రూబేను, గాదు గోత్రాలవారు దేవుడు ఇస్తానన్న దేశంలోకి వెళ్ళి దేవుడు వారికోసం ఏర్పరచిన స్థానాన్ని స్వీకరించకుండా తమ స్వంత నిర్ణయం తీసుకున్నారు. తరువాతి కాలంలో ఇది వీరికి చాలా ఇబ్బందికరంగా అయింది. ఎందుకంటే వీరు ఎన్నుకున్న ప్రదేశానికి గట్టి సరిహద్దులు లేవు. శత్రువుల దాడులకు పదే పదే గురి కావలసి వచ్చేది. ఉత్తరాన సిరియా, తూర్పున అమ్మోను, దక్షిణాన మోయాబు జాతులవారు వీరి పై దాడి చేసి పీడించేవారు. మనం ఎక్కడ, ఏ స్థితిలో ఉండాలో దాన్ని నిర్ణయించే బాధ్యత దేవునికే వదిలేయ్యడం ఎంతైనా క్షేమకరం (కీర్తనల గ్రంథము 47:4).