Numbers - సంఖ్యాకాండము 6 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.

2. పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించు కొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.

నాజీర్ అనే పదం హీబ్రూ భాషలో మొక్కుబడి చేసుకోవడం లేక ప్రతిష్ఠించుకోవడం అనే అర్థాన్నిచ్చే పదంలోనుంచి వచ్చింది. నాజీర్ అంటే ఇంత కాలం అని నిర్ణయించుకొని తమను తాము దేవునికి పూర్తిగా సమర్పించుకునే మగవారు, ఆడవారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జీవితాంతం నాజీరులుగా దేవునికి అంకితం చెయ్యవచ్చు. సమ్సోను విషయంలో ఇలా జరిగింది (న్యాయాధిపతులు 13:5). బైబిలంతటిలో నాజీర్ అని ప్రత్యేకించి చెప్పబడింది సమ్సోను విషయంలోనే. హన్నా చేసిన మొక్కుబడిని బట్టి సమూయేలు కూడా నాజీర్ అయి ఉండవచ్చు (1 సమూయేలు 1:11). మొత్తానికి జీవిత కాలమంతటికీ సమూయేలు దేవునికోసం అంకితం అయినవాడు (1 సమూయేలు 1:27-28). ఇంకా కొందరు నాజీరులు ఉన్నారు గాని వారి పేర్లు బైబిల్లో లేవు (ఆమోసు 2:11-12). బాప్తిసమిచ్చే యోహాను ద్రాక్షరసం ముట్టుకోడు అని రాసి ఉంది (లూకా 1:15). దీన్ని బట్టి చూస్తే ఇతను కూడా బహుశా నాజీర్ అయి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో దేవుని పై నమ్మకం ఉంచిన వారందరూ తమను తాము పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి (రోమీయులకు 12:1-2). వారంతా ఆధ్యాత్మిక నాజీరులై ఉండాలి. కానీ ద్రాక్షల పళ్ళు తినకపోవడం, వెంట్రుకలు పెంచుకోవటం మొదలైనవి వీరికి వర్తించవు.

3. ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
లూకా 1:15

ఇతరులు నిరభ్యంతరంగా అనుభవించేవి కొన్ని నాజీర్ అయిన వ్యక్తికి నిషేధం. దేవునికి అంకితం అయిన వ్యక్తి అందరిలాగా జీవించటానికి వీలులేదు. ద్రాక్షరసం జీవితంలో సాధారణమైన ఆనంద సౌకర్యాలకు గుర్తు. ఇతరులు వీటిని అనుభవించవచ్చు (కీర్తనల గ్రంథము 104:15).

4. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.

5. అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
అపో. కార్యములు 21:23-24-2

నాజీర్ అయిన వ్యక్తికి పొడవైన వెంట్రుకలు చిహ్నం (న్యాయాధిపతులు 13:5 న్యాయాధిపతులు 16:7). క్రీస్తురాయబారి పౌలు పురుషుడికి పొడవైన వెంట్రుకలు అవమానకరమనీ, స్త్రీకి అవి ఘనమని వ్రాశాడు. (1 కోరింథీయులకు 11:14-15). ఇది పురుషుడికి లోబడి ఉండవలసిన స్త్రీ అనుసరించవలసిన విధానం. నాజీర్‌గా ఉన్న పురుషులు ఈ అవమానాన్ని భరించటానికి సిద్ధపడి ఉండాలి. ఇది బహుశా అతనికి దేవునికి ఉన్న ఆధ్యాత్మికమైన సంబంధాన్నీ దేవుని సంకల్పానికి అతని విధేయతా భావాన్నీ సూచించవచ్చు.

6. అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.

ఈ విషయంలో నాజీర్‌గా ఉన్న వ్యక్తి యాజుల వలె ఉండాలి (లేవీయకాండము 21:1).

7. తన దేవునికి మీదు కట్ట బడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు.

మరణం అపవిత్రపరిచేది (లేవీయకాండము 21:1-4 నోట్‌). పైన చెప్పినవాటన్నింటినీ బట్టి చూస్తే యేసు క్రీస్తు నాజీర్‌గా ఉన్నవాడు కాదని అర్థమౌతున్నది. ఆయన ద్రాక్షరసం త్రాగాడు (మార్కు 14:23-25). మరణించిన వారిని ముట్టుకున్నాడు (మార్కు 5:41 లూకా 7:14). ఆయన వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయనుకోవటానికి ఏ ఆధారమూ లేదు. నజరేతువాడు, నాజీర్ అనే రెండు మాటలకు సంబంధం లేదు. అవి వేరువేరు మాటలు.

8. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.

9. ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.

మరణం పాపం వల్ల వచ్చే జీతం (రోమీయులకు 6:23). దాని అశుద్ధతను బలి అర్పణ ద్వారా తొలగించివేయాలి (లేవీయకాండము 5:7 లేవీయకాండము 13:1-44 లేవీయకాండము 11:1 నోట్‌). చర్మవ్యాధి ఉన్నవారికి చేసినట్టుగా నాజీర్‌గా ఉన్న మనిషికి పూర్తిగా తలవెంట్రుకలు గొరిగించాలి (లేవీయకాండము 14:8-9). తరువాత ఆ వ్యక్తి మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టి తన మొక్కుబడి చేయాలి.

10. ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని యొద్దకు తేవలెను.

11. అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దిన మున వాని తలను పరిశుద్ధ పరపవలెను.

12. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.

13. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరు వాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.
అపో. కార్యములు 21:23-24, అపో. కార్యములు 21:26

లేవీయకాండము 1:10-13 లేవీయకాండము 4:27-35 లేవీయకాండము 2:1-16 లేవీయకాండము 3:1-5. నాజీర్‌గా ఉన్న వ్యక్తి దేవునికి పూర్తిగా అంకితమైనప్పటికి యెహోవాకు ప్రత్యేకమైనప్పటికి (వ 8), అతనికి భ్రష్ట స్వభావము ఉంది. అతనికి శుద్ధీకరణ అవసరమే. ఈనాడు ఉన్న పవిత్రులూ, ఆధ్యాత్మికంగా ఉన్నతులూ, దేవునికి తమకు తాము సమర్పించు కున్న క్రైస్తవుల విషయం అయినా ఇంతే (1 తిమోతికి 1:15 రోమీయులకు 7:18 యాకోబు 3:2 1 యోహాను 1:8-10 మత్తయి 6:12).

14. అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును,

15. గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను.

16. అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.

17. యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.

18. అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.
అపో. కార్యములు 18:18

ఒక నాజీర్ దేవునికి ప్రత్యేకంగా ఉన్నాడనటానికి అతని పొడవైన వెంట్రుకలే గుర్తు కాబట్టి మొక్కుబడి రోజులు అయిపోగానే వాటిని గొరిగించి కాల్చివెయ్యాలి.

19. మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను.

20. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠిత మైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరు వాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.

21. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
అపో. కార్యములు 21:23-24

22. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

తన ప్రజలను ఈ విధంగా దీవించాలని దేవుడే యాజులతో చెప్పాడు. వారు ప్రత్యేకంగా ఈ దీవెనలను అనుభవించాలని ఆయన కోరాడన్నమాట. వీటన్నిటినీ కలిపితే పరిపూర్ణమైన జీవితం దేవుని ప్రజలకు లభిస్తుంది. శత్రువుల నుంచి భద్రత, క్షేమం వారికి ఉండాలి (24 వ; ద్వితీయోపదేశకాండము 28:1-6 1 సమూయేలు 2:9 కీర్తనల గ్రంథము 12:7 కీర్తనల గ్రంథము 31:20 కీర్తనల గ్రంథము 91:11 యోహాను 17:11 యోహాను 17:15). వారి దైనందిన జీవిత యాత్రలో వారికి వెలుగు ఉండాలి. దేవుని దయ, కృపలు వారి పక్షాన ఎప్పుడూ ఉండాలి (25 వ; కీర్తనల గ్రంథము 31:16 కీర్తనల గ్రంథము 67:1 కీర్తనల గ్రంథము 80:1 కీర్తనల గ్రంథము 80:3 కీర్తనల గ్రంథము 80:7 కీర్తనల గ్రంథము 80:19 కీర్తనల గ్రంథము 104:15 కీర్తనల గ్రంథము 119:135). తనతో వారికి సహవాసం ఎడతెరిపి లేకుండా ఉండాలి (26 వ; కీర్తనల గ్రంథము 21:6 కీర్తనల గ్రంథము 42:5 కీర్తనల గ్రంథము 29:11 కీర్తనల గ్రంథము 85:8 కీర్తనల గ్రంథము 119:165 యెషయా 9:6-7 యెషయా 26:3 యెషయా 32:17 యోహాను 14:27 యోహాను 16:33 రోమీయులకు 14:17). ఈనాటికి ఈ దీవెనలన్నీ తన ప్రజలకు లభించాలనే దేవుని అభిలాష. ఆయనలో నమ్మకం ఉంచిన వారందరికి క్రీస్తు సిలువ మూలంగా ఇవన్నీ దొరకగలవు. తన ప్రజలవైపు ఆయన ముఖాన్ని త్రిప్పడం, ఆయన ముఖకాంతి వారిమీద ప్రకాశించటం ఇవి ఆయన వారిని అంగీకరించి వారిని దయతో చూస్తున్నాడని అర్థమిస్తాయి. తన ముఖాన్ని వారినుంచి త్రిప్పేసుకోవడం అనేది ఆయన కోపపడుతున్నాడని అర్థమిస్తుంది (ద్వితీయోపదేశకాండము 31:17-18 ద్వితీయోపదేశకాండము 32:20 కీర్తనల గ్రంథము 13:1 కీర్తనల గ్రంథము 27:9 కీర్తనల గ్రంథము 69:17 కీర్తనల గ్రంథము 102:2 యెషయా 1:15). దేవుడు బైబిలును రాయించి ఇచ్చిన గొప్ప ఉద్దేశాలలో ఒకటి ఏమంటే దేవుని ఆశీర్వాదాలను ఎలా పొందాలో ప్రజలు నేర్చుకొని శాశ్వతంగా వాటిని అనుభవించాలనే.

23. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.

24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;

25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
రోమీయులకు 1:7

26. యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.

27. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |