిల్లను సాయం కాలమందు అర్పించాలి.

5. దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.

5. మరియు ఒక పావు ఒలీవనూనెతో కలుపబడ్డ రెండుపావుల మంచి పిండి ధాన్యార్పణగా పెట్టాలి.”

6. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్య మైన దహనబలి.

6. సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది.

7. ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవల సిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్య మును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.

7. దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ కూడ అర్పించాలి. ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు ద్రాక్షారసం అర్పించాలి. పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యోహోవాకు కానుక.

8. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించి నట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.

8. రెండో గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.”

9. విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.
మత్తయి 12:5

9. “విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి.

10. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
మత్తయి 12:5

10. విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ పానార్పణం గాక ఇది అదనం.”

11. నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

11. “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు.

12. నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను.

12. మరియు ఒలీవ నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె దూడతోబాటు అర్పించాలి. అలాగే, ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలుతో బాటు ధాన్యార్పణగా అర్పించాలి.

13. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి.

13. ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో గొర్రెపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్పించాలి. ఇది యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి.

14. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱ పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

14. ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి.

15. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింప వలెను.

15. ప్రతి రోజూ అర్పించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను యెహోవాకు మీరు అర్పించాలి. ఆ మేక పాప పరిహారార్థ బలి.

16. మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.

16. “మొదటి నెల (నిసాను) పదునాలుగవ రోజున పస్కా.

17. ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తిన వలెను.

17. పులియని రొట్టెల పండుగ అదే నెల పది హేనో రోజున ప్రారంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొట్టెలు మాత్రమే మీరు తినవచ్చును.

18. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయ కూడదు

18. ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభజరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.

19. అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

19. మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు.

20. వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.

20. [This verse may not be a part of this translation]

21. ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టే లుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱ పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

21. [This verse may not be a part of this translation]

22. మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.

22. ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది.

23. ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.

23. ప్రతి ఉదయం మీరు అర్పించే దహన బలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి.

24. అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్ప ణమును గాక దానిని అర్పించవలెను.

24. “అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార అర్పణలు అర్పించాలి. ప్రతి రోజూ దానిని హోమాంగా మీరు అర్పించాలి. ఈ అర్పణ యెహోవాకు ఇష్టమైన సునాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను క్రమంగా అర్పించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకు) మీరు అర్పించాలి.

25. ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.

25. “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయరు.

26. మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

26. “ప్రథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహోవాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.

27. యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

27. మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి.

28. నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

28. ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదోవంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదోవంతులు

29. ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

29. ఒక్కో గొర్రె పిల్లతో ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.

30. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయ బడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

30. మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడ మీరు బలి ఇవ్వవలెను.

31. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

31. రోజువారీ దహనబలులు, ధాన్యార్పణాలు గాక వీటిని మీరు అర్పించాలి. జంతువులు అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. పానార్పణం పరిశుభ్రమయినదిగా ఉండాలి.Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |