Numbers - సంఖ్యాకాండము 7 | View All

1. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,

1. And when Moses had put up the House completely, and had put oil on it and made it holy, with all the things in it, and had made the altar and all its vessels holy with oil;

2. దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింపబడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.

2. Then the chiefs of Israel, the heads of their fathers' houses, made offerings; these were the chiefs of the tribes, who were over those who were numbered.

3. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి.

3. And they came with their offerings before the Lord, six covered carts and twelve oxen; a cart for every two of the chiefs, and for every one an ox.

4. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము;

4. And the Lord said to Moses,

5. అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.

5. Take the things from them, to be used for the work of the Tent of meeting; and give them to the Levites, to every man what is needed for his work.

6. మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను.

6. So Moses took the carts and the oxen and gave them to the Levites.

7. అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.

7. Two carts and four oxen he gave to the sons of Gershon for their work;

8. అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.

8. And four carts and eight oxen he gave to the sons of Merari for their work, under the direction of Ithamar, the son of Aaron the priest.

9. కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.

9. But to the sons of Kohath he gave nothing; because they had the care of the holy place, taking it about on their backs.

10. బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి.

10. And the chiefs gave an offering for the altar on the day when the holy oil was put on it; they made their offering before the altar.

11. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను.

11. And the Lord said to Moses, Let every chief on his day give his offering to make the altar holy.

12. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.

12. And he who made his offering on the first day was Nahshon, the son of Amminadab, of the tribe of Judah:

13. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

13. And his offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

14. ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

14. One gold spoon of ten shekels, full of spice for burning;

15. దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱె పిల్లను

15. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

16. అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

16. One male of the goats for a sin-offering;

17. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము.

17. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Nahshon, the son of Amminadab.

18. రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు.

18. On the second day Nethanel, the son of Zuar, chief of Issachar, made his offering:

19. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

19. He gave one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

20. ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

20. One gold spoon of ten shekels, full of spice;

21. దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

21. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

22. ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను

22. One male of the goats for a sin-offering;

23. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.

23. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Nethanel, the son of Zuar.

24. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను

24. On the third day Eliab, the son of Helon, chief of the children of Zebulun:

25. నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

25. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

26. ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

26. One gold spoon of ten shekels, full of spice;

27. ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

27. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

28. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

28. One male of the goats for a sin-offering;

29. అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.

29. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Eliab, the son of Helon.

30. నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను

30. On the fourth day Elizur, the son of Shedeur, chief of the children of Reuben:

31. డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

31. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

32. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

32. One gold spoon of ten shekels, full of spice;

33. ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను

33. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

34. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

34. One male of the goats for a sin-offering;

35. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.

35. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Elizur, the son of Shedeur.

36. అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. ఒ

36. On the fifth day Shelumiel, the son of Zurishaddai, chief of the children of Simeon:

37. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

37. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

38. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను

38. One gold spoon of ten shekels, full of spice;

39. ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

39. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

40. పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

40. One male of the goats for a sin-offering;

41. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.

41. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Shelumiel, the son of Zurishaddai.

42. ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపా.

42. On the sixth day Eliasaph, the son of Reuel, chief of the children of Gad:

43. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

43. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

44. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

44. One gold spoon of ten shekels, full of spice;

45. దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

45. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

46. పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

46. One male of the goats for a sin-offering;

47. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.

47. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Eliasaph, the son of Reuel

48. ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.

48. On the seventh day Elishama, the son of Ammihud, chief of the children of Ephraim:

49. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

49. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

50. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

50. One gold spoon of ten shekels, full of spice;

51. దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను

51. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

52. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

52. One male of the goats for a sin-offering;

53. అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము.

53. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Elishama, the son of Ammihud.

54. ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు.

54. On the eighth day Gamaliel, the son of Pedahzur, chief of the children of Manasseh:

55. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

55. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

56. దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

56. One gold spoon of ten shekels, full of spice;

57. అపరాధపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను

57. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

58. అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

58. One male of the goats for a sin-offering;

59. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము.

59. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Gamaliel, the son of Pedahzur.

60. తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.

60. On the ninth day Abidan, the son of Gideoni, chief of the children of Benjamin:

61. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని

61. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

62. దహనబలిగా ఒక చిన్న కోడెను

62. One gold spoon of ten shekels, full of spice;

63. ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

63. One young ox, one male sheep, one he-lamb of the first year for a burned offering;

64. పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

64. One male of the goats for a sin-offering;

65. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

65. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Abidan, the son of Gideoni.

66. పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి

66. On the tenth day Ahiezer; the son of Ammishaddai, chief of the children of Dan:

67. నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని

67. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

68. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

68. One gold spoon of ten shekels, full of spice;

69. దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను

69. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

70. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

70. One male of the goats for a sin-offering;

71. అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము.

71. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Ahiezer, the son of Ammishaddai.

72. పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.

72. On the eleventh day Pagiel, the son of Ochran, chief of the children of Asher:

73. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

73. His offering was one silver plate; a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

74. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

74. One gold spoon of ten shekels, full of spice;

75. దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

75. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

76. ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను

76. One male of the goats for a sin-offering;

77. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.

77. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Pagiel, the son of Ochran.

78. పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.

78. On the twelfth day Ahira, the son of Enan, chief of the children of Naphtali:

79. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

79. His offering was one silver plate, a hundred and thirty shekels in weight, one silver basin of seventy shekels, by the scale of the holy place; the two of them full of the best meal mixed with oil for a meal offering;

80. ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను

80. One gold spoon of ten shekels, full of spice;

81. ఒకపొట్టెలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను

81. One young ox, one male sheep, one he-lamb of the first year, for a burned offering;

82. అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.

82. One male of the goats for a sin-offering;

83. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.

83. And for the peace-offerings, two oxen, five male sheep, five he-goats, five he-lambs of the first year: this was the offering of Ahira, the son of Enan.

84. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది.

84. These were the offerings given for the altar by the chiefs of Israel, when the holy oil was put on it: twelve silver plates, twelve silver basins, twelve gold spoons;

85. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.

85. The weight of every silver plate was a hundred and thirty shekels, and of every basin seventy; the weight of all the silver of the vessels was two thousand and four hundred shekels, by the scale of the holy place;

86. ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,

86. The weight of the twelve gold spoons of spice for burning was ten shekels for every one, by the scale of the holy place; all the gold of the spoons was a hundred and twenty shekels;

87. సమాధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు,

87. All the oxen, for the burned offering were twelve, the male sheep twelve, the he-lambs of the first year twelve, with their meal offering; and the males of the goats for sin-offering twelve;

88. పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది.

88. And all the oxen for the peace-offerings, twenty-four oxen, the male sheep sixty, and the he-goats sixty, the he-lambs of the first year sixty. This was given for the altar after the holy oil was put on it.

89. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

89. And when Moses went into the Tent of meeting to have talk with him, then the Voice came to his ears from over the cover which was on the ark of witness, from between the two winged ones. And he had talk with him.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
గుడారం యొక్క ప్రతిష్ఠాపనలో యువరాజుల అర్పణలు. (1-9) 
ఆరాధన కోసం ప్రత్యేక భవనం పూర్తయినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అంతా సిద్ధమయ్యే వరకు వారు ఆఫర్ చేయలేరు. ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం ముఖ్యం. ఎవరైనా ఎంత ముఖ్యమో, వారు ఇతరులకు మరియు దేవునికి అంత ఎక్కువగా సహాయం చేయగలరు. భవనం పూర్తయిన వెంటనే, అవసరమైతే, వారు దానిని తరలించవచ్చని నిర్ధారించారు. విషయాలు స్థిరపడినట్లు అనిపించినప్పటికీ, మనం పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండాలి.

బలిపీఠం యొక్క సమర్పణలో యువరాజుల అర్పణలు. (10-89)
రాకుమారుల వంటి ముఖ్యమైన వ్యక్తులు, ప్రజలు మరింత మతపరమైన మరియు దేవుని సేవ చేసేలా చేయడానికి వారి శక్తిని మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి. సంతోష సమయాల్లో కూడా, మన తప్పులను క్షమించమని అడగాలి. క్షమించబడడానికి సహాయం చేయమని యేసును అడగాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు వేర్వేరు రోజులలో తమ నైవేద్యాలను తీసుకువచ్చారు. దేవుని కార్యాన్ని శ్రద్ధగా, తొందరపాటు లేకుండా చేయాలి. మన సమయాన్ని వెచ్చించి పనులు చక్కగా చేయడం మంచిది. చాలా కాలం పాటు ఏదైనా చేయవలసి వచ్చినా దానిని భారంగా భావించకూడదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే, నైవేద్యాలలో సమాన వాటా. మోషేతో మాట్లాడే వ్యక్తి ట్రినిటీలో రెండవ వ్యక్తి, అతను ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు మరియు ప్రపంచాన్ని సృష్టించాడు మరియు చర్చిని పరిపాలిస్తాడు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |