ఆమె విసుగు చెందకుండా పట్టు విడవకుండా అడగడంలో తన నమ్మకం ఎంత గొప్పదో రుజువు చేసింది. మౌనం గానీ (వ 23), శిష్యుల నిరాకరణ గానీ (వ 23), ఆమెకు ఏ హక్కూ లేదన్నట్టు చెప్తున్న సిద్ధాంతం గానీ (వ 24), గర్వాన్ని రేకెత్తించగలిగే ఎలాంటి విషమ పరీక్ష గానీ (వ 26) ఆమెను ఆపలేకపోయాయి. యేసు తనకు సహాయం చేయగలడనీ, చేస్తాడనీ ఆమె గట్టి నమ్మకం. ఆయన అలా చేసేదాకా అడుగుతూనే ఉండాలనీ ఆమె నిశ్చయించుకుంది. లూకా 11:5-10; లూకా 18:1-8 పోల్చి చూడండి. యేసు దృష్టిలో నమ్మకం ఎంత ప్రాముఖ్యమో, దాన్ని ఆయన ఎంతగా మెచ్చుకుని ప్రతిఫలమిస్తాడో గమనించండి (మత్తయి 8:10; మత్తయి 9:22, మత్తయి 9:29; మత్తయి 17:20; మత్తయి 21:21-22. హెబ్రీయులకు 11:6 చూడండి).